Pizza Hut
-
పిజ్జా హట్ కో ఫౌండర్ ఇక లేరు
వాషింగ్టన్: కరోనా మహమ్మారి అనేక మంది ప్రముఖులను పొట్టన పెట్టుకుంటోంది. కోవిడ్-19 నుంచి కోలుకున్న తరువాత వృద్దుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా పలువురు మృత్యువాత పడుతున్నారు. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త, పిజ్జా హట్ సహ వ్యవస్థాపకుడు ఫ్రాంక్ కార్నే(82) న్యుమోనియాతో మరణించారు. గత దశాబ్ద కాలంగా అల్జీమర్స్ తో బాధపడుతున్న కార్నీ ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు. కానీ ఆ తరువాత న్యుమోనియా వ్యాధి సోకింది. దీంతో పరిస్థితి విషమించడంతో బుధవారం కన్నుమూశారని అతని భార్య, సోదరుడు ప్రకటించారు. (కరోనా: జైపూర్ మాజీ మహారాజా కన్నుమూత) 1958లో సోదరుడు డాన్ (26) తో కలిసి అమెరికా, కాన్సాస్ రాష్ట్రంలోని విచితాలో 19 ఏళ్ల వయసులో పిజ్జా హట్ సామ్రాజ్యాన్ని ప్రారంభించారు ఫ్రాంక్ కార్నె. వారి తల్లిదండ్రులనుంచి అప్పుగాతీసుకున్న 600 డాలర్లతో ప్రారంహించిన సంస్థ అంచలంచెలుగా వృద్ధిని సాధించి దిగ్గజ సంస్థగా అవతరించింది. ఈ నేపథ్యంలో 1977లో పిజ్జా హట్‌ను 300 మిలియన్ డాలర్లకు పెప్సికో కొనుగోలు చేసింది. ఆ తరువాత ఇతర ఆహార సంస్థలు, రియల్ ఎస్టేట్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటోమోటివ్, వినోద వ్యాపారాలతో సహా వివిధ వ్యాపార సంస్థలలో పెట్టుబడులు పెట్టారు. కాగా అమెరికాలో కరోనా మహమ్మారి ప్రకంపనలు అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. వైరస్ బారిన పడి ఆసుపత్రిలలో చేరుతున్నవారి సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతోంది. ఆసుపత్రులకు చేరుతున్న బాధితుల సంఖ్య ప్రస్తుతం లక్షకు చేరింది. అలాగే నిన్న ఒక్కరోజే 2731 మంది మహమ్మారికి బలయ్యారు. కొత్తగా 1,95,121 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,43,13,941కు చేరింది. -
కాంటాక్ట్ లెస్ పిజ్జా డెలివరీ
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నగరవ్యాప్తంగా ఉన్న పిజ్జా ప్రియుల కోసం కాంటాక్ట్ లెస్ డెలివరీ, కాంటాక్ట్ లెస్ టేక్ అవే పద్ధతులను ప్రవేశపెట్టినట్టు నగరానికి చెందిన పిజ్జా హట్ నిర్వాహకులు తెలిపారు. తమ యాప్, ఎమ్.సైట్, వెబ్‌సైట్స్‌తో పాటు విభిన్న మార్గాల్లో పిజ్జా ఆర్డర్లు ఇచ్చిన వారికి 240 సెల్సియస్ డిగ్రీల వేడిలో కనీసం 6 నిమిషాల పాటు బేక్ చేసి అందిస్తామన్నారు. -
యువ పారిశ్రామికవేత్తలకు అండ: కేటీఆర్
కాచిగూడ: యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన సీఎం ఎస్టీ ఎంటర్‌పెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్ స్కీమ్‌లో భాగంగా హిమాయత్‌నగర్‌లో మహిళా పారిశ్రామికవేత్త గౌతమి ఏర్పాటు చేసిన ‘చీసీయానో పిజ్జా’సెంటర్‌ను గురువారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘నేనే స్వయంగా వచ్చి షాప్ ప్రారంభిస్తానని ఈ నెల తొలివారంలో గౌతమికి మాటిచ్చాను. అందులో భాగంగానే ఈరోజు షాప్ ఓపెనింగ్‌కు వచ్చాను’అని తెలిపారు. ప్రతి గిరిజన బిడ్డ ఇలాంటి సెంటర్లను ఏర్పాటు చేసి ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. గిరిజన ఆడబిడ్డలకు హైదరాబాద్‌లో పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సాహకం ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన బిడ్డ ఇక్కడ పిజ్జా షాప్ ఓపెన్ చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. హిమాయత్ నగర్లో పిజ్జా సెంటర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్ -
టీనేజీ బాలికపై అఘాయిత్యం
లండన్: బ్రిటన్‌లోని ఎప్సమ్ ప్రాంతంలో ఓ టీనేజీ బాలిక(17)పై ఒక దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి ఎప్సమ్‌లోని పిజా హట్ రెస్టారెంట్లో ఉన్న ఆమెను 32 ఏళ్ల వ్యక్తి బలవంతంగా సమీప ప్రాంతానికి ఈడ్చుకుపోయి అత్యాచారం చేశాడు. తర్వాత కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. బాలికను పోలీసులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. నిందితుడిని సర్రీ ఏరియా పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన 15నిమిషాల్లోపే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలితో అతడికి ముందే పరిచయం ఉందని అనుమానిస్తున్నారు. -
కేఎఫ్‌సీలు నిరవధికంగా మూత
కఠ్మాండు: ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ సంస్థ కేఎఫ్‌సీ, పిజ్జా హట్‌కు చెందిన నాలుగు రెస్టారెంట్లు నేపాల్‌లో నిరవధికంగా మూసివేశారు. స్థానిక కార్మికులకు, సంస్థ యాజమాన్యానికి మధ్య వివాదం తలెత్తి ఈ పరిస్థితికి దారి తీసింది. గంటల కొద్ది పనిచేయించుకుంటున్నారని, వాటిని తగ్గించాలని కార్మికులు డిమాండ్ చేయగా అందుకు యాజమాన్యం నిరాసక్తి చూపించడంతో వాటిని మూసి వేసింది. దీంతోపాటు యాజమాన్యంలోని ఒక మేనేజర్‌పై కూడా కార్మికులు దాడి చేశారని, అది కూడా ఒక కారణమని చెప్పారు. నేపాల్‌లో దేవయాని ఇంటర్నేషనల్ అనే సంస్థ కేఎఫ్‌సీ బ్రాంచ్‌లను నిర్వహిస్తోంది. గత మే 13 నుంచి కేఎఫ్‌సీలు మూతపడే ఉన్నాయి.