Kfc chicken
-
హైదరాబాద్‌లో 100 రెస్టారెంట్ల సిబ్బందికి శిక్షణ
అమెరికన్ ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కేఎఫ్‌సీ) హైదరాబాద్‌లో 100 రెస్టారెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. ‘ఇండియా సహయోగ్ ప్రోగ్రామ్’ పేరుతో ఇప్పటికే 2021లో స్థానికంగా 100 రెస్టారెంట్లలో పని చేస్తున్న వారికి ఈ కార్యక్రమం ద్వారా శిక్షణ కల్పించింది. తాజాగా మరో 100 రెస్టారెంట్లలోని సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది.ఇండియా సహయోగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎంపిక చేసుకున్న రెస్టారెంట్లలోని సిబ్బందికి ఆహార భద్రత, పరిశుభ్రత, కస్టమర్ సర్వీస్, లాభదాయకత..వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. దీనివల్ల స్థానిక రెస్టారెంట్లు వృద్ధి చెందడంతోపాటు కస్టమర్లకు మెరుగైన ఆహారం, సేవలందేలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, గౌహతి, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో దాదాపు 800 రెస్టారెంట్లలో సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఈ సందర్భంగా కేఎఫ్‌సీ ఇండియా, పార్టనర్ కంట్రీస్ జనరల్ మేనేజర్ మోక్ష్ చోప్రా మాట్లాడుతూ..‘ఆహార పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోంది. మారుతున్న ట్రెండ్లు, కస్టమర్ ప్రాధాన్యతలు, వారి డిమాండ్లకు అనుగుణంగా సర్వీస్ అందించడం చాలా ముఖ్యం. ఇండియా సహయోగ్ కార్యక్రమంలో భాగంగా 2024 నాటికి దేశవ్యాప్తంగా 1000 రెస్టారెంట్లకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈ కార్యక్రమం నిర్వహణకు నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ), ఎఫ్ఎస్ఎస్ఏఐకు చెందిన ఫుడ్ సేఫ్టీ అండ్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ (ఎఫ్‌ఓఎస్‌టీఏసీ) ప్రోగ్రామ్ అధికారులతో కలిసి పని చేస్తున్నాం. హైదరాబాద్‌లో ఈ ప్రోగ్రామ్ కింద 2021లో 100 రెస్టారెంట్లకు శిక్షణ ఇచ్చాం. తాజాగా మరో 100 రెస్టారెంట్లలోని సిబ్బందికి అవగాహన కల్పించనున్నాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: ఏళ్లు గడిచినా గతం గుర్తుండేలా.. కొత్త పరికరం ఆవిష్కరణతెలంగాణ ఆహార భద్రత కమిషనర్ ఆర్వి కర్ణన్ మాట్లాడుతూ..‘ఆహార భద్రత, పరిశుభ్రతకు వినియోగదారులు పెద్దపీట వేస్తున్నారు. పట్టణ ఆర్థిక వ్యవస్థలో స్థానిక రెస్టారెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆహార భద్రత విషయంలో ప్రతి రెస్టారెంట్ యాజమాన్యం సరైన నాణ్యతాప్రమాణాలు పాటించాలి. ఈమేరకు స్థానిక రెస్టారెంట్ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న కేఎఫ్‌సీ ప్రయత్నాలు అభినందనీయం’ అన్నారు. ఆహార భద్రత పరిశ్రమ వృద్ధికి ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) మద్దతుగా ఉంటుందని సంస్థ ప్రెసిడెంట్ సురేష్ సింఘాల్ తెలిపారు. -
రూ.149కే కేఎఫ్‌సీ లంచ్ స్పెషల్ - వివరాలు
2024 ప్రారంభంలోనే కేఎఫ్‌సీ 'లంచ్ స్పెషల్' అనే కొత్త ఆఫర్ తీసుకువచ్చింది. ఈ ఆఫర్ కింద కేఎఫ్సీలో ఇష్టమైన వాటిని బుక్ చేసుకోవచ్చు. ప్రారంభ ధర రూ.149 మాత్రమే కావడం విశేషం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కేఎఫ్‌సీ అందించే ఓ స్పెషల్ ఆఫర్ 149 రూపాయలతో ప్రారంభమవుతుంది. వినియోగదారులు లాంగర్ బర్గర్లు, రోల్స్ లేదా రైస్ బౌల్జ్తో పాటు ఐకానిక్ హాట్ & క్రిస్పీ చికెన్, పెరి పెరీ చికెన్ స్ట్రిప్స్ లేదా ఫ్రైస్‌తో పాటు రిఫ్రెష్ డ్రింక్స్ వంటి వాటిని ఆర్డర్ చేసుకోవచ్చు. వీటి ధరలు వివిధ రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. కేఎఫ్‌సీ లంచ్ స్పెషల్స్ అనేది అన్ని కేఎఫ్‌సీ రెస్టారెంట్లలో ఉదయం 11:00 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఇది కూడా 5X సేఫ్టీ ప్రామిస్ ఆఫ్ శానిటైజేషన్, స్క్రీనింగ్, సోషల్ డిస్టెన్సింగ్, వ్యాక్సినేషన్ టీమ్‌లతో ఉంటుంది. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ ఆటోలో కనిపించిన సీఈఓ - ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఇలా.. ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తులు మాత్రమే కాకుండా రెస్టారెంట్‌లోని అన్ని ప్రాంతాలు క్రమం తప్పకుండా శుభ్రంగా ఉంచుతారు. సంస్థ రైడర్ల ఆరోగ్య పరిస్థితులను కూడా క్రమం తప్పకుండా నోటీస్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కస్టమర్ ఆరోగ్య రక్షణను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కేఎఫ్‌సీ లంచ్ స్పెషల్స్ కోసం కేఎఫ్‌సీ యాప్ లేదా వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోవచ్చు. -
మీకు తెలుసా! అక్కడ పోలీస్‌ల వద్ద ఆయుధం ఉండకూడదట!
కొన్ని దేశాల్లో విద్యా విధానం నుంచి ఆఫీసర్ల హోదాల వరకు కాస్త భిన్నంగా ఉంటాయి. చాలా వరకు కొన్ని విషయాల్లో అన్ని దేశాలు దాదాపు ఒకే విధానాన్ని అనుసరిస్తాయి. ఐతే కొన్ని మాత్రం చాలా విచిత్రంగా ఉంటాయి. ఎంతలా అంటే ఆయా విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో కొన్ని చూద్దాం! నార్వే చిన్న దేశమైనా కూడా కరోనా సమయంలో అన్ని దేశాలకు వైద్య సేవలందించి శభాష్ అనిపించుకున్న సంగతి తెలిసిందే. అలాంటి నార్వేలో పోలీస్ ఆఫీసర్ కావాలంటే ప్రత్యేకించి పోలీస్ యూనివర్సిటీలో డిగ్రీ చేయాలి. అంతేగాదు మొదటి రెండు సంవత్సరాలు క్రిమినల్ లా, ఎథిక్స్, సోషల్ సైన్సెస్ చదువుకోవాల్సి ఉంటుంది. మూడో సంవత్సరం ప్రాక్టికల్ ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. అక్కడ పోలీసులే ప్రాసిక్యూటర్లుగా వ్యవహరిస్తారు. అక్కడ ఏకీకృత పోలీసు విధానం అమలులో ఉంది. ఒకే ఒక పౌర పోలీసు దళం ఉంటుంది. పైగా అక్కడ ప్రాంతాలు లేదా నగరాలకు సొంత పోలీసు బలగాలు కలిగి ఉంటాయట. పోలీసులంతా నేషనల్ పోలీస్ డైరెక్టరేట్ కిందే పనిచేస్తారు. ఇక్కడ పోలీసులకు చాలా అధికారాలుంటాయి. అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే పోలీసులంతా కూడా ఆయుధాలను ఎల్లప్పుడూ కలిగి ఉండకూదు. వారు తమ ఆయుధాలను పోలీసు కారులోని ట్రంక్‌లో లేదా లాకర్లో పెట్టుకోవాలట. నార్వేలో నేరాలు, హత్యలు జరిగే సంఖ్య చాల తక్కువ. అలాగే విధినిర్వహణలో చనిపోయే పోలీసుల సంఖ్య కూడా అత్యల్పమేనట. నార్వేలో పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. అల్లర్లు, ఉద్రిక్తతలకు తావివ్వకుండా ఎల్లప్పుడూ శాంతిగా ఉండేలా పోలీసులు గట్టిగా పర్వవేక్షించడం విశేషం. కేఎఫ్‌సీ రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం ఇక అలాగే మరో విచిత్రమైన అంశం ఏంటంటే అందరూ ఇష్టంగా లాగించే ప్రఖ్యాత ఫాస్ట్ ఫుడ్ కెంటకీ ఫ్రైడ్ చికెన్(కేఎఫ్‌సీ) స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టి ఆశ్చర్యపరిచింది. 2008లో రోడ్లపై గుంతలను పూడ్చే ప్రాజెక్టును చేపట్టి తన కస్టమర్లకు మరింత చేరువయ్యే యత్నం చేసింది. అయితే ఇదంతా కేఎఫ్‌సీ ఎందుకు చేసిందంటే తన అమ్మకాలు తగ్గిపోవడంతో మార్కెటింగ్ ప్రచారం చేయాలనే యోచనతో చేసింది. అందులో భాగంగా కస్టమర్లకు దగ్గరఅవ్వాలి ఎంతలా అంటే వారెప్పటికీ మర్చిపోని ఫుడ్ సెంటర్‌గా గుర్తించుకోవాలనే విధంగా తన మార్కెటింగ్ ప్రచారం ఉండాలనుకుంది. అందులో భాగంగానే ఈ రోడ్లపై గుంతలను పూడ్చే పనులు చేపట్టింది. ఓ పక్క గుంతలను పూడ్చుతూ అక్కడ తన కేఎఫ్‌సీ బోర్డులు పెట్టి క్షేమంగా బయటకు వచ్చి..కెఎఫ్సీని ఆస్వాదించి ఆనందంగా వెళ్లండి అని ప్రచారం చేసుకుంది. ఓ పక్కన మార్కెటింగ్ తోపాటు సామాజిక సేవను జోడించి తనదైన తరహాలో దూసుకుపోతోంది. (చదవండి: ఆ దేశం పీతలను నిర్మూలించడానికి ఏకంగా రూ. 26 కోట్లు..!) -
శాఖాహార ‘చికెన్’! కేఎఫ్‌సీ అరుదైన ప్రయోగం
కెంటకీ ఫ్రైడ్ చికెన్ (KFC) అరుదైన ప్రయోగానికి సిద్ధపడింది. ప్లాంట్ బేస్డ్ చికెన్‌ను కస్టమర్ల కోసం తీసుకురాబోతోంది. అంటే అది శాకాహార చికెన్!!. మొక్కల నుంచి ఉత్పత్తి అయ్యే ‘మాంసం లాంటి’ ఫుడ్ అన్నమాట. జనవరి 10న అమెరికాలో బియాండ్ మీట్ పేరుతో ఈ ‘మాంసం కానీ మాంసం(చికెన్)’ ఫ్రైడ్ రుచులను కస్టమర్లకు అందించబోతోంది. వాస్తవానికి గత కొన్నేళ్లుగా మాంసం పత్యామ్నాయాల కోసం పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ల్యాబ్‌లో పెంచుతున్న మాంసం, తక్కువ మాంసం మోతాదు ఉన్న ఉత్పత్తులతో పాటు మాంసానికి ప్రత్యామ్నాయంగా మొక్కల ఆధారిత మాంసం మీద పరిశోధకులు ఫోకస్ ఉంటోంది. లెగ్యుమెస్ (సోయాబీన్స్, లెంటిల్స్), క్వినోవా లాంటి ధాన్యాలు, కోకోనట్ ఆయిల్, సెయిటన్, పచ్చి బఠానీ లాంటి ప్రొటీన్లు ఉన్న కూరగాయల్ని, ఇతరత్రాల్ని ప్లాంట్ బేస్డ్ మీట్స్‌లో ఉపయోగిస్తారు. సో.. ఇది ప్యూర్ వెజ్ మీట్ అన్నమాట. యమ్ కంపెనీలో బిగ్గెస్ట్ బ్రాండ్‌గా పేరున్న కేఎఫ్‌సీ ఒక్క అమెరికాలోనే 4వేలకు పైగా రెస్టారెంట్లను కలిగి ఉన్న విషయం తెలిసిందే. యమ్లోనే కేఎఫ్‌సీ తరపున బియాండ్ మీట్ కంపెనీ వేరుగా శాఖాహార ఫుడ్ ప్రొడక్టులతో 2019 ఆగష్టు నుంచి(అట్లాంటా కేంద్రంగా) కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇక శాఖాహార ‘చికెన్’ ప్రకటన నేపథ్యంలో బియాండ్ షేర్లు 7 శాతం మేర పెరగడం విశేషం. బియాండ్ ఫ్రైడ్ చికెన్ ధర 7 డాలర్లు(దాదాపు 500రూ. పైనే) నిర్ణయించారు. త్వరలో ఈ ఫ్రాంచైజీలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది బియాండ్ మీట్. -
కేఎఫ్‌సీ చికెన్‌లో కోడి తల.. కస్టమర్‌కు చేదు అనుభవం!
కేఎఫ్‌సీ చికెన్‌కు ప్రపంచవ్యాప్తంగా యమ క్రేజీ ఉందనడంతో అతిశయోక్తి లేదు! భోజన ప్రియులు ఈ ఫ్రైడ్ చికెన్‌ను లొట్టలేసుకులాగించేస్తారు. ఐతే ఓ మహిళ ముచ్చటపడి తన కిష్టమైన కేఎఫ్‌సీ చికెన్ బాక్స్‌ను ఆర్డరిచ్చిమరీ ఇంటికి తెచ్చుకుంది. తిందామని తెరిచిచూస్తే షాక్ కొట్టినంతపనైంది. ఇంగ్లాండ్‌లోని ట్వికెన్‌హామ్‌కు చెందిన గాబ్రియేల్ అనే మహిళ కేఎఫ్‌సీ టేక్అవే బాక్స్‌ను ఆర్డరిచ్చి తెప్పించుకుంది. ఐతే చికెన్ బాక్స్‌లో పిండి పూసిన కోడి తల కాయ వచ్చింది. పాక్షికంగా ఉడికిన తల, కళ్ళు, ముక్కుతో ఉన్న కోడి తలకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తను ఎదుర్కొన్న చేదుఅనుభవాన్ని పంచుకుంది. దీనిపై స్పందించిన కేఎఫ్‌సీ కంపెనీ ఈ ఫొటోను చూసి మేము ఆశ్చర్యపోతున్నాము. మొత్తం తల ఎలా వచ్చిందో, ఎలా జరిగిందో పరిశీలిస్తామని, ఈ తప్పు మళ్లీ జరగకుండా నివారిస్తామని తెలిపింది. అంతేకాకుండా ఆమెను కేఎఫ్‌సీ అధికారులు ఆమెను సంప్రదించి ఉచితంగా మరొక చికెన్ బాక్స్ అందించడమేకాకుండా ఆమెను, ఆమె కుటుంబం మొత్తాన్ని సదరు సెంటర్‌కు ఆహ్వానించింది. తాము ఏవిధంగా కిచెన్‌లో చికెన్ ప్రిపేర్ చేస్తామో తనిఖీ చేయమని అదే టేక్అవే కేఎఫ్‌సీ ప్లేస్‌కు రావల్సిందిగా కోరింది. కాగా గతంలో ఓ వ్యక్తికి కేఎఫ్‌సీ రెస్టారెంట్లో సరిగ్గా ఉడకని చికెన్ సర్వ్ చేసిన సంగతి తెలిసిందే! చదవండి: Good News! ఇక డెబిట్, క్రెడిట్ కార్డులు లేకుండానే ఆన్లైన్ షాపింగ్! -
ఛీ నా ఇల్లంతా పాడుచేసి....మొత్తం తినేసింది
యూఎస్:మన ఇళ్లల్లో కుక్కలు, పిల్లులు చోరబడి పాలు, బ్రెడ్ వంటి తినుబండరాలను తినేసి చిందరవందరంగా పడేయటం మన చూసి ఉంటాం. కానీ ఇక్కడ ఒక ఎలుగ బండి కేఎఫ్‌సీ చికెన్ తినేందుకు మాటు వేసి మరి అర్థరాత్రి వచ్చి తింటుంది. అసలు విషయంలోకి వెళ్లితే....కాలిఫోర్నియాలోని సియెర్రా మాడ్రే పట్టణానికి చెందిన ఒక వ్యక్తి తన ఇంట్లో నిద్రపోతుండగా వింత వింత శబ్దాలు వస్తుంటాయి. (చదవండి: అతనే గనుక ఆ సమయంలో అక్కడ లేకపోతే !) దీంతో ఆ వ్యక్తి వెంటనే తలుపు తెరిచి హాల్లోకి వచ్చి చూడగా వంటగది వైపు నుంచి వింత వింత శబ్దాలు వస్తున్నట్లు గుర్తిస్తాడు. అంతే మెల్లిగా భయపడుతూ వచ్చి చూస్తాడు. అక్కడ ఒక గోధమ రంగులో ఉన్న ఒక ఎలుగుబంటి కెఎఫ్సి చికెన్‌ని పరపర తింటుంది. అంతేకాదు వంటగది మొత్తం చిందరవందర చేస్తుంది. కానీ అది ఒక్కటే కాదని ఇంటి బయట ఇంకో ఎలుగుబంటి కూడా ఉందని ఆ తర్వాత గ్రహిస్తాడు. ఈ మేరకు ఆ వ్యక్తి ఆ ఎలుగుబంటిని ఏదోరకంగా బయటికి పంపించేస్తాడు. ఏదిఏమైన ఎటువంటి జంతువులు జోరబడకుండా మన ఇళ్లను జాగ్రత్తగా పరివేక్షించుకోవల్సిందే తప్పదు. (చదవండి: కాప్ 26 సదస్సులో జోబైడెన్ కునికిపాట్లు) -
కేఎఫ్‌సీ చికెన్ తింటున్నారా.. అయితే జాగ్రత్త!
కేఎఫ్‌సీ చికెన్ తెలియని వారు ఎవరూ ఉండరు. చిన్న నుంచి పెద్దవారి వరకు లొట్టలేసుకుంటూ తినేవారు చాలామంది ఉంటారు. లాక్డౌన్ అనంతరం కేఎఫ్‌సీ సెంటర్లు తిరిగి తెరుచుకోవడంతో భోజన ప్రియులు మళ్లీ క్యూ కడుతున్నారు. అయితే తాజాగా ఓ కస్టమర్‌కు కేఎఫ్‌సీ నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఇది ఎక్కడో వేరే రాష్ట్రంలో అనుకుంటే పొరబడ్డట్లే. హైదరాబాద్ నగరంలోనే చోటుచేసుకున్న ఆ వివరాలు ఇలా ఉన్నాయి. చికెన్ తినేందుకు సాయితేజ అనే వ్యక్తి కూకట్‌పల్లిలోని కేఎఫ్‌సీ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ చికెన్ ఆర్డర్ ఇవ్వగా.. కేఎఫ్‌సీ సిబ్బంది సరిగా ఉడకని చికెన్ పీస్‌లను సర్వ్ చేశారు. అది చూసిన కస్టమర్ షాక్ అయ్యి ఇలా ఉందేంటీ అని సిబ్బందికి ఫిర్యాదు చేయగా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఈ విషయాన్ని అతను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశాడు. హైదరాబాద్‌లోని జెఎన్టీయూ మెట్రో కేఎఫ్‌సీ స్టోర్ నుంచి నుంచి తీసుకున్న చికెన్‌లో నాణ్యత లేదని.. పీస్ అస్సలు ఉడకలేదంటూ సాయి తేజ వాపోయాడు. ఇలాంటి ఆహారాన్ని తింటే కస్టమర్లకు కడుపు నొప్పి సమస్యలు వస్తాయని, ఈ పరిశీలించాలంటూ కూకట్పల్లి జోనల్ కమిషనర్‌ను ట్యాగ్ చేశాడు. దీనిపై జీహెచ్ఎంసీ జోనల్ కమీషనర్ స్పందించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. @KFC_India Very Disappointed with the Quality of Food which was Taken today from JNTU Metro #kfcStore in #Hyderabad. The Piece was Not at all cooked & if you serve such kind of Food, Customers will get Stomach Problems. Req @zckukatpally Garu to Send @AMOH_KUKATPALLY for Checking pic.twitter.com/EysElyYLTc — SAITEZAA (@ActivistTeja) August 8, 2021 -
క్రేజీమెంటాలిటీ: కేఎఫ్‌సీ.. సీకేజీ
కేఎఫ్‌సీ చికెన్‌ను ఇష్టపడని మాంసాహారులు అరుదు. ఆ క్రేజీ చికెన్‌ను ఆరునెలల పాటు ఫ్రీగా తిన్నాడు. చైనాలోని 23 ఏళ్ల ఓ యువకుడు. పబ్లిసిటీ కోసం చాలా కంపెనీలు ఫ్రీ కూపన్లను అందిస్తుంటాయి కదా! అలాంటి ఫ్రీ కేఎఫ్‌సీ కూపన్లను వివిధ యాప్స్ ద్వారా సంపాదించటం మొదలుపెట్టాడు ఆ యువకుడు. వాటిని ఆన్లైన్లో అమ్ముతూ సుమారు రూ. రెండు లక్షల వరకు ఆర్జించాడు కూడా. అక్కడితో ఆగలేదు. తన పేరుతో ఉన్న కూపన్లను ఎవరో వాడుకున్నారంటూ ఫిర్యాదు చేసి మరికొన్ని కూపన్లనూ పొందాడు. ఇలా ఆరునెలల పాటు ఫ్రీగా చికెన్ తింటూ ఎంజాయ్ చేశాడు. హఠాత్తుగా పోలీసులు అతని నోటి కాడి చికెన్‌ను లాగేశారు. ఆ యువకుడి మోసాన్ని తెలుసుకొని. నిరూపించి రెండేళ్ల జైలు శిక్షనూ ఖరారు చేయించారు. సీకేజీ.. చిప్పకూడు గతి పట్టించారు. ప్చ్.. అత్యుత్సాహంతో ఆ యువకుడు తన ఫ్రీ చికెన్ సీక్రెట్‌ను ఫ్రెండ్స్‌తో పంచుకోకపోయుంటే బాగుండేది. -
భవిష్యత్తులో భారత్ మంచి మార్కెట్ కానుంది: కేఎఫ్‌సీ
న్యూఢిల్లీ: అమెరికా ఆధారిత ఫాస్ట్ ఫుడ్ సంస్థ కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కేఎఫ్‌సీ)భారతదేశంలో తమ రెస్టారెంట్ వ్యాపార నెట్‌వర్క్‌ను విస్తరింపజేయాలని ఆలోచిస్తోంది. కరోనావైరస్ కారణంగా తమ వ్యాపారంలో నిర్మాణాత్మక మార్పులను చోటుచేసుకునప్పటికీ, రాబోయే సంవత్సరాల్లో భారత్‌లో కేఎఫ్‌సీ వ్యాపారం మరింత వృద్ధి చెందుతందని నమ్ముతున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మా బ్రాండ్‌ను విస్తరింపచేయడమే మా ప్రధాన లక్ష్యం. మా కస్టమర్లకు అన్నిరకాల అందుబాటులో ఉంటూ మా బ్రాండ్ విలువను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు కేఎఫ్‌సీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మీనన్ అన్నారు. కోవిడ్ రాకముందు కేఎఫ్‌సీకి ఇండియాలో రెస్టారెంట్ల సంఖ్య 450 గా ఉండేది. ప్రస్తుతం130 కి పైగా నగరాల్లో 480 కి పైగా రెస్టారెంట్లు ఉన్నాయి. భవిష్యత్తులో కేఎఫ్‌సీ మరింత అందుబాటులోకి రాబోయే సంవత్సరాల్లో ఖచ్చితంగా కేఎఫ్‌సీకి భారత్ మంచి మార్కెట్ అవుతుందనే విషయంలో మాకు ఎటువంటి సందేహం లేదు. మహమ్మారి కారణంగా ఆన్లైన్ ఆర్డర్లు పెరుగుతున్న నేపథ్యంలో కస్టమర్లకు అనుగుణంగా వారి అవసరాలను తీర్చేలా కేఎఫ్‌సీ ఇండియా తన ప్రయత్నాలను వేగవంతం చేసిందని ఆయన అన్నారు. కోవిడ్ ప్రారంభం నుంచి ప్రస్తుతం వరకు చూస్తే మా ఆన్లైన్ వ్యాపారం కనీసం 50 శాతం పెరిగిందని మేము భావిస్తున్నాము. మరోవైపు, కోవిడ్ ప్రభావం నుంచి ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదనే చెప్పాలి. మాల్స్, ఫుడ్ కోర్టులలో మా కస్టమర్ల రాకను కోవిడ్‌కు ముందు పోల్చి చూస్తే ప్రస్తుతం తక్కువగా వస్తున్నారని గమనించాము. తిరిగి పూర్వ స్థితికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. కోవిడ్-19 రెండవ వేవ్ గురించి మాట్లాడుతూ సంస్థ గత సంవత్సరం ఎదుర్కున్న పరిస్థితుల నుంచి నేర్చుకున్న పాఠాలను దృష్టిలో ఉంచుకున్నాం. ప్రస్తుతం ఆహార భద్రత, పరిశుభ్రత ప్రోటోకాల్, కస్టమర్లకు కాంటాక్ట్‌లెస్ డెలివరీలు లాంటివి వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపనున్నట్లు తెలిపారు. కోవిడ్ ఆంక్షలు కారణంగా డైనింగ్ హాళ్లను మళ్లీ తాత్కాలికంగా మూసివేసే పరిస్థితి వచ్చినా, మా కస్టమర్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలను తీసుకుంటామని మీనన్ అన్నారు. -
బర్గర్‌కింగ్- 3 రోజుల్లో 3 రెట్లు లాభం
ముంబై, సాక్షి: అటు నిపుణులు, ఇటు ఇన్వెస్టర్లను నివ్వెరపరుస్తూ కేవలం మూడు రోజుల్లోనే అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్(QSR) చైన్ల దిగ్గజం బర్గర్‌కింగ్ షేరు మూడు రెట్లు రిటర్నులు అందించింది. ఇటీవల రూ. 60 ధరలో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన బర్గర్ కింగ్ తొలి రోజు సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో భారీ లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 60కాగా.. బీఎస్ఈలో ఏకంగా 91 శాతం ప్రీమియంతో రూ. 115 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి రెండు రోజులుగా 20 శాతం అప్పర్ సర్క్యూట్లను తాకుతూ వస్తోంది. తాజాగా బీఎస్ఈలో ఈ షేరు రూ. 33 ఎగసి రూ. 199 వద్ద ఫ్రీజయ్యింది. వెరసి ఇష్యూ ధరతో పోలిస్తే 232 శాతం లేదా 3.3 రెట్లు అధికంగా లాభపడింది! ఇందుకు ఈ కౌంటర్లో కొనేవాళ్లు అధికంకాగా.. అమ్మకందారులు కరువుకావడం ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. (బర్గర్ కింగ్ లిస్టింగ్.. అ‘ధర’హో) మూడేళ్లుగా ఈ ట్రెండ్ రూ. 1,000 కోట్లలోపు పబ్లిక్ ఇష్యూకి వచ్చిన బలమైన కంపెనీలు మూడేళ్లుగా తొలి వారంలో భారీగా లాభపడుతూ వస్తున్నట్లు టార్గెట్ ఇన్వెస్టింగ్‌కు చెందిన కల్రా పేర్కొన్నారు. ఫ్లోటింగ్ స్టాక్ తక్కువగా ఉంటే ఈ మేనియా కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో ట్రేడర్లు, లేదా ఇన్వెస్టర్లకు కంపెనీ వేల్యుయేషన్స్ గుర్తుకురావని వ్యాఖ్యానించారు. డోమినోస్ పిజ్జా రెస్టారెంట్ల కంపెనీ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ షేరు సైతం ఇదేవిధంగా లిస్టింగ్‌లో పటిష్ట లాభాలు ఆర్జించినట్లు ప్రస్తావించారు. (నేటి నుంచి బెక్టర్స్ ఫుడ్.. పబ్లిక్ ఇష్యూ) కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ 2014 నవంబర్‌లో దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించిన బర్గర్‌కింగ్ తాజాగా 261 రెస్టారెంట్లకు విస్తరించింది. వీటిలో 8 సబ్ఫ్రాంచైజీలున్నాయి. 17 రాష్ట్రాలు, 57 పట్టణాలలో రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. రానున్న కాలంలో వ్యాపార విస్తరణ ద్వారా కంపెనీ మరింత జోరందుకునే వీలున్నట్లు ఏంజెల్ బ్రోకింగ్‌కు చెందిన కేశవ్ లహోటీ పేర్కొన్నారు. అయితే క్యూఎస్ఆర్ విభాగంలో జూబిలెంట్ ఫుడ్ వాటా 21 శాతంకాగా.. మెక్‌డొనాల్డ్స్ సంస్థ వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్ 11 శాతం, కేఎఫ్‌సీ 10 శాతం, సబ్వే 6 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఆలస్యంగా అడుగుపెట్టిన బర్గర్‌కింగ్ 5 శాతం వాటాతో వేగంగా విస్తరిస్తున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. గత ఐదేళ్లలో బర్గర్‌కింగ్ అమ్మకాలు 56 శాతం జంప్‌చేయగా.. వెస్ట్‌లైఫ్ 17 శాతం, జూబిలెంట్ 12 శాతం చొప్పున వృద్ధి చూపాయి. బర్గర్‌కింగ్ 2020 మార్చికల్లా రూ. 835 కోట్ల ఆదాయం సాధించింది. -
చికెన్ కొరత.. కేఎఫ్‌సీలు బంద్!
లండన్ : చికెన్ కొరతతో యూకేలో వందల కొద్దీ కేఎఫ్‌సీ సెంటర్లు మూత బడ్డాయి. ఇప్పటి వరకు చికెన్‌ను సరఫరా చేస్తున్న జర్మనికి చెందిన ప్రముఖ కొరియర్ సంస్థ డీహెచ్ఎల్తో ఒప్పందం రద్దుచేసుకోవడంతో కెఎఫ్‌సీకి ఇబ్బందులొచ్చాయి. ‘ఇటీవల ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ కంపెనీ సరఫరాలో కొన్ని ప్రారంభసమస్యలు వచ్చాయి. యూకే వ్యాప్తంగా ఉన్న 900 సెంటర్లకు చికెన్ సరఫరా చేయడం కష్టమైంది. ఈ నేపథ్యంలో కొన్ని సెంటర్లు మూసివేయాల్సి వచ్చింది.’అని కేఎఫ్‌సీ ఓ ప్రకటనలో తెలిపింది. నాణ్యత విషయంలో కంపెనీ రాజీ పడదని, దీంతోనే యూకే వ్యాప్తంగా ఉన్న 900 కేఎఫ్‌సీల్లో 700 వరకు మూసివేసామని పేర్కొంది. ఈ వారం చివరి వరకు ఇలానే మూసివేసుంటాయని కంపెనీ ప్రకటించింది. మిగిలిన స్టోర్లలో లిమిటెడ్ మెనూ, కొన్ని గంటలే సేవలందిస్తున్నట్లు తెలిపింది. ఈ అసౌకర్యానికి క్షమించాలని వినియోగదారులను విజ్ఞప్తి చేసింది. -
కేఎఫ్సీలో చికెన్ తినొద్దంటూ ఫత్వా
ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో ముస్లిం పెద్దలు ఓ విచిత్రమైన ఫత్వా జారీచేశారు. కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కేఎఫ్‌సీ)లో చికెన్ తింటే అది పాపం అవుతుందని, అందువల్ల అక్కడ తినొద్దని దర్గా-ఎ-అలా హజరత్ మతపెద్దలు చెప్పారు. కేఎఫ్‌సీ ఔట్లెట్లలో అందించే చికెన్ హలాల్ చేసినది కాదని, అందువల్ల అది ఇస్లామిక్ చట్లాలకు లోబడి ఉండదని సీనియర్ ముఫ్తీ సలీమ్ నూరీ తెలిపారు. కేఎఫ్సీలో మాంసాన్ని ముస్లింల కళ్లెదుట ప్రాసెస్ చేయరని, అందువల్ల అది ఇస్లామ్ నిబంధనల ప్రకారం తప్పని ఆయన అన్నారు. ఈ స్టోర్ల వద్ద ప్రదర్శించే హలాల్ సర్టిఫికెట్లకు ఏమాత్రం విలువ లేదని, మాంసాన్ని ప్రాసెస్ చేయడానికి తాము ఎలాంటి విధానాలు అవలంబిస్తామో వాళ్లు అందులో రాయట్లేదని నూరీ చెప్పారు. కేఎఫ్‌సీ వాళ్లు ఇస్లామిక్ పద్ధతిలో మాంసాన్ని వండరు కాబట్టి షరియత్ చట్టానికి అది వ్యతిరేకమని ముఫ్తీ తెలిపారు. ఇంతకుముందు 'పోకెమన్ గో' ఆడటాన్ని కూడా ఇస్లాం ప్రకారం తప్పంటూ ఇదే మతపెద్ద ఓ ఫత్వా జారీచేశారు. -
ఇక రైళ్లలో కేఎఫ్‌సీ
న్యూఢిల్లీ: ఇకపై రైళ్లలోనూ కేఎఫ్‌సీ చికెన్, మీల్ దొరుకుతుంది. రైళ్లలో తమ ఆహార పదార్థాలను సరఫరా చేసేందుకు కేఎఫ్‌సీ, ఐఆర్సీటీసీతో ఒప్పందం చేసుకుంది. తొలి దశలో ప్యాంట్రీ కారు లేని రైళ్లలోనే కేఎఫ్‌సీ సేవలు లభిస్తా యి. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ మీదుగా వెళ్లే 12 రైళ్లలో సోమవారం నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మరో పదిరోజుల్లో విశాఖ, హైదరాబాద్ (కాచిగూడ), బెంగళూరుల మీదుగా వెళ్లే రైళ్లలోనూ కేఎఫ్‌సీ అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఐఆర్సీటీసీలో టికెట్ బుక్చేసేటపుడు కేఎఫ్‌సీకి ఆర్డరు పెట్టొచ్చు. లేదా 18001034139 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి ఆర్డరు చేయవచ్చు. ఆర్డరు చేయగానే ప్రయాణికుడి సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్లో పాస్‌వర్డ్‌ను వస్తుంది. డెలివరీ చేసే సమయంలో మనంఆ పాస్‌వర్డ్‌ను చెప్పాల్సి ఉంటుంది.