nissan motor india
-
నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీగా సౌరభ్ వత్స
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మోటర్ ఇండియా ఎండీగా సౌరభ్ వత్స నియమితులయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నియామకం అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న రాకేశ్ శ్రీవాస్తవ మార్చి 31తో రిటైరవుతున్నారు. ఇటీవల జనవరి 15నే కంపెనీలో ఆయన డిప్యుటీ ఎండీగా నియమితులయ్యారు. అనుభవజు్ఞడైన వత్స సారథ్యం .. కంపెనీ తదుపరి వృద్ధికి దోహదపడగలదని నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ విభాగం ప్రెసిడెంట్ ఫ్రాంక్ టోరెస్ తెలిపారు. -
కొత్త కారు కొనే వారికి బంపర్ ఆఫర్!
కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీ కోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ఏప్రిల్ నుంచి ధరలు పెరగనున్న నేపథ్యంలో జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ తన కిక్స్ ఎస్యూవీ మోడళ్లపై అదిరిపోయే ఆఫర్లు అందిస్తోంది. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్స్ వంటివి ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా ఉద్యోగులు ప్రత్యేక బెనిఫిట్ పొందొచ్చు. దీనికి తోడు నిస్సాన్ ఇండియా అన్ని ప్రభుత్వ / పిఎస్బి / పిఎస్‌యు ఉద్యోగుల కోసం ఎల్‌టిసి ఆఫర్‌ను కూడా అందిస్తుంది. కంపెనీ పేర్కొన్న వివరాల ప్రకారం నిస్సాన్ కిక్స్ మోడల్‌పై మొత్తంగా రూ.95 వేల వరకు తగ్గింపు అందిస్తుంది. క్యాష్ డిస్కౌంట్ రూపంలో రూ.25 వేల తగ్గింపు ఉంటే ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.50 వేలు తగ్గింపు పొందవచ్చు. అలాగే లాయల్టీ బోనస్ కింద మరో రూ.20 వేలు డిస్కౌంట్ ఉంది. కంపెనీ ఆథరైజ్డ్ డీలర్షిప్స్ వద్ద మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కొత్తగా కారు కొనే వారి దగ్గరిలోని షోరూమ్‌కు వెళ్లి ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇకపోతే నిస్సాన్ కిక్స్ కారు 8 వేరియంట్ల రూపంలో అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన వేరియంట్లకే ఆఫర్ వర్తిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి కారు ధరలు పెరగనున్న నేపథ్యంలో ఇది ఒక బంపర్ అఫర్ అని చెప్పుకోవాలి. చదవండి: ఈ అమెజాన్ లింకుతో జర జాగ్రత్త! -
డాట్సన్ ధరలు ప్రియం ఏప్రిల్ 1 నుంచి 4 శాతం పెంపు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ నిస్సాన్ మోటార్ ఇండియా తన డాట్సన్ గో, గో ప్లస్ మోడల్ కార్ల ధరలను ఏప్రిల్ 1 నుంచి 4 శాతం పెంచనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. పలు ఆర్థిక అంశాల కారణంగా ఇటీవలి కాలంలో పెరిగిన ముడి వస్తువుల ధరల భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంలో భాగంగా ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ సేల్స్ డైరెక్టర్ హర్దీప్ సింగ్ వివరించారు. మహీంద్రా, రెనాల్ట్, టాటా మోటార్స్, టయోటా కూడా ఏప్రిల్ 1 నుంచి ధరలు పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. -
నిస్సాన్ ‘కిక్స్’ బుకింగ్‌పై బంపర్ ఆఫర్
నిస్సాన్ మోటార్ ఇండియా కొత్త ఎస్‌యూవీని లాంచ్ చేసింది. 'కిక్స్' పేరుతో ఒక కొత్త సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో ఆవిష్కరించింది. నాలుగు వేరియంట్లలో ఇది లభ్యం కానుంది. ఎక్స్ఎల్, ఎక్స్‌వి, ఎక్స్‌వి ప్రీమియం, ఎక్స్‌వీ ప్రీమియం ప్లస్ అనే నాలుగు వెర్షన్స్‌ను తీసుకొచ్చింది. ప్రధాన ప్రత్యర్థులు హ్యుందాయ్ క్రెటా, రెనాల్ట్ డస్టర్, మారుతి ఎస్-క్రాస్‌కి ధీటుగా, పోటీగా ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్స్ఎల్ పెట్రోల్ బేసిక్ వేరియంట్ కోసం రూ .9.55 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రారంభ ధరగా నిర్ణయించింది. నిస్సాన్ కిక్స్ బేసిక్ వేరియంట్లో కూడా ఎడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, పవర్ విండోస్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక ఎసీ,వెంట్స్ నాలుగు స్పీకర్లతో ఒక బ్లూటూత్, యూఎస్బీ, ఆక్స్- ఎనేబుల్ ఆడియో సిస్టమ్ లాంటి కీలక ఫీచర్స్‌ను పొందుపర్చింది. ఇక టాప్ ప్రీమియం ప్లస్‌లో ఎరౌండ్ వ్యూ డిస్ప్లే కలిగిన 360 డిగ్రీ కెమెరాతోపాటు ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ ప్లే కంపాటిబిలిటీ ఇచ్చింది. ఇంకా టెలీమాటిక్స్-ఎనేబుల్ స్మార్ట్ వాచ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రెల్స్ , 8.0 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎల్ఈడీ హెడ్ లాంప్స్ క్రూయిస్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, వైపర్స్‌ను జోడించింది. ఎక్స్టీరియర్గా స్టయిలుష్ లుక్‌ను జత చేసింది. 17ఇంచ్ అల్లాయ్ వీల్స్ , హిల్ స్టార్ట్ అసిస్ట్, నిస్సాన్ ఇంటెలిజెంట్ మొబిలిటీ లాంటి ఫీచర్స నిస్సాన్ కిక్స్ ఎస్యూవీ సొంతం. ఈ వాహనాల్లో 1.5 లీటర్ల పెట్రోల్, డిజీల్ ఇంజీన్లను అమర్చింది. పెట్రోల్ ఇంజీన్ 105బీహెచ్పీ పవర్ వద్ద 142 గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. డీజిల్ ఇంజీన్ 108 బీహెచ్పీ వద్ద 240 గరిష్ట్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. పెట్రోల్ వేరియంట్ (ఎక్స్-షోరూం) ధరలు కిక్స్ ఎక్స్ఎల్ ధర - రూ. 9.55 లక్షలు కిక్స్ ఎక్స్‌వీ ధర - రూ. 10.95 లక్షలు డీజిల్ వేరియంట్ (ఎక్స్-షోరూం) ధరలు కిక్స్ ఎక్స్ఎల్ ధర - రూ. 10.85 లక్షలు కిక్స్ ఎక్స్‌వీ- రూ.12.49లక్షలు కిక్స్ ఎక్స్‌వీ ప్రీమియం - రూ.13.65లక్షలు కిక్స్ ఎక్స్‌వీ ప్రీమియం ప్లస్ - రూ.14.65లక్షలు గత డిసెంబర్లోనే ప్రీ బుక్సింగ్స్ మొదలుపెట్టింది. అయితే 2019 జనవరిలో కిక్స్ వాహనాన్ని ప్రీ బుకింగ్ చేసుకున్న తొలి 500మంది వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఇంగ్లాండ్‌లో జరిగే ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌ను వీక్షించే సువర్ణావకాశాన్ని దక్కించుకునే ఛాన్స్ ఉందని నిస్సాన్ ఇండియా ప్రకటించింది. -
నిస్సాన్ కూడా షాకిచ్చింది
సాక్షి, న్యూఢిల్లీ: వరుసగా కార్ల దిగ్గజాలు వివిధ మోడళ్ల కార్లపై ధరలను పెంపును ప్రకటింస్తున్నాయి. తద్వారా బడ్జెట్ ధరలో కారును సొంతం చేసుకునే సామాన్య కారు ప్రేమికుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. ఇప్పటికే లగ్జరీ కార్ మేకర్ ఆడి వాహనాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స కూడా పాసింజర్ వాహనాల ధరలను పెంచిన సంగతి తెలిసింది. తాజాగా జపాన్ కార్ మేకర్ నిస్సాన్ కూడా ధరల పెంపునకు నిర్ణయించింది. తమవాహనాలపై 2శాతం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని బుధవారం నిస్సాన్ ప్రకటించింది. ఈ పెంపు ఏప్రిల్ 1నుంచి అమలు చేయనున్నట్టు తెలిపింది. జపాన్ ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్, డాట్సన్ మోడల్ కార్లపై ఈ పెంపువర్తిస్తుందని తెలిపింది. ఇన్పుట్ ఖర్చుల భారంతోనే ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ దర్శకుడు జెరోమ్ సైగోట్ ఒక ప్రకటనలో తెలిపారు. అయినా ఆకర్షణీయమైన సేవలతో, వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొంటుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. భారత మార్కెట్లో డాట్సన్, మైక్రో, సన్నీ, టెరానో వంటి మూడు మోడళ్లను నిస్సాన్ విక్రయిస్తోంది. ప్రస్తుతం ధర ధర రూ. 4.64 లక్షలు, రూ. 14.46 లక్షలు. డాటన్స్ గో, గోప్లస్, రెడి గ్లో ధరలు 2.49 లక్షల నుంచి 5.12 లక్షలు (ఎక్స్ షో రూం ఢిల్లీ)గా ఉన్నాయి. తాజా పెంపుతో ఈ ధరలు 2శాతం పెరగనున్నాయి. -
డాట్సన్ ‘రెడి–గో’లో ఏఎంటీ వెర్షన్
న్యూఢిల్లీ: నిస్సాన్ మోటార్ ఇండియా తాజాగా తన డాట్సన్ బ్రాండ్‌లోని ఎంట్రీ లెవెల్ మోడల్ ‘రెడి–గో’లో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏఎంటీ) వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.3.8 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). రెడి–గో స్టాండర్డ్ వెర్షన్‌తో పోలిస్తే ప్రస్తుత వెర్షన్ ధర దాదాపు రూ.22,000 ఎక్కువగా ఉంది. రెడి–గో ఏఎంటీ వెర్షన్లో డ్యూయెల్ డ్రైవింగ్ మోడ్, రష్ అవర్ మోడ్ సహా పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది. కాగా కంపెనీ ఈ కొత్త కారులో 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చింది. ఇది మారుతీ ఆల్టో కే10 ఏజీఎస్, రెనో క్విడ్ ఏఎంటీ మో డళ్లకు గట్టి పోటీనిస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. -
‘రెడిగో’లో లిమిటెడ్ ఎడిషన్
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘నిస్సాన్ మోటార్ ఇండియా’ తాజాగా తన ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ కారు రెడిగోలో ‘డాట్సన్ రెడిగో గోల్డ్’ అనే లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. 1 లీటర్ ఇంజిన్ సామర్థ్యంతో వస్తోన్న ఈ కారు ధర రూ.3.69 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. కంపెనీ ఇందులో రివర్స్ పార్కింగ్, కొత్త మ్యూజిక్ సిస్టమ్ వంటి పలు ప్రత్యేకతలను పొందుపరిచింది. వినియోగదారులకు దేశవ్యాప్తంగా ఉన్న నిస్సాన్, డాట్సన్ డీలర్షిప్స్ వద్ద ఈ వేరియంట్ అందుబాటులో ఉంటుందని నిస్సాన్ మోటార్ ఇండియా తెలిపింది. కస్టమర్లకు పండుగ సీజన్‌ను ప్రత్యేకంగా మార్చేందుకు మరింత శక్తి, పనితీరు, స్టైల్, సౌలభ్యంతో కొత్త వేరియంట్‌ను ఆవిష్కరించామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్, డాట్సన్ బిజినెస్ యూనిట్) జెరోమ్ సైగత్ తెలిపారు. -
నిస్సాన్ ‘మైక్రా’.. అప్డేటెడ్ వెర్షన్
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘నిస్సాన్ మోటార్ ఇండియా’ తాజాగా తన కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ ‘మైక్రా’లో కొత్త అప్డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.5.99 లక్షలు(ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). పెట్రోల్ వేరియంట్ ధర రూ.5.99 లక్షలు–రూ.6.95 లక్షల శ్రేణిలో, డీజిల్ వేరియంట్ ధర రూ.6.62 లక్షలు–రూ.7.23 లక్షల శ్రేణిలో ఉందని కంపెనీ పేర్కొంది. ‘జపానీస్ టెక్నాలజీతో యూరోపియన్ స్టైలింగ్‌లో తాజా కొత్త మైక్రాను తయారుచేశాం. ఆకర్షణీయమైన ధరల్లో అందుబాటులో ఉన్న ఒక ఉత్తమమైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఇది’ అని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా తెలిపారు. పెట్రోల్ వేరియంట్లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను, డీజిల్ వేరియంట్లో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను పొందుపరిచామని వివరించారు. కొత్త మైక్రాలో ఆటో హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. -
అమ్మకాల్లో దూసుకుపోతున్న 'చిన్నకారు'
న్యూఢిల్లీ: మారుతీ ఆల్టో, హ్యుందాయ్ ఈఆన్, రెనో క్విడ్ కార్లకు పోటీగా జపాన్‌కు చెందిన నిస్సాన్ కంపెనీ డాట్సన్ బ్రాండ్‌లో ప్రవేశపెట్టిన చిన్న కారు 'రెడి-గో' అమ్మకాల్లో దూసుకుపోతోంది. 23 రోజుల్లోనే 3 వేల కార్లు అమ్ముడయ్యాయి. జూన్ 7 నుంచి ప్రారంభమైన 'రెడి-గో' అమ్మకాలకు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోందని నిస్సాన్ ఇండియా ఎండీ, అరుణ్ మల్హోత్ర తెలిపారు. 23 రోజుల్లో 3 వేల కార్లు అమ్ముడయ్యాయని వెల్లడించారు. వినియోగదారులకు పెద్ద సంఖ్యలో కార్లు డెలివరీ చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. 274 సేల్స్ అండ్ సర్వీసెస్ అవుట్‌లెట్స్ ద్వారా 'రెడి-గో' అమ్మకాలు సాగిస్తున్నామన్నారు. 'రెడి-గో' పెట్రోల్ కారు ధరలు 2.38 లక్షల నుంచి రూ.3.34 లక్షల రేంజ్లో నిర్ణయించారు. డాట్సన్ ఈ కారును ఐదు వేరియంట్లు-డి, ఏ, టీ, టి(ఓ), ఎస్‌ల్లో అందిస్తున్నారు. డాట్సన్ బ్రాండ్ కింద కంపెనీ అందిస్తోన్న మూడో కారు ఇది. భారత్‌లో అభివృద్ధి చేసిన కొత్త ప్లాట్‌ఫాం మీద ఈ కారును నిస్సాన్‌కంపెనీ తయారు చేస్తోంది. 800 సీసీ ఇంజిన్, ఐదు గేర్లు ఉన్న ఈ కారు 25.17 కి.మీ. మైలేజీని ఇస్తుందని, వంద కిమీ, వేగాన్ని 15.9 సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 140 కి.మీ. అని నిస్సాన్ కంపెనీ తెలిపింది. -
మార్కెట్లోకి నిస్సాన్ డాట్సన్ గో లిమిటెడ్ ఎడిషన్
ధర రూ. 4.1 లక్షలు న్యూఢిల్లీ : నిస్సాన్ మోటార్ ఇండియా కంపెనీ డాట్సన్ గో మోడల్లో లిమిటెడ్ ఎడిషన్, డాట్సన్ గో నెక్స్ట్ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధర రూ.4.1 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించామని కంపెనీ ఎండీ అరుణ్ మల్హోత్రా తెలిపారు. ఈ లిమిటెడ్ ఎడిషన్ కార్లు ఈ ఏడాది అగస్టు-డిసెంబర్ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఉన్న 196 అవుట్లెట్లలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. సౌకర్యవంతమైన ఫీచర్లతో ఈ కారును రూపొందించామని, రూ. 5,000 అధిక ధరకే రూ.20,000 విలువైన యాడ్-ఆన్స్‌ను అందిస్తున్నామని వివరించారు. నిస్సాన్ కంపెనీ ఏడు సీట్ల డాట్సన్ గో కారును ఈ ఏడాది జనవరిలో మార్కెట్లోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ కారు ధరలు రూ.3.79 లక్షల నుంచి రూ.4.85 లక్షల రేంజ్(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)లో ఉన్నాయి. -
2016-17 నాటికి 10% వాటా లక్ష్యంయం : కెనిచిరో యోమురా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనరంగ కంపెనీ నిస్సాన్ మోటార్ ఇండియా 2016-17 నాటికి ప్యాసింజర్ కార్ల మార్కెట్లో 10 శాతం వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో కంపెనీకి ప్రస్తుతం 1-2 శాతం వాటా ఉంది. ప్రస్తుతం కార్ల మార్కెట్ మందగమనంలో ఉన్నా, ఎన్నికల తర్వాత పుంజుకుంటుందని నిస్సాన్ భారత కార్యకలాపాల ప్రెసిడెంట్ కెనిచిరో యోమురా సోమవారం తెలిపారు. కార్ల కంపెనీలకు దేశంలో అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఇక్కడి నాగో ల్లో లక్ష్మీ నిస్సాన్ 3ఎస్ ఫెసిలిటీని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వినూత్న మోడళ్లతో కొత్త విభాగాల్లోకి ప్రవేశించడం ద్వారా లక్ష్యానికి చేరుకుంటామని చెప్పారు. 2012-13లో దేశీయంగా 37,000 కార్లు విక్రయించామని, ఈ ఏడాది రెండంకెల వృద్ధి నమోదు చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది డాట్సన్ గో.. గ్రూపు కంపెనీ డాట్సన్ తయారీ ‘గో’ మోడల్ కారును నిస్సాన్ 2014 తొలి నాళ్లలో దేశీయ మార్కెట్లోకి తీసుకురానుంది. ధర రూ.4 లక్షలలోపే ఉంటుంది. కంపెనీ నుంచి ప్రస్తుతం మైక్రా యాక్టివ్ ఒక్కటే రూ.4 లక్షల లోపు ధర ఉంది. ఎస్యూవీ కాష్కై కూడా వచ్చే ఏడాది మార్కెట్లోకి అడుగు పెట్టనుంది. ఏటా 1 లక్ష కార్లను ఎగుమతి చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. కాగా, మరిన్ని ఫ్రాంచైజీలను ఏర్పాటు చేస్తామని లక్ష్మి నిస్సాన్ డెరైక్టర్ కె.జైరామ్ ఈ సందర్భంగా తెలిపారు.