కెంటకీ ఫ్రైడ్ చికెన్ (KFC) అరుదైన ప్రయోగానికి సిద్ధపడింది. ప్లాంట్ బేస్డ్ చికెన్‌ను కస్టమర్ల కోసం తీసుకురాబోతోంది. అంటే అది శాకాహార చికెన్!!. మొక్కల నుంచి ఉత్పత్తి అయ్యే ‘మాంసం లాంటి’ ఫుడ్ అన్నమాట.
జనవరి 10న అమెరికాలో బియాండ్ మీట్ పేరుతో ఈ ‘మాంసం కానీ మాంసం(చికెన్)’ ఫ్రైడ్ రుచులను కస్టమర్లకు అందించబోతోంది. వాస్తవానికి గత కొన్నేళ్లుగా మాంసం పత్యామ్నాయాల కోసం పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ల్యాబ్‌లో పెంచుతున్న మాంసం, తక్కువ మాంసం మోతాదు ఉన్న ఉత్పత్తులతో పాటు మాంసానికి ప్రత్యామ్నాయంగా మొక్కల ఆధారిత మాంసం మీద పరిశోధకులు ఫోకస్ ఉంటోంది.
లెగ్యుమెస్ (సోయాబీన్స్, లెంటిల్స్), క్వినోవా లాంటి ధాన్యాలు, కోకోనట్ ఆయిల్, సెయిటన్, పచ్చి బఠానీ లాంటి ప్రొటీన్లు ఉన్న కూరగాయల్ని, ఇతరత్రాల్ని ప్లాంట్ బేస్డ్ మీట్స్‌లో ఉపయోగిస్తారు. సో.. ఇది ప్యూర్ వెజ్ మీట్ అన్నమాట.
యమ్ కంపెనీలో బిగ్గెస్ట్ బ్రాండ్‌గా పేరున్న కేఎఫ్‌సీ ఒక్క అమెరికాలోనే 4వేలకు పైగా రెస్టారెంట్లను కలిగి ఉన్న విషయం తెలిసిందే. యమ్‌లోనే కేఎఫ్‌సీ తరపున బియాండ్ మీట్ కంపెనీ వేరుగా శాఖాహార ఫుడ్ ప్రొడక్టులతో 2019 ఆగష్టు నుంచి(అట్లాంటా కేంద్రంగా) కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇక శాఖాహార ‘చికెన్’ ప్రకటన నేపథ్యంలో బియాండ్ షేర్లు 7 శాతం మేర పెరగడం విశేషం. బియాండ్ ఫ్రైడ్ చికెన్ ధర 7 డాలర్లు(దాదాపు 500రూ. పైనే) నిర్ణయించారు. త్వరలో ఈ ఫ్రాంచైజీలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది బియాండ్ మీట్.
Comments
Please login to add a commentAdd a comment