సాక్షి, న్యూఢిల్లీ: వరుసగా కార్ల దిగ్గజాలు వివిధ మోడళ్ల కార్లపై ధరలను పెంపును ప్రకటింస్తున్నాయి. తద్వారా బడ్జెట్ ధరలో కారును సొంతం చేసుకునే సామాన్య కారు ప్రేమికుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. ఇప్పటికే లగ్జరీ కార్ మేకర్ ఆడి వాహనాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స కూడా పాసింజర్ వాహనాల ధరలను పెంచిన సంగతి తెలిసింది. తాజాగా జపాన్ కార్ మేకర్ నిస్సాన్ కూడా ధరల పెంపునకు నిర్ణయించింది. తమవాహనాలపై 2శాతం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని బుధవారం నిస్సాన్ ప్రకటించింది. ఈ పెంపు ఏప్రిల్ 1నుంచి అమలు చేయనున్నట్టు తెలిపింది.
జపాన్ ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్, డాట్సన్ మోడల్ కార్లపై ఈ పెంపువర్తిస్తుందని తెలిపింది. ఇన్‌పుట్ ఖర్చుల భారంతోనే ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ దర్శకుడు జెరోమ్ సైగోట్ ఒక ప్రకటనలో తెలిపారు. అయినా ఆకర్షణీయమైన సేవలతో, వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొంటుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. భారత మార్కెట్లో డాట్సన్, మైక్రో, సన్నీ, టెరానో వంటి మూడు మోడళ్లను నిస్సాన్ విక్రయిస్తోంది. ప్రస్తుతం ధర ధర రూ. 4.64 లక్షలు, రూ. 14.46 లక్షలు. డాటన్స్ గో, గోప్లస్, రెడి గ్లో ధరలు 2.49 లక్షల నుంచి 5.12 లక్షలు (ఎక్స్ షో రూం ఢిల్లీ)గా ఉన్నాయి. తాజా పెంపుతో ఈ ధరలు 2శాతం పెరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment