
న్యూఢిల్లీ: దిగ్గజ టూవీలర్ల తయారీ కంపెనీ ‘హీరో మోటొకార్ప్’ తాజాగా తన వాహన ధరలను రూ.500 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ముడిపదార్ధాల ధరలు పెరగడం, కరెన్సీ విలువ తగ్గుదల, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల వంటి అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
కాగా ప్రస్తుతం కంపెనీ రూ.40,000– రూ.1,00,000 ధర శ్రేణిలో టూవీలర్లను విక్రయిస్తోంది. హీరో మోటొకార్ప్ జూన్ నెల విక్రయాలు 13 శాతం వృద్ధితో 7,04,562 యూనిట్లకు పెరిగాయి.