డాట్సన్‌ ‘రెడి–గో’లో ఏఎంటీ వెర్షన్‌ | Nissan launches Datsun redi-GO AMT version priced Rs 3.8 lakh | Sakshi
Sakshi News home page

డాట్సన్‌ ‘రెడి–గో’లో ఏఎంటీ వెర్షన్‌

Published Wed, Jan 24 2018 2:42 AM | Last Updated on Wed, Jan 24 2018 2:42 AM

Nissan launches Datsun redi-GO AMT version priced Rs 3.8 lakh - Sakshi

న్యూఢిల్లీ:  నిస్సాన్‌ మోటార్‌ ఇండియా తాజాగా తన డాట్సన్‌ బ్రాండ్‌లోని ఎంట్రీ లెవెల్‌ మోడల్‌ ‘రెడి–గో’లో ఆటోమేటెడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ (ఏఎంటీ) వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.3.8 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ). రెడి–గో స్టాండర్డ్‌ వెర్షన్‌తో పోలిస్తే ప్రస్తుత వెర్షన్‌ ధర దాదాపు రూ.22,000 ఎక్కువగా ఉంది.

రెడి–గో ఏఎంటీ వెర్షన్‌లో డ్యూయెల్‌ డ్రైవింగ్‌ మోడ్, రష్‌ అవర్‌ మోడ్‌ సహా పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది.   కాగా కంపెనీ ఈ కొత్త కారులో 1 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చింది. ఇది మారుతీ ఆల్టో కే10 ఏజీఎస్, రెనో క్విడ్‌ ఏఎంటీ మో డళ్లకు గట్టి పోటీనిస్తుందని విశ్లేషకుల అభిప్రాయం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement