కొన్ని దేశాల్లో విద్యా విధానం నుంచి ఆఫీసర్ల హోదాల వరకు కాస్త భిన్నంగా ఉంటాయి. చాలా వరకు కొన్ని విషయాల్లో అన్ని దేశాలు దాదాపు ఒకే విధానాన్ని అనుసరిస్తాయి. ఐతే కొన్ని మాత్రం చాలా విచిత్రంగా ఉంటాయి. ఎంతలా అంటే ఆయా విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో కొన్ని చూద్దాం!
నార్వే చిన్న దేశమైనా కూడా కరోనా సమయంలో అన్ని దేశాలకు వైద్య సేవలందించి శభాష్ అనిపించుకున్న సంగతి తెలిసిందే. అలాంటి నార్వేలో పోలీస్ ఆఫీసర్ కావాలంటే ప్రత్యేకించి పోలీస్ యూనివర్సిటీలో డిగ్రీ చేయాలి. అంతేగాదు మొదటి రెండు సంవత్సరాలు క్రిమినల్ లా, ఎథిక్స్, సోషల్ సైన్సెస్ చదువుకోవాల్సి ఉంటుంది. మూడో సంవత్సరం ప్రాక్టికల్ ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. అక్కడ పోలీసులే ప్రాసిక్యూటర్లుగా వ్యవహరిస్తారు. అక్కడ ఏకీకృత పోలీసు విధానం అమలులో ఉంది. ఒకే ఒక పౌర పోలీసు దళం ఉంటుంది. పైగా అక్కడ ప్రాంతాలు లేదా నగరాలకు సొంత పోలీసు బలగాలు కలిగి ఉంటాయట.
పోలీసులంతా నేషనల్ పోలీస్ డైరెక్టరేట్ కిందే పనిచేస్తారు. ఇక్కడ పోలీసులకు చాలా అధికారాలుంటాయి. అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే పోలీసులంతా కూడా ఆయుధాలను ఎల్లప్పుడూ కలిగి ఉండకూదు. వారు తమ ఆయుధాలను పోలీసు కారులోని ట్రంక్‌లో లేదా లాకర్‌లో పెట్టుకోవాలట. నార్వేలో నేరాలు, హత్యలు జరిగే సంఖ్య చాల తక్కువ. అలాగే విధినిర్వహణలో చనిపోయే పోలీసుల సంఖ్య కూడా అత్యల్పమేనట. నార్వేలో పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. అల్లర్లు, ఉద్రిక్తతలకు తావివ్వకుండా ఎల్లప్పుడూ శాంతిగా ఉండేలా పోలీసులు గట్టిగా పర్వవేక్షించడం విశేషం.
కేఎఫ్‌సీ రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం
ఇక అలాగే మరో విచిత్రమైన అంశం ఏంటంటే అందరూ ఇష్టంగా లాగించే ప్రఖ్యాత ఫాస్ట్ ఫుడ్ కెంటకీ ఫ్రైడ్ చికెన్(కేఎఫ్‌సీ) స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టి ఆశ్చర్యపరిచింది. 2008లో రోడ్లపై గుంతలను పూడ్చే ప్రాజెక్టును చేపట్టి తన కస్టమర్లకు మరింత చేరువయ్యే యత్నం చేసింది. అయితే ఇదంతా కేఎఫ్‌సీ ఎందుకు చేసిందంటే తన అమ్మకాలు తగ్గిపోవడంతో మార్కెటింగ్ ప్రచారం చేయాలనే యోచనతో చేసింది.
అందులో భాగంగా కస్టమర్లకు దగ్గరఅవ్వాలి ఎంతలా అంటే వారెప్పటికీ మర్చిపోని ఫుడ్ సెంటర్‌గా గుర్తించుకోవాలనే విధంగా తన మార్కెటింగ్ ప్రచారం ఉండాలనుకుంది. అందులో భాగంగానే ఈ రోడ్లపై గుంతలను పూడ్చే పనులు చేపట్టింది. ఓ పక్క గుంతలను పూడ్చుతూ అక్కడ తన కేఎఫ్‌సీ బోర్డులు పెట్టి క్షేమంగా బయటకు వచ్చి..కెఎఫ్‌సీని ఆస్వాదించి ఆనందంగా వెళ్లండి అని ప్రచారం చేసుకుంది. ఓ పక్కన మార్కెటింగ్ తోపాటు సామాజిక సేవను జోడించి తనదైన తరహాలో దూసుకుపోతోంది.
(చదవండి: ఆ దేశం పీతలను నిర్మూలించడానికి ఏకంగా రూ. 26 కోట్లు..!)
Comments
Please login to add a commentAdd a comment