Petrol, Diesel Prices Today: వాహనదారులకు ఇంధన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రెండు రోజుల వ్యవధి అనంతరం పెట్రోల్, డీజిల్ ధరల్లో శుక్రవారం మరోసారి పెరుగుదల నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 19 పైసలు పెరగగా, ప్రస్తుతం అక్కడ లీటరు ధర రూ. 93.85గా ఉంది. ఇక 29 పైసల మేర డీజిల్ ధర పెరగడంతో లీటరుకు రూ. 83.80 పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది.
ఇక వాణిజ్య రాజధాని ముంబై విషయానికొస్తే.. లీటరు పెట్రోల్ ధర సెంచరీకి చేరువ(99.32)లో ఉండగా, డీజిల్ ధర రూ. 91.01గా ఉంది. ఇక చెన్నైలో ఈ ధరలు వరుసగా రూ. 94.71, రూ. 88.62, కోల్‌కతాలో రూ. 93.11,రూ. 86.64గా ఉన్నాయి. కాగా గత పద్దెమినిది రోజులుగా మొత్తం మీద లీటరు పెట్రోల్ ధర రూ. 2.64, డీజిల్ ధరలు రూ. 3.07 మేర పెరిగింది.
హైదరాబాద్: లీటరు పెట్రోల్ ధర 96.70(20 పైసల పెరుగుదల), డీజిల్ ధర. 91.36(32 పైసలు).
నగరం | పెట్రోల్ ధర | డీజిల్ ధర |
ఢిల్లీ |
93.04 |
83.80 |
ముంబై |
99.32 |
91.01 |
చెన్నై |
94.71 |
88.62 |
కోల్‌కతా |
93.11 |
86.64 |
Comments
Please login to add a commentAdd a comment