రూ.11వేలకే డాట్సన్‌ గో, గో ప్లస్‌ బుకింగ్‌ | Datsun Go, Go Plus Unveiled In India, Bookings Begin | Sakshi
Sakshi News home page

రూ.11వేలకే డాట్సన్‌ గో, గో ప్లస్‌ బుకింగ్‌

Published Tue, Oct 2 2018 7:36 PM | Last Updated on Tue, Oct 2 2018 7:40 PM

Datsun Go, Go Plus Unveiled In India, Bookings Begin - Sakshi

సరికొత్త డాట్సన్ గో, గో ప్లస్ ఎంపీవీ మోడల్స్‌

సరికొత్త డాట్సన్ గో, గో ప్లస్ ఎంపీవీ కార్లను దేశీయ మార్కెట్లోకి ఆవిష్కరించింది డాట్సన్ ఇండియా. ఈ కొత్త అప్‌డేటెడ్‌ మోడల్స్‌ బుకింగ్స్‌ను దేశవ్యాప్తంగా ఉన్న డాట్సన్‌ డీలర్‌షిప్‌ల వద్ద కంపెనీ ప్రారంభించింది. 11 వేల రూపాయలకు వీటిని బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. అప్‌డేట్‌ చేసిన డాట్సన్‌ గో, డాట్సన్‌ గో ప్లస్‌ మోడల్‌ పలు అప్‌డేట్లతో కంపెనీ లాంచ్‌ చేస్తోంది. వెర్టికల్‌ హౌజింగ్‌లో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌తో కొత్త బంపర్స్‌ను ముందు వైపు ఇది కలిగి ఉంది. హెడ్‌ల్యాంప్స్‌ను, ఫ్రంట్‌ గ్రిల్‌ను రీడిజైన్‌ చేశారు. వెనుక వైపు బంపర్‌ను కూడా రీడిజైన్‌ చేసింది డాట్సన్‌ కంపెనీ. వెనుక వైపు కూడా వాషర్‌, వైపర్‌ ఉన్నాయి.  

కారు లోపల, పునరుద్ధరించిన డ్యాష్‌బోర్డు, 6.75 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ఉన్నాయి. ఆపిల్‌ కారుప్లే, ఆండ్రాయిడ్‌ ఆటోలకు ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌ అనుకూలంగా ఉంది. నాలుగు డోర్లకు కూడా పవర్‌ విండోస్‌ను కలిగి ఉండటం ఈ మోడల్స్‌ ప్రత్యేకత. అయితే ఈ ఫీచర్‌ కేవలం టాప్‌ స్పెషిఫికేషన్‌ మోడల్స్‌కు మాత్రమే ఉంది. గో, గో ప్లస్‌ మోడల్స్‌ రెండూ అంతకముందు మాదిరే 1.2 లీటరు పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి. ఇవి మార్కెట్‌లోకి వచ్చాక, మారుతీ సుజుకీ ఆల్టో కే10కు, అప్‌కమింగ్‌ హ్యుందాయ్‌ శాంట్రోకు, అప్‌కమింగ్‌ మారుతీ సుజుకీ వాగన్‌ ఆర్‌కు గట్టి పోటీ ఇవ్వనున్నాయి.

అప్‌డేట్‌ చేసిన ఈ మోడల్స్‌ ధరను డాట్సన్‌ పాత వాటి కంటే రూ.10వేల నుంచి రూ.15వేలు అదనంగా పెంచింది. డాట్సన్‌ గో ప్రస్తుతం మార్కెట్లో రూ.3.38 లక్షల నుంచి రూ.4.41 లక్షల మధ్యలో లభ్యమవుతుండగా.. గో ప్లస్‌ మోడల్‌ రూ.3.95 లక్షల నుంచి రూ.5.25 లక్షలకు విక్రయిస్తోంది. అంటే కొత్త మోడల్స్‌, పాత మోడల్స్‌ కంటే రూ.10వేల నుంచి రూ.15వేలు ఎక్కువగా పలుకనున్నాయి.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement