
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ నిస్సాన్ మోటార్ ఇండియా తన డాట్సన్ గో, గో ప్లస్ మోడల్ కార్ల ధరలను ఏప్రిల్ 1 నుంచి 4 శాతం పెంచనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. పలు ఆర్థిక అంశాల కారణంగా ఇటీవలి కాలంలో పెరిగిన ముడి వస్తువుల ధరల భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంలో భాగంగా ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ సేల్స్ డైరెక్టర్ హర్‌దీప్ సింగ్ వివరించారు. మహీంద్రా, రెనాల్ట్, టాటా మోటార్స్, టయోటా కూడా ఏప్రిల్ 1 నుంచి ధరలు పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి.