మార్కెట్లోకి నిస్సాన్ డాట్సన్ గో లిమిటెడ్ ఎడిషన్ | Nissan Motor India Datsun Go Models in market | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి నిస్సాన్ డాట్సన్ గో లిమిటెడ్ ఎడిషన్

Published Fri, Aug 14 2015 1:32 AM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

మార్కెట్లోకి నిస్సాన్ డాట్సన్ గో లిమిటెడ్ ఎడిషన్

మార్కెట్లోకి నిస్సాన్ డాట్సన్ గో లిమిటెడ్ ఎడిషన్

ధర రూ. 4.1 లక్షలు

న్యూఢిల్లీ : నిస్సాన్ మోటార్ ఇండియా కంపెనీ డాట్సన్ గో మోడల్‌లో లిమిటెడ్ ఎడిషన్, డాట్సన్ గో నెక్స్ట్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధర రూ.4.1 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించామని కంపెనీ ఎండీ అరుణ్ మల్హోత్రా తెలిపారు. ఈ లిమిటెడ్ ఎడిషన్ కార్లు ఈ ఏడాది అగస్టు-డిసెంబర్ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఉన్న 196 అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.  సౌకర్యవంతమైన ఫీచర్లతో ఈ కారును రూపొందించామని, రూ. 5,000 అధిక ధరకే రూ.20,000 విలువైన యాడ్-ఆన్స్‌ను అందిస్తున్నామని వివరించారు. నిస్సాన్ కంపెనీ ఏడు సీట్ల డాట్సన్ గో కారును ఈ ఏడాది జనవరిలో మార్కెట్లోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ కారు ధరలు రూ.3.79 లక్షల నుంచి రూ.4.85 లక్షల రేంజ్(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)లో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement