Datsun Go Plus
-
ఈ కంపెనీ కార్లపై భారీగా డిస్కౌంట్లు
న్యూఢిల్లీ: మీరు తక్కువ ధరలో మంచి కారు కొనాలని చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ కార్ల తయారీ సంస్థలు రెనాల్ట్, డాట్సన్ తమ కార్లపై భారీగా డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ డిస్కౌంట్లో భాగంగా కస్టమర్లు రూ.45,000 వరకు తగ్గింపు పొందవచ్చు. డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పీవీవిని జపాన్ ఆటోమొబైల్ తయారీ సంస్థ డాట్సన్ తయారు చేసింది. ఈ కారు మొత్తం 5 వేరియంట్లను కంపెనీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కారులో కంపెనీ 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించింది. ఇది 68 పీఎస్ నుంచి 77 పీఎస్ వరకు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 5 స్పీడ్ మాన్యువల్, సీవీటి ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ ఉన్నాయి. డాట్సన్ తన వినియోగదారులకు రూ.40,000 వరకు భారీ డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ కింద కంపెనీ వినియోగదారులకు రూ.20,000 వరకు నగదు తగ్గింపును అందిస్తోంది. అదే సమయంలో, వినియోగదారులు కూడా రూ.20,000 వారి పాత కారు స్థానంలో కొత్త కారును తీసుకోవడం ద్వారా పొందవచ్చు. మార్కెట్లో డాట్సన్ గో ప్లస్(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధర రూ.4.25 లక్షల నుంచి రూ. 6.99 లక్షలుగా ఉంది. అలాగే రెనో ట్రైబర్ - ఈ 7 సీట్ల కారు 4 వేరియంట్లు (RXE, RXL, RXT, RXZ) మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిలో 1.0-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్‌ను ఉంది. ఇది 96 ఎన్ఎమ్ టార్క్, 72 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. కారు యొక్క రెండవ వేరియంట్లో కంపెనీ 1.0-లీటర్ సామర్థ్యం గల టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించింది. ఇది 160 ఎన్ఎమ్ టార్క్, 100 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారుపై కంపెనీ 45,000 రూపాయల వరకు డిస్కౌంట్లను వినియోగదారులకు అందిస్తోంది. ఈ చౌకైన ఎంపీవీపై రూ.15 వేల వరకు నగదు తగ్గింపు, రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్‌ను కంపెనీ అందిస్తోంది. మార్కెట్లో రెనాల్ట్ ట్రైబర్ ప్రారంభ(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధర రూ. 5.30 లక్షల నుంచి రూ.7.65 లక్షలుగా ఉంది. చదవండి: వాహనదారులకు అదిరిపోయే శుభవార్త! -
రూ.11వేలకే డాట్సన్ గో, గో ప్లస్ బుకింగ్
సరికొత్త డాట్సన్ గో, గో ప్లస్ ఎంపీవీ కార్లను దేశీయ మార్కెట్లోకి ఆవిష్కరించింది డాట్సన్ ఇండియా. ఈ కొత్త అప్డేటెడ్ మోడల్స్ బుకింగ్స్‌ను దేశవ్యాప్తంగా ఉన్న డాట్సన్ డీలర్‌షిప్‌ల వద్ద కంపెనీ ప్రారంభించింది. 11 వేల రూపాయలకు వీటిని బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. అప్డేట్ చేసిన డాట్సన్ గో, డాట్సన్ గో ప్లస్ మోడల్ పలు అప్డేట్లతో కంపెనీ లాంచ్ చేస్తోంది. వెర్టికల్ హౌజింగ్‌లో ఎల్ఈడీ డీఆర్ఎల్తో కొత్త బంపర్స్‌ను ముందు వైపు ఇది కలిగి ఉంది. హెడ్‌ల్యాంప్స్‌ను, ఫ్రంట్ గ్రిల్‌ను రీడిజైన్ చేశారు. వెనుక వైపు బంపర్‌ను కూడా రీడిజైన్ చేసింది డాట్సన్ కంపెనీ. వెనుక వైపు కూడా వాషర్, వైపర్ ఉన్నాయి. కారు లోపల, పునరుద్ధరించిన డ్యాష్‌బోర్డు, 6.75 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఆపిల్ కారుప్లే, ఆండ్రాయిడ్ ఆటోలకు ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అనుకూలంగా ఉంది. నాలుగు డోర్లకు కూడా పవర్ విండోస్‌ను కలిగి ఉండటం ఈ మోడల్స్ ప్రత్యేకత. అయితే ఈ ఫీచర్ కేవలం టాప్ స్పెషిఫికేషన్ మోడల్స్‌కు మాత్రమే ఉంది. గో, గో ప్లస్ మోడల్స్ రెండూ అంతకముందు మాదిరే 1.2 లీటరు పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి. ఇవి మార్కెట్లోకి వచ్చాక, మారుతీ సుజుకీ ఆల్టో కే10కు, అప్‌కమింగ్ హ్యుందాయ్ శాంట్రోకు, అప్‌కమింగ్ మారుతీ సుజుకీ వాగన్ ఆర్కు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. అప్డేట్ చేసిన ఈ మోడల్స్ ధరను డాట్సన్ పాత వాటి కంటే రూ.10వేల నుంచి రూ.15వేలు అదనంగా పెంచింది. డాట్సన్ గో ప్రస్తుతం మార్కెట్లో రూ.3.38 లక్షల నుంచి రూ.4.41 లక్షల మధ్యలో లభ్యమవుతుండగా.. గో ప్లస్ మోడల్ రూ.3.95 లక్షల నుంచి రూ.5.25 లక్షలకు విక్రయిస్తోంది. అంటే కొత్త మోడల్స్, పాత మోడల్స్ కంటే రూ.10వేల నుంచి రూ.15వేలు ఎక్కువగా పలుకనున్నాయి. -
నిస్సాన్... డాట్సన్ గోప్లస్
న్యూఢిల్లీ: నిస్సాన్ మోటార్ ఇండియా కంపెనీ త న చౌక ధరల బ్రాండ్ అయిన డాట్సన్‌లో కాంపాక్ట్ మల్టీ పర్పస్ వెహికల్(ఎంపివీ), డాట్సన్ గో ప్లస్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇది డాట్సన్ బ్రాండ్‌లో తామందిస్తున్న రెండో కారు ఇదని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా చెప్పారు. 4 వేరియంట్ల(డి, డి1, ఏ, టి)లో అందిస్తున్న ఈ కారు ధరలు రూ.3.79 -4.61 లక్షల రేంజ్లో (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయని, సౌకర్యవంతమైన సిట్టింగ్ ఆప్షన్లు, అధిక లగేజ్ స్పేస్, 5 స్పీడ్ గేర్ బాక్స్ వంటి ఫీచర్లున్నాయని వివరించారు. 1.2 పెట్రోల్ ఇంజిన్‌తో లభ్యమయ్యే ఈ కారు 20.6 కిమీ. మైలేజీనిస్తుందని, లగేజీ స్పేస్ 347 లీటర్లని పేర్కొన్నారు. ఇది 4 మీటర్లలోపే పొడువు ఉండడం వల్ల దేశంలో తొలి సబ్-కాంపాక్ట్ ఎంపీవీ ఇదేనని పేర్కొన్నారు. ఇది డాట్సన్ గో కారు లాగానే ఉంటుందని, అయితే అదనంగా మూడో వరుస సీట్లు ఉంటాయని తెలియజేశారు.