ఇక రైళ్లలో కేఎఫ్‌సీ
న్యూఢిల్లీ: ఇకపై రైళ్లలోనూ కేఎఫ్‌సీ చికెన్, మీల్ దొరుకుతుంది. రైళ్లలో తమ ఆహార పదార్థాలను సరఫరా చేసేందుకు కేఎఫ్‌సీ, ఐఆర్‌సీటీసీతో ఒప్పందం చేసుకుంది. తొలి దశలో ప్యాంట్రీ కారు లేని రైళ్లలోనే కేఎఫ్‌సీ సేవలు లభిస్తా యి. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ మీదుగా వెళ్లే 12 రైళ్లలో సోమవారం నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
మరో పదిరోజుల్లో విశాఖ, హైదరాబాద్ (కాచిగూడ), బెంగళూరుల మీదుగా వెళ్లే రైళ్లలోనూ కేఎఫ్‌సీ అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్‌చేసేటపుడు కేఎఫ్‌సీకి ఆర్డరు పెట్టొచ్చు. లేదా 18001034139 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి ఆర్డరు చేయవచ్చు. ఆర్డరు చేయగానే ప్రయాణికుడి సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌లో పాస్‌వర్డ్‌ను వస్తుంది. డెలివరీ చేసే సమయంలో మనంఆ పాస్‌వర్డ్‌ను చెప్పాల్సి ఉంటుంది.