నిస్సాన్... డాట్సన్ గోప్లస్ | Datsun Go+ vs Maruti Ertiga vs Honda Mobilio Spec comparison | Sakshi
Sakshi News home page

నిస్సాన్... డాట్సన్ గోప్లస్

Published Sat, Jan 17 2015 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

నిస్సాన్...  డాట్సన్ గోప్లస్

నిస్సాన్... డాట్సన్ గోప్లస్

 న్యూఢిల్లీ: నిస్సాన్ మోటార్ ఇండియా కంపెనీ త న చౌక ధరల బ్రాండ్ అయిన డాట్సన్‌లో కాంపాక్ట్ మల్టీ పర్పస్ వెహికల్(ఎంపివీ), డాట్సన్ గో ప్లస్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇది డాట్సన్ బ్రాండ్‌లో తామందిస్తున్న రెండో కారు ఇదని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా చెప్పారు. 4 వేరియంట్ల(డి, డి1, ఏ, టి)లో అందిస్తున్న ఈ కారు ధరలు రూ.3.79 -4.61 లక్షల రేంజ్‌లో (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయని, సౌకర్యవంతమైన సిట్టింగ్ ఆప్షన్లు, అధిక లగేజ్ స్పేస్, 5 స్పీడ్ గేర్ బాక్స్ వంటి ఫీచర్లున్నాయని వివరించారు. 1.2 పెట్రోల్ ఇంజిన్‌తో లభ్యమయ్యే ఈ కారు 20.6 కిమీ. మైలేజీనిస్తుందని, లగేజీ స్పేస్ 347 లీటర్లని పేర్కొన్నారు. ఇది 4 మీటర్లలోపే పొడువు ఉండడం వల్ల దేశంలో తొలి సబ్-కాంపాక్ట్ ఎంపీవీ ఇదేనని పేర్కొన్నారు. ఇది డాట్సన్ గో కారు లాగానే ఉంటుందని, అయితే అదనంగా మూడో వరుస సీట్లు ఉంటాయని తెలియజేశారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement