datsun car
-
పండుగ స్పెషల్ ఆఫర్.. డాట్సన్ కార్లపై భారీగా డిస్కౌంట్
ఈ పండుగ సీజన్లో సరసమైన ధరలకే డాట్సన్ కారును కొనుగోలు చేసే కస్టమర్ల కోసం కంపెనీ ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ నెలలో కొత్తగా డాట్సన్ కారును కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. ప్రస్తుతం 'డాట్సన్' దేశంలో విక్రయించే కార్ల(రెడి-గో, గో, గో ప్లస్)పై ఆకర్షనీయమైన ఆఫర్లు ప్రకటించింది. అత్యధికంగా రూ.40 వేల వరకూ రాయితీలు అందిస్తుంది. ఈ స్టాక్ కొనసాగే వరకు లేదా అక్టోబర్ 31, 2021 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. డీలర్ షిప్ స్థాయి బట్టి ఆఫర్లో మార్పులు ఉంటాయి. (చదవండి: నెలకు రూ.25 లక్షలు సంపాదిస్తున్న ఇండియన్ గేమర్!) ఎన్ఐసీ అవకాశం ఉన్న చోట్ల మాత్రమే ఎక్స్ఛేంజీ బోనస్ లభిస్తుంది. అధికారిక వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం.. డాట్సన్ రెడీ-గోపై రూ.40,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీనిలో ₹20,000 నగదు ప్రయోజనం, ₹ 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. ఎంపిక చేసిన కార్పొరేట్ ఉద్యోగులకు కార్ల కంపెనీ ₹5,000 అదనపు కార్పొరేట్ ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది. ఇక డాట్సన్ గో హ్యాచ్ బ్యాక్ 5 సీటర్ మోడల్‌పై రూ. 40 వేల ఆఫర్ ప్రకటించింది. దీనిలో క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజీ బోనస్ కింద ఒక్కోటి రూ.20 వేల చొప్పున ఉంది. ఇటువంటి ఆఫరే గో ప్లస్ మోడల్‌పై కూడా ఉంది. 7 సీటర్ ఎంపీవీపై రూ.20 వేల నగదు లబ్ధి, రూ.20 వేలు ఎక్స్ఛేంజీ బోనస్ ఇస్తున్నారు. -
పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు..
సాక్షి, రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలోకి వెళితే అయినవిల్లి మండలం మడుపల్లి వద్ద డస్టన్ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. రావులపాలెంకు చెందిన మోతమర్రి రాంబాబు తన పెళ్లిరోజు కావడంతో భార్యా,కుమార్తెతో కలిసి సోమవారం అయినవిల్లి విఘ్నేశ్వర దేవాలయానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ....వారిని బయటకు తీశారు. కాగా వినాయకుడి దయవల్లే తాము ఘోర ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డామని రాంబాబు పేర్కొన్నాడు. -
డాట్సన్ ధరలు ప్రియం ఏప్రిల్ 1 నుంచి 4 శాతం పెంపు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ నిస్సాన్ మోటార్ ఇండియా తన డాట్సన్ గో, గో ప్లస్ మోడల్ కార్ల ధరలను ఏప్రిల్ 1 నుంచి 4 శాతం పెంచనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. పలు ఆర్థిక అంశాల కారణంగా ఇటీవలి కాలంలో పెరిగిన ముడి వస్తువుల ధరల భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంలో భాగంగా ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ సేల్స్ డైరెక్టర్ హర్దీప్ సింగ్ వివరించారు. మహీంద్రా, రెనాల్ట్, టాటా మోటార్స్, టయోటా కూడా ఏప్రిల్ 1 నుంచి ధరలు పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. -
‘సిల్వర్’ సింధుకు మరో కానుక
విజయవాడ (రామవరప్పాడు) : రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు మరో కానుక లభించింది. డాట్సన్ కంపెనీ ప్రతినిధులు బుధవారం ఆమెకు కారును బహూకరించారు. ఎనికేపాడులోని లక్కి నిస్సాన్ షోరూమ్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు సింధును సన్మానించారు. అనంతరం ఆమెకు డాట్సన్ రెడీగో స్పోర్ట్స్ కారు తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా నిస్సాన్ మోటార్ ప్రయివేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ అగర్వాల్ మాట్లాడుతూ ఈ కారులో అకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయని చెప్పారు. తన క్రీడా ప్రతిభ ద్వారా దేశానికి వన్నె తెచ్చిన సింధుకు కారును అందజేయడం సంతోషంగా ఉందన్నారు. పీవీ సింధు మాట్లాడుతూ కానుక అందజేసిన కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడితే ఎవరికైనా విజయం సొంతమవుతుందని తెలిపారు. తాను ఎంతో కష్టపడి ఒలింపిక్స్‌లో పతకం సాధించానని గుర్తుచేసుకున్నారు. యువత ఏకాగ్రత, పట్టుదలను అలవరుచుకుంటే ఎదైనా సాధించవచ్చునని సూచించారు.