చికెన్‌ కొరత.. కేఎఫ్‌సీలు బంద్‌! | Chicken shortage shuts hundreds of KFC stores in UK | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 20 2018 12:40 PM | Last Updated on Tue, Feb 20 2018 12:49 PM

Chicken shortage shuts hundreds of KFC stores in UK - Sakshi

యూకేలో మూతబడ్డ కేఎఫ్‌సీ స్టోర్‌

లండన్‌ : చికెన్‌ కొరతతో యూకేలో వందల కొద్దీ కేఎఫ్‌సీ సెంటర్లు మూత బడ్డాయి. ఇప్పటి వరకు చికెన్‌ను సరఫరా చేస్తున్న జర్మనికి చెందిన ప్రముఖ కొరియర్‌ సంస్థ డీహెచ్‌ఎల్‌తో ఒప్పందం రద్దుచేసుకోవడంతో కెఎఫ్‌సీకి ఇబ్బందులొచ్చాయి.

‘ఇటీవల ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ కంపెనీ సరఫరాలో కొన్ని ప్రారంభసమస్యలు వచ్చాయి. యూకే వ్యాప్తంగా ఉన్న 900 సెంటర్లకు చికెన్‌ సరఫరా చేయడం కష్టమైంది. ఈ నేపథ్యంలో కొన్ని సెంటర్లు మూసివేయాల్సి వచ్చింది.’అని కేఎఫ్‌సీ ఓ ప్రకటనలో తెలిపింది.

నాణ్యత విషయంలో కంపెనీ  రాజీ పడదని, దీంతోనే యూకే వ్యాప్తంగా ఉన్న 900 కేఎఫ్‌సీల్లో 700 వరకు మూసివేసామని పేర్కొంది. ఈ వారం చివరి వరకు ఇలానే మూసివేసుంటాయని కంపెనీ ప్రకటించింది. మిగిలిన స్టోర్‌లలో లిమిటెడ్‌ మెనూ, కొన్ని గంటలే సేవలందిస్తున్నట్లు తెలిపింది. ఈ అసౌకర్యానికి  క్షమించాలని వినియోగదారులను విజ్ఞప్తి చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement