Fuel And Diesel Today, Petrol Price Hiked Again On May 25th 2021 - Sakshi
Sakshi News home page

Petrol, Diesel Prices: భగ్గుమంటున్న ఇంధన ధరలు

Published Tue, May 25 2021 10:05 AM | Last Updated on Tue, May 25 2021 1:15 PM

Petrol And Diesel Price Hiked Again On May 25th 2021 Tuesday - Sakshi

Petrol, Diesel Prices Today: ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. పెట్రోల్‌ ధర 23 పైసలు, డీజిల్‌ ధర 25 పైసల మేర పెరిగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోల్‌ రూ. 93.44, డీజిల్‌ రూ. 84.32 వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇక ముంబైలో అత్యధికంగా ఈ ధరలు వరుసగా రూ. 99.49(సెంచరీకి చేరువలో), 91.30గా ఉన్నాయి. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇంధన ధరల్లో మార్పులు చేయాలన్న నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ మేరకు రేట్ల మోత మోగుతుండటం గమనార్హం. ఇక ఈ నెలలో ధరలు పెరగటం ఇది పదమూడోసారి. గత మూడు వారాలుగా మొత్తంగా లీటరు పెట్రోల్‌ ధర. 3.04, డీజిల్‌ ధర 3.59 మేర పెరిగాయి.

లీటరు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
ఢిల్లీ: పెట్రోల్‌- రూ. 93.44, డీజిల్‌- రూ. 84.32
ముంబై: పెట్రోల్‌- రూ. 99.49, డీజిల్‌- రూ. 91.30
చెన్నై: పెట్రోల్‌- రూ.95.06, డీజిల్‌- రూ. 89.11
కోల్‌కతా: పెట్రోల్‌- రూ. 93.49, డీజిల్‌- రూ. 87.16
హైదరాబాద్‌: పెట్రోల్‌- రూ. 97.12, డీజిల్‌- రూ. 91.92

చదవండి: Stock Market:లాభాలతో మొదలైన సూచీలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement