‘సిల్వర్‌’ సింధుకు మరో కానుక | PV sindhu gets one more gift | Sakshi
Sakshi News home page

‘సిల్వర్‌’ సింధుకు మరో కానుక

Published Wed, Oct 5 2016 8:16 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

‘సిల్వర్‌’ సింధుకు మరో కానుక

‘సిల్వర్‌’ సింధుకు మరో కానుక

విజయవాడ (రామవరప్పాడు) : రియో ఒలింపిక్స్‌ లో సిల్వర్‌ మెడల్‌ గెలిచిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు మరో కానుక లభించింది. డాట్సన్ కంపెనీ ప్రతినిధులు బుధవారం ఆమెకు కారును బహూకరించారు. ఎనికేపాడులోని లక్కి నిస్సాన్ షోరూమ్‌లో  ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు సింధును సన్మానించారు. అనంతరం ఆమెకు డాట్సన్ రెడీగో స్పోర్ట్స్ కారు తాళాలు అందజేశారు.

ఈ సందర్భంగా నిస్సాన్ మోటార్ ప్రయివేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ అగర్వాల్ మాట్లాడుతూ ఈ కారులో అకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయని చెప్పారు. తన క్రీడా ప్రతిభ ద్వారా దేశానికి వన్నె తెచ్చిన సింధుకు కారును అందజేయడం సంతోషంగా ఉందన్నారు. పీవీ సింధు మాట్లాడుతూ కానుక అందజేసిన కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడితే ఎవరికైనా విజయం సొంతమవుతుందని తెలిపారు. తాను ఎంతో కష్టపడి ఒలింపిక్స్‌లో పతకం సాధించానని గుర్తుచేసుకున్నారు. యువత ఏకాగ్రత, పట్టుదలను అలవరుచుకుంటే ఎదైనా సాధించవచ్చునని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement