న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘నిస్సాన్ మోటార్ ఇండియా’ తాజాగా తన ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ కారు రెడిగోలో ‘డాట్సన్ రెడిగో గోల్డ్’ అనే లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. 1 లీటర్ ఇంజిన్ సామర్థ్యంతో వస్తోన్న ఈ కారు ధర రూ.3.69 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది.
కంపెనీ ఇందులో రివర్స్ పార్కింగ్, కొత్త మ్యూజిక్ సిస్టమ్ వంటి పలు ప్రత్యేకతలను పొందుపరిచింది. వినియోగదారులకు దేశవ్యాప్తంగా ఉన్న నిస్సాన్, డాట్సన్ డీలర్‌షిప్స్ వద్ద ఈ వేరియంట్ అందుబాటులో ఉంటుందని నిస్సాన్ మోటార్ ఇండియా తెలిపింది. కస్టమర్లకు పండుగ సీజన్‌ను ప్రత్యేకంగా మార్చేందుకు మరింత శక్తి, పనితీరు, స్టైల్, సౌలభ్యంతో కొత్త వేరియంట్‌ను ఆవిష్కరించామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్, డాట్సన్ బిజినెస్ యూనిట్) జెరోమ్ సైగత్ తెలిపారు.