కేఎఫ్సీలు నిరవధికంగా మూత
కఠ్మాండు: ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ సంస్థ కేఎఫ్సీ, పిజ్జా హట్కు చెందిన నాలుగు రెస్టారెంట్లు నేపాల్లో నిరవధికంగా మూసివేశారు. స్థానిక కార్మికులకు, సంస్థ యాజమాన్యానికి మధ్య వివాదం తలెత్తి ఈ పరిస్థితికి దారి తీసింది. గంటల కొద్ది పనిచేయించుకుంటున్నారని, వాటిని తగ్గించాలని కార్మికులు డిమాండ్ చేయగా అందుకు యాజమాన్యం నిరాసక్తి చూపించడంతో వాటిని మూసి వేసింది. దీంతోపాటు యాజమాన్యంలోని ఒక మేనేజర్పై కూడా కార్మికులు దాడి చేశారని, అది కూడా ఒక కారణమని చెప్పారు. నేపాల్లో దేవయాని ఇంటర్నేషనల్ అనే సంస్థ కేఎఫ్సీ బ్రాంచ్లను నిర్వహిస్తోంది. గత మే 13 నుంచి కేఎఫ్సీలు మూతపడే ఉన్నాయి.