నిస్సాన్ మోటార్ ఇండియా కొత్త ఎస్‌యూవీని లాంచ్ చేసింది. 'కిక్స్' పేరుతో ఒక కొత్త సబ్-కాంపాక్ట్ ఎస్యూవీని భారత మార్కెట్లో ఆవిష్కరించింది. నాలుగు వేరియంట్లలో ఇది లభ్యం కానుంది. ఎక్స్‌ఎల్, ఎక్స్‌వి, ఎక్స్‌వి ప్రీమియం, ఎక్స్‌వీ ప్రీమియం ప్లస్ అనే నాలుగు వెర్షన్స్‌ను తీసుకొచ్చింది. ప్రధాన ప్రత్యర్థులు హ్యుందాయ్ క్రెటా, రెనాల్ట్ డస్టర్, మారుతి ఎస్-క్రాస్‌కి ధీటుగా, పోటీగా ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్స్‌ఎల్ పెట్రోల్ బేసిక్ వేరియంట్ కోసం రూ .9.55 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రారంభ ధరగా నిర్ణయించింది.
నిస్సాన్ కిక్స్ బేసిక్ వేరియంట్‌లో కూడా ఎడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, పవర్ విండోస్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక ఎసీ,వెంట్స్ నాలుగు స్పీకర్లతో ఒక బ్లూటూత్, యూఎస్‌బీ, ఆక్స్- ఎనేబుల్ ఆడియో సిస్టమ్ లాంటి కీలక ఫీచర్స్‌ను పొందుపర్చింది.
ఇక టాప్ ప్రీమియం ప్లస్‌లో ఎరౌండ్ వ్యూ డిస్‌ప్లే కలిగిన 360 డిగ్రీ కెమెరాతోపాటు ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ ప్లే కంపాటిబిలిటీ ఇచ్చింది. ఇంకా టెలీమాటిక్స్-ఎనేబుల్ స్మార్ట్ వాచ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రెల్స్ , 8.0 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎల్‌ఈడీ హెడ్ లాంప్స్ క్రూయిస్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, వైపర్స్‌ను జోడించింది. ఎక్స్‌టీరియర్‌గా స్టయిలుష్ లుక్‌ను జత చేసింది. 17ఇంచ్ అల్లాయ్ వీల్స్ , హిల్ స్టార్ట్ అసిస్ట్, నిస్సాన్ ఇంటెలిజెంట్ మొబిలిటీ లాంటి ఫీచర్స నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ సొంతం.
ఈ వాహనాల్లో 1.5 లీటర్ల పెట్రోల్, డిజీల్ ఇంజీన్‌లను అమర్చింది. పెట్రోల్ ఇంజీన్ 105బీహెచ్‌పీ పవర్ వద్ద 142 గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. డీజిల్ ఇంజీన్ 108 బీహెచ్‌పీ వద్ద 240 గరిష్ట్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.
పెట్రోల్ వేరియంట్ (ఎక్స్-షోరూం) ధరలు
కిక్స్ ఎక్స్‌ఎల్ ధర - రూ. 9.55 లక్షలు
కిక్స్ ఎక్స్‌వీ ధర - రూ. 10.95 లక్షలు
డీజిల్ వేరియంట్ (ఎక్స్-షోరూం) ధరలు
కిక్స్ ఎక్స్‌ఎల్ ధర - రూ. 10.85 లక్షలు
కిక్స్ ఎక్స్‌వీ- రూ.12.49లక్షలు
కిక్స్ ఎక్స్‌వీ ప్రీమియం - రూ.13.65లక్షలు
కిక్స్ ఎక్స్‌వీ ప్రీమియం ప్లస్ - రూ.14.65లక్షలు
గత డిసెంబర్‌లోనే ప్రీ బుక్సింగ్స్ మొదలుపెట్టింది. అయితే 2019 జనవరిలో కిక్స్ వాహనాన్ని ప్రీ బుకింగ్ చేసుకున్న తొలి 500మంది వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఇంగ్లాండ్‌లో జరిగే ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌ను వీక్షించే సువర్ణావకాశాన్ని దక్కించుకునే ఛాన్స్ ఉందని నిస్సాన్ ఇండియా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment