
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వీడీ12 మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల కేరళలో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నారు. అంతేకాకుండా బాలీవుడ్‌లో ఓ ఆల్బమ్ సాంగ్‌లో వీడీ కనిపించనున్నారు. సాహిబా అనే సాంగ్ కోసం ప్రముఖ బాలీవుడ్ సింగర్ జస్లిన్ రాయల్‌తో కలిసి పని చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఇటీవల ముంబయిలో ప్రకటించారు. షూటింగ్‌కు కాస్తా గ్యాప్ రావడంతో విజయ్ చిల్ అవుతున్నారు.
(ఇది చదవండి: కిందపడ్డ విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్!)
అయితే తాజాగా ఆయన తన ఫెవరేట్ ఫుడ్ కేఎఫ్‌సీ చికెన్ తింటూ గాల్లో ఎంజాయ్ చేశారు. హాట్ ఎయిర్ బెలూన్‌లో ప్రయాణిస్తూ గాల్లోనే ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆకాశంలో విహరిస్తూ తనకు ఇష్టమైన కేఎఫ్‌సీ ఫుడ్ తింటూ కనిపించారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment