పండుగ స్పెషల్ ఆఫర్.. డాట్సన్‌ కార్లపై భారీగా డిస్కౌంట్ | Datsun India Announces Benefits Of Up To RS 40000 | Sakshi
Sakshi News home page

పండుగ స్పెషల్ ఆఫర్.. డాట్సన్‌ కార్లపై భారీగా డిస్కౌంట్

Published Tue, Oct 12 2021 5:51 PM | Last Updated on Tue, Oct 12 2021 5:59 PM

 Datsun India Announces Benefits Of Up To RS 40000 - Sakshi

ఈ పండుగ సీజన్‌లో సరసమైన ధరలకే డాట్సన్ కారును కొనుగోలు చేసే కస్టమర్ల కోసం కంపెనీ ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ నెలలో కొత్తగా డాట్సన్ కారును కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. ప్రస్తుతం 'డాట్సన్' దేశంలో విక్రయించే కార్ల(రెడి-గో, గో, గో ప్లస్)పై ఆకర్షనీయమైన ఆఫర్లు ప్రకటించింది. అత్యధికంగా రూ.40 వేల వరకూ రాయితీలు అందిస్తుంది. ఈ స్టాక్ కొనసాగే వరకు లేదా అక్టోబర్ 31, 2021 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. డీలర్‌ షిప్‌ స్థాయి బట్టి ఆఫర్లో మార్పులు ఉంటాయి. (చదవండి: నెలకు రూ.25 లక్షలు సంపాదిస్తున్న ఇండియన్ గేమర్!)

ఎన్‌ఐసీ అవకాశం ఉన్న చోట్ల మాత్రమే ఎక్స్‌ఛేంజీ బోనస్‌ లభిస్తుంది. అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. డాట్సన్‌ రెడీ-గోపై రూ.40,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీనిలో ₹20,000 నగదు ప్రయోజనం, ₹ 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. ఎంపిక చేసిన కార్పొరేట్ ఉద్యోగులకు కార్ల కంపెనీ ₹5,000 అదనపు కార్పొరేట్ ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది. ఇక డాట్సన్‌ గో హ్యాచ్‌ బ్యాక్‌  5 సీటర్‌ మోడల్‌పై రూ. 40 వేల ఆఫర్‌ ప్రకటించింది. దీనిలో క్యాష్‌బ్యాక్‌, ఎక్స్‌ఛేంజీ బోనస్‌ కింద ఒక్కోటి రూ.20 వేల చొప్పున ఉంది. ఇటువంటి ఆఫరే గో ప్లస్‌ మోడల్‌పై కూడా ఉంది. 7 సీటర్‌ ఎంపీవీపై రూ.20 వేల నగదు లబ్ధి, రూ.20 వేలు ఎక్స్‌ఛేంజీ బోనస్‌ ఇస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement