కరోనా వైరస్ మహమ్మారి వ్యాపారంలో నిర్మాణాత్మక మార్పులను తీసుకువచ్చింది. ఇలాంటి సమయంలో ఎవరైనా కొంత వ్యాపారాన్ని ప్రారంభించాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు. కానీ, అమెరికాకు చెందిన ఫాస్ట్ ఫుడ్ సంస్థ కెంటకీ ఫ్రైడ్ చికెన్(కేఎఫ్‌సీ) భారతదేశంలో తమ రెస్టారెంట్ వ్యాపార నెట్వర్క్ ను విస్తరింపజేయాలని ఆలోచనలో ఉంది. రాబోయే సంవత్సరాల్లో భారత దేశం వృద్ధి గణనీయంగా పెరగనున్నట్లు తాను నమ్ముతున్నానని కేఎఫ్‌సీ కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గత ఏడాది కరోనా మహమ్మారి సృష్టించిన ఇబ్బందికర పరిణామాల మధ్యలో కూడా సుమారు 30 కొత్త రెస్టారెంట్లను కేఎఫ్‌సీ ఇండియా ప్రారంభించింది.
ఈ సంవత్సరం కూడా కొత్త ఔట్‌లెట్లను స్థాపించాలని చూస్తోంది. భారతదేశంలో వినియోగదారులు కేఎఫ్‌సీ చికెన్ పై ఎక్కువగా మక్కువ చూపిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ లో కూడా ఇండియా మార్కెట్ లో కేఎఫ్‌సీ బిజినెస్ బాగా సాగుతుందని భావిస్తోంది. కేఎఫ్‌సీ బ్రాండ్‌ను విస్తరింప చేసే ప్రణాళికలో భాగంగా కొత్త ఔట్‌లెట్లను ప్రారంభిస్తున్నట్లు సంస్థ పేర్కొన్నది. అంతేకాకుండా కస్టమర్లకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ మా బ్రాండ్ విలువ పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నామని కేఎఫ్‌సీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మీనన్ అన్నారు. కరోనా మహమ్మారి రాకముందు ఇండియాలో ఉన్న కేఎఫ్‌సీ రెస్టారెంట్ల సంఖ్య 450గా ఉంటే ప్రస్తుతం 130కి పైగా నగరాల్లో 480కి పైగా రెస్టారెంట్లు ఉన్నాయి.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment