సాక్షి, ముంబై: వాహన తయారీ కంపెనీలు ఒక్కొక్కటిగా ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకీ, రెనో, ఇసుజి, హీరో మోటోకార్ప్ కంపెనీలతో పాటు తాజాగా టయోటా కూడా ఈ జాబితాలో చేరింది. ఏప్రిల్ 1 నుంచి తమ వాహన శ్రేణిలోని అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వాహన మోడల్, వేరియంట్ బట్టి ధరల పెంపు ఉంటుందని వివరించింది. అధిక ముడి పదార్థాల రేట్లు, ఇతర కారణాల వల్ల ఉత్పాదక వ్యయాలు పెరగడంతో ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే, కస్టమర్‌పై కనీస స్థాయిలో మాత్రమే భారం మోపుతామని హామీ ఇచి్చంది. వాహనాల తయారీలో వినియోగించే స్టీల్, అల్యూమినియం సహా కీలకమైన లోహాల ధరలు పెరుగుతున్నాయి. దీంతో వాహన కంపెనీలు కూడా ఈ భారాన్నీ వినియోగదారులకు బదలాయిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment