కిందపడ్డ విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్! | Tollywood Hero Vijay Devarakonda Steps Down At A event In Mumbai Video Goes Viral | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: కిందపడ్డ విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్!

Published Fri, Nov 8 2024 3:40 PM | Last Updated on Fri, Nov 8 2024 5:22 PM

Tollywood Hero Vijay Devarakonda Steps Down At A event In Mumbai Video Goes Viral

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే కేరళలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు.  ప్రస్తుతం విజయ్ వీడీ12 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఆ తర్వాత టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్‌ సంకృత్యాన్, రవి కిరణ్‌ కోలాల దర్శకత్వాల్లోనూ సినిమాలు చేసేందుకు విజయ్‌ దేవరకొండ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.  

అయితే తాజాగా విజయ్ దేవరకొండ ముంబయిలో సందడి చేశారు. ఓ ఈవెంట్‌కు హాజరైన విజయ్ అనుకోకుండా స్టెప్స్‌పై కిందపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే విజయ్‌కి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. విజయ్ కిందపడ్డ వెంటనే పక్కనే ఉన్నవాళ్లంతా అలర్ట్‌ అయ్యారు. ఆ తర్వాత విజయ్ సాధారణంగా నడుచుకుంటూ వెళ్లారు.

తొలిసారి మ్యూజిక్ ఆల్బమ్‌లో విజయ్

అయితే విజయ్ దేవరకొండ ఓ మ్యూజిక్ ఆల్బమ్‌ వీడియోలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. తన కెరీర్‌లో మొద‌టిసారి హిందీ మ్యూజిక్ వీడియో సాంగ్‌లో విజయ్ కనిపించనున్నారు. ఈ సాంగ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ రాధికా మ‌ద‌న్ నటిస్తోంది సాహిబా పేరుతో హిందీ వీడియో సాంగ్‌కు ఫేమ‌స్ బాలీవుడ్ పాప్ సింగ‌ర్ జ‌స్లీన్ రాయ‌ల్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సాంగ్‌కు సుధాన్షు సారియా ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా..త్వరలోనే ఈ పాటను విడుదల కానుంది. ఈ ఈవెంట్‌ కోసమే విజయ్ ప్రస్తుతం ముంబయికి వెళ్లినట్లు తెలుస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement