సాక్షి, న్యూఢిల్లీ: పెట్రో ధరల పెంపు మంగళవారం కూడా కొనసాగింది. వరుసగా పదవ రోజు కూడా నింగిని చూస్తున్న ధరలు వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా పెట్రోలు పై 40-47 పైసలు, డీజిల్ పై 48-57 పైసలు పెరిగింది. రాబోయే కొద్ది రోజుల్లో ఇంధన రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ 10 రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 5.45 , డీజిల్ ధర లీటరుకు రూ. 5.8 (ఢిల్లీ రేట్లు) పెరిగింది. దీంతో పెట్రోలు ,డీజిల్ ధరలు ఈ ఏడాది గరిష్టానికి చేరాయి. (టాటా మోటార్స్ : ఉద్యోగులపై వేటు)
ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు
న్యూఢిల్లీ : పెట్రోలు ధర రూ. 76.73, డీజిల్ రూ.75.19
ముంబై : పెట్రోలు ధర రూ. 83.62, డీజిల్ రూ.73.75
చెన్నై: పెట్రోలు ధర రూ. 80.37, డీజిల్ రూ.73.17
హైదరాబాద్ : పెట్రోలు ధర రూ.79.65, డీజిల్ రూ.73.49
అమరావతి : పెట్రోలు ధర రూ. 80.11 డీజిల్ రూ.73.97
Comments
Please login to add a commentAdd a comment