మహీంద్రా థార్ వాహనాల ధర రూ.1.05 లక్షల వరకు పెరిగింది . బీఎస్ 6 ఫేజ్ 2 , ఆర్‌డీఈ ఉద్గార నిబంధనలకు రూపొందించిన నేపథ్యంలో ధరలు పెంచినట్లు తెలుస్తోంది. థార్ X (O) హార్డ్ టాప్ డీజిల్ MT RWD వేరియంట్ ధర రూ. 55,000, మహీంద్రా థార్ LX హార్డ్ టాప్ డీజిల్ MT RWD వేరియంట్ ధర రూ.1.05 లక్షలు పెరిగాయి. ఇతర మోడళ్ల ధర కూడా రూ. 28,000 పెరిగింది.
మహీంద్రా థార్ ఎస్‌యూవీ టాప్-స్పెక్ LX హార్డ్ టాప్ డీజిల్ AT 4WD కొత్త ధర రూ.16.77 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే బేస్ వేరియంట్ ధర రూ.13.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
థార్ కొత్త వేరియంట్?
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ థార్ కొత్త వేరియంట్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. లీక్ అయిన ఆర్‌టీఓ డాక్యుమెంట్ ప్రకారం ఆ కొత్త వేరియంట్ ఎంట్రీ లెవల్ థార్ 4x4 వేరియంట్ – AX (AC). ఈ మోడల్ ప్రస్తుతం ఉన్న AX (O) వేరియంట్ కంటే తక్కువగా స్థాయిలో త్వరలో రాబోయే మారుతి సుజుకీ జిమ్నీ కంటే ఎక్కువ స్థాయిలో ఉంటుంది. మహీంద్రా థార్ 4x4 AX (AC) వేరియంట్‌లో రెండు వరుసల సీట్లు ముందు వైపు రెండు, వెనుకవైపు రెండు ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది 2 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ మోడల్‌లలో వస్తుందని పుకార్లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment