
లెక్సస్ కంపెనీ తన 'ఎల్ఎక్స్ 500డీ' కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండే ఈ కారు ప్రారంభ ధరలు రూ. 3 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా).
కొత్త లెక్సస్ ఎల్ఎక్స్ 500డీ గంభీరమైన డిజైన్ పొందుతుంది. ఈ కారు ముందు భాగంలోని స్పిండిల్ గ్రిల్ ఎల్ షేప్ ఎల్ఈడీ సిగ్నేచర్‌లతో పెద్ద, యాంగ్యులర్ హెడ్‌లైట్‌లను పొందుతుంది. 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ కారు వెనుక భాగంలో కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్‌లు, చంకీ క్లాడింగ్ వంటివి ఉన్నాయి.
లెక్సస్ ఎల్ఎక్స్ 500డీ.. 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 7 ఇంచెస్ డ్రైవ్ మోడ్ డిస్ప్లే, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, హెడ్స్-అప్ డిస్ప్లే, ఫ్రంట్ సీట్ మసాజ్ ఫంక్షన్స్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ & రియర్ సీట్లు, 4 జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, వైర్డు ఆండ్రాయిడ్ ఆటో, వెనుక ప్రయాణీకుల కోసం రెండు 11.6 ఇంచెస్ ఎంటర్‌టైన్‌మెంట్ డిస్‌ప్లేలు, సింగిల్ పేన్ సన్‌రూఫ్, 25 స్పీకర్ 3డీ మార్క్ లెవిన్సన్ సౌండ్ సిస్టమ్ మొదలైనవన్నీ ఉన్నాయి.
బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ప్రీ-కొలిషన్ సిస్టమ్, లేన్ డిపార్చర్, ట్రేస్ అసిస్ట్, సేఫ్ ఎగ్జిట్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అడాప్టివ్ హై బీమ్స్, 10 ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, ట్రైలర్ స్వే కంట్రోల్ మొదలైన సేఫ్టీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
ఇదీ చదవండి: నెలకు 10 రోజులు: టెక్ కంపెనీ కొత్త రూల్!
లెక్సస్ ఎల్ఎక్స్ 500డీ 3.3 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ వీ6 ఇంజిన్ పొందుతుంది. 304 హార్స్ పవర్, 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 10 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్, యాక్టివ్ హైట్ కంట్రోల్, స్టాండర్డ్ సెంటర్ డిఫరెన్షియల్ లాక్ మరియు అడాప్టివ్ సస్పెన్షన్‌ను పొందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment