Honda City cars
-
పెరగనున్న హోండా కార్ల ధరలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా వచ్చే నెల నుంచి సిటీ, అమేజ్ కార్ల ధరలను పెంచనుంది. ముడిసరుకు వ్యయం క్రమంగా అధికం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తాజాగా ప్రకటించింది. అయితే ధర ఎంత పెంచేదీ వెల్లడించలేదు. ప్రస్తుతం ఎక్స్‌షోరూంలో కాంపాక్ట్ సెడాన్ అమేజ్ ధర రూ.7.05 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే మధ్యస్థాయి సెడాన్ సిటీ రూ.11.57 లక్షల నుంచి మొదలవుతుంది. ఇక హైబ్రిడ్ మోడల్ అయిన సిటీ ఈ:హెచ్ఈవీ రూ.18.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
హోండా కార్లు కొనేవారికి చేదువార్త! ఆ మోడళ్ల ధరల పెంపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా సిటీ, అమేజ్ మోడళ్ల ధరలను జూన్ నుంచి ఒక శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. పెరిగిన వ్యయ ఒత్తిళ్ల ప్రభావాన్ని అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ బుధవారం (మే24) ప్రకటించింది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో అమేజ్ ధర రూ.6.99 లక్షల నుంచి రూ.9.60 లక్షల వరకు ఉంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ ట్రిమ్స్‌తో సహా సిటీ మోడల్ శ్రేణి రూ.11.55 లక్షలు మొదలుకుని రూ.20.39 లక్షల వరకు ఉంది. మరోవైపు హోండా ఇండియా కార్స్ తన తాజా ఎస్యూవీ లాంచింగ్ తేదీని ధ్రువీకరించింది. జూన్ 6న హోండా ఎలివేట్ ఎస్‌యూవీని ఆవిష్కరించనుంది. ఈ ఎస్‌యూవీకి సంబంధించిన టీజీర్ చిత్రాన్ని హోండా ట్విటర్ ద్వారా విడుదల చేసింది. ఇదీ చదవండి: e-Sprinto Amery: మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జి చేస్తే 140 కిలోమీటర్లు.. -
కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్' భారతీయ మార్కెట్లో విడుదలైంది. ఈ ఐదవ జనరేషన్ ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు, కాగా టాప్-స్పెక్ సిటీ హైబ్రిడ్ ధర రూ. 20.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ అప్డేటెడ్ ఫేస్‌లిఫ్ట్ ఆధునిక కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. కంపెనీ ఈ కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే ఆన్లైన్లో బుక్ చేసుకునే కస్టమర్లు రూ. 5,000, డీలర్‌షిప్‌లో బుక్ చేసుకునే కస్టమర్లు రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవాలి. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్స్ & ధరలు: ఎస్వి: రూ. 11.49 లక్షలు వి: రూ. 12.37 లక్షలు విఎక్స్: రూ. 13.49 లక్షలు జెడ్ఎక్స్: రూ. 14.72 లక్షలు కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ బంపర్, గ్రిల్, క్రోమ్ బార్ వంటి వాటిని కలిగి ఎల్ఈడీ లైట్స్, స్వెప్ట్‌బ్యాక్ టెయిల్ ల్యాంప్ పొందుతుంది. వెనుక వైపు కొత్తగా డిజైన్ చేసిన బంపర్ చూడవచ్చు, అంతే కాకుండా ఈ అప్డేటెడ్ మోడల్ అబ్సిడియన్ బ్లూ పెర్ల్ పెయింట్ షేడ్‌లో చూడచక్కగా కనిపిస్తుంది. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ బేస్ మోడల్ కేవలం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వస్తుంది. మిగిలిన మూడు వేరియంట్లు సివిటి గేర్‌బాక్స్ పొందుతాయి. ఈ కొత్త మోడల్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ADAS ఫీచర్లను పొందుతుంది. కంపెనీ ఇప్పుడు హోండా సిటీ హైబ్రిడ్ వేరియంట్లోని ADAS టెక్నాలజీకి "లో-స్పీడ్ ఫాలో" ఫంక్షన్ అని పిలువబడే ఒక కొత్త ఫీచర్‌ను జోడించింది. ఇది ముందున్న వాహనానికి దూరంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇందులోని లీడ్ కార్ డిపార్చర్ నోటిఫికేషన్ సిస్టమ్ వల్ల కారు ముందుకు కదిలినప్పుడు డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ యాంబియంట్ లైటింగ్, వైర్లెస్ ఛార్జర్ మరియు వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రెయిన్-సెన్సింగ్ వైపర్ వంటి ఫీచర్స్‌తో పాటు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది. కంపెనీ ఈ సెడాన్ పెట్రోల్, సిటీ హైబ్రిడ్ రెండింటిపైన మూడు సంవత్సరాలు/అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ అందిస్తుంది. దీనిని ఐదు సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. పెట్రోల్ ఇంజిన్ 121 బీహెచ్‌పి పవర్ అందిస్తుంది. హైబ్రిడ్ ఇంజిన్ eCVT ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. కంపెనీ ఈ రెండు ఇంజిన్లను రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ చేసింది. -
కీలక మైలురాయిని అధిగమించిన హోండా కార్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా కొత్త మైలురాయిని అధిగమించింది. దేశీయంగా మొత్తం 20 లక్షల కార్లను ఉత్పత్తి చేసినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. 20లక్షల మార్క్‌గా ప్రీమియం సెడాన్ హోండా సిటీ కారును విడుదల చేసింది. ఇదీ చదవండి : మారుతి స్విఫ్ట్-2023 కమింగ్ సూన్: ఆకర్షణీయ, అప్డేటెడ్ ఫీచర్లతో భారత్‌లో రాజస్తాన్‌లోని టపూకరా వద్ద సంస్థకు ప్లాంటు ఉంది. 1997 డిసెంబర్లో ఉత్పత్తి ప్రారంభం అయింది. దేశంలో ఇప్పటి వరకు హోండా రూ.10,000 కోట్లను వెచ్చించింది. సిటీ, అమేజ్ మోడళ్లను 15కుపైగా మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. ప్లాంటు సామర్థ్యం ఏటా 1,80,000 యూనిట్లుగా ఉంది. కాగా భారతదేశంలోని తన వినియోగదారుల కోసం ప్రీమియం, ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అందించడంపై దృష్టి సారించి కార్యకలాపాలను ప్రారంభించామనీ,"మేక్ ఇన్ ఇండియా" విజన్‌లో భాగంగా 2 మిలియన్ల మైలురాయిని దాటామని కంపెనీ ప్రకటించింది. భారత్‌లో 2 మిలియన్ల కార్ల ఉత్పత్తి అనే చారిత్రాత్మక మైలురాయి దాటడం అంటే గత 25గా 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి హోండా నిబద్ధతకు నిదర్శమ ని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ టకుయా సుమురా తెలిపారు. ఇదీ చదవండి : పలు మోడళ్ల హోండా కార్లపై భారీ తగ్గింపు -
పలు మోడళ్ల హోండా కార్లపై భారీ తగ్గింపు
న్యూఢిల్లీ: పలు మోడళ్ల హోండా కార్లపై భారీ తగ్గింపు లభిస్తోంది. హోండా సిటీ, జాజ్, WR-V లాంటి మోడల్స్ రూ. 63,000 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. నవంబరు నెలకు సంబంధించిన ఈ డీల్స్ కస్టమర్లు తమకు సమీపంలో ఉన్న డీలర్‌షిప్‌ను సంప్రదించడం ద్వారా మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దేశంలో ఐదు విభిన్న హోండా మోడల్‌లు అందుబాటులో ఉన్నాయి: అమేజ్, సిటీ (5వ తరం), సిటీ (4వ తరం), జాజ్ , WR-బలతో సహా ఐదు విభిన్న మోడళ్లను అందిస్తుంది. హోండా డబ్యుఆర్-వీ డబ్యుఆర్-వీ కి అతిపెద్ద తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 30,000 నగదు తగ్గింపు లేదా రూ. 36,144 విలువైన ఉచిత యాక్సెసరీలున్నాయి. అలాగే రూ. 7,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,000 లాయల్టీ బోనస్‌లు తదితరాలు ఉన్నాయి. హోండా అమేజ్ సబ్-కాంపాక్ట్ సెడాన్ హోండా అమేజ్ కొనుగోలుపై కస్టమర్లు రూ. 10,000 నగదు, లేదా రూ. 11,896 విలువైన ఉచిత యాక్సెసరీలను పొంద వచ్చు, అదనంగా రూ. 5,000 లాయల్టీ ఇన్సెంటివ్, రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు లభ్యం. హోండా జాజ్: త్వరలోనే ఉత్పత్తిని నిలిపివేయాలని భావిస్తున్న హోండా జాజ్‌పై 25 వేల తగ్గింపు లభ్యం. హోండా సిటీ (5వ జనరేషన్ : హోండా సిటీ మాన్యువల్‌పై రూ. 59,292 మొత్తం తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 30వేల నగదు తగ్గింపు లేదా రూ. 32,292 విలువైన ఉచిత యాక్సెసరీలు, ఇంకా ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్, కార్పొరేట్ తగ్గింపును కూడా అందిస్తోంది. -
వచ్చేస్తున్నాయి..హోండా సిటీ హైబ్రిడ్ కార్లు..బుకింగ్స్ షురూ..!
న్యూఢిల్లీ: కొత్తగా ప్రకటించిన సిటీ కారు ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెర్షన్ ’ఇ:హెచ్ఈవీ’ ఉత్పత్తిని ప్రారంభించినట్లు హోండా కార్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్) వెల్లడించింది. రాజస్థాన్‌లోని తాపుకారా ప్లాంట్‌లో వీటిని తయారు చేస్తున్నట్లు వివరించింది. హోండా సిటీ ఇ:హెచ్ఈవీని వచ్చే నెల తొలినాళ్లలో మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ టకుయా సుమురా తెలిపారు. డీలర్ల దగ్గర రూ. 21,000 లేదా కంపెనీ వెబ్సైట్లో రూ. 5,000 చెల్లించడం ద్వారా కారును బుక్ చేసుకోవచ్చని వివరించా రు. ఇందులో విశిష్టమైన సెల్ఫ్ చార్జింగ్ ఫీచర్ ఉందని పేర్కొన్నారు. 3 ఏళ్ల అన్లిమిటెడ్ కిలోమీటర్ల స్టాండర్డ్ వారంటీ ఉంటుందని, లిథియం అయాన్ బ్యాటరీపై 8 ఏళ్లు లేదా 1.6 లక్షల కి.మీ. (ఏది ముందైతే అది) వివరించారు. చదవండి: ఒకే సారి రూ. 3 లక్షల వరకు పెంపు..ఈ కంపెనీ కార్లు మరింత ప్రియం..! -
హోండా సిటీ హైబ్రిడ్ కారు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ తాజాగా తమ సిటీ ఈ:హెచ్ఈవీ సెడాన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కారును గురువారం ఆవిష్కరించింది. ఈ కారుకి సంబంధించి బుకింగ్స్ ప్రారంభించామని, వచ్చే నెలలో మార్కెట్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నామని సంస్థ భారత విభాగం ప్రెసిడెంట్ తకుయా సుమురా తెలిపారు. రెండు సెల్ఫ్–చార్జింగ్ మోటార్లు, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వంటి ప్రత్యేకతలు ఈ కారులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మరింత విస్తృతమైన యాంగిల్‌తో ఫ్రంట్ కెమెరా, ముందున్న రహదారిని స్కాన్ చేసి .. ప్రమాదాలను నివారించేలా డ్రైవరును అప్రమత్తం చేయగల సాంకేతికత మొదలైనవి ఇందులో పొందుపర్చినట్లు సుమురా వివరించారు. వచ్చే ఏడాది సరికొత్త ఎస్‌యూవీని (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం) భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు సుమురా తెలిపారు. తమ ఉత్పత్తుల ఎగుమతులకు భారత్‌ను కీలక కేంద్రంగా మార్చుకోవడంపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెడుతోందని ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 20 వేల పైచిలుకు వాహనాలు ఎగుమతి చేశామని, ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు అదే స్థాయిలో ఎగుమతులు ఉండగలవని సుమురా వివరించారు. చిప్‌ల కొరత, సరఫరా వ్యవస్థ సమస్యలతో వాహనాల ఉత్పత్తిపై ప్రభావం పడుతోందని ఆయన తెలిపారు. -
కొత్త కారు కొనేవారికి బంపరాఫర్.. హోండా కార్లపై భారీగా డిస్కౌంట్!
కొత్త కారు కొనేవారికి హోండా శుభవార్త అందించింది. హోండా కంపెనీ మార్చి నెలలో కూడా తమ కార్లపై డిస్కౌంట్ అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్లు నెల చివరి వరకు అందుబాటులో ఉండనున్నాయి. హోండా అమేజ్, హోండా సిటీ 5వ జనరేషన్, హోండా సిటీ 4వ జనరేషన్, హోండా డబ్ల్యుఆర్-వీ, హోండా జాజ్ కార్లపై డిస్కౌంట్ అందిస్తుంది. కారు మోడల్ & వేరియంట్ బట్టి డిస్కౌంట్ ₹35,596 వరకు లభిస్తుంది. 5వ జనరేషన్ కాంపాక్ట్ సెడాన్ హోండా సిటీ మీద ₹35,596 అత్యధిక డిస్కౌంట్ అందిస్తుంది. ఇంతక ముందు హోండా ఇదే మోడల్ కారుపై దాదాపు ₹36,000 డిస్కౌంట్ ఇచ్చింది. హోండా సిటీ 5వ జనరేషన్ కారుపై డిస్కౌంట్ లో భాగంగా ₹10,000 వరకు నగదు డిస్కౌంట్, కారు ఎక్స్ఛేంజ్ కింద ₹5000, హోండా కస్టమర్ లాయల్టీ బోనస్ ₹5000, హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ ₹7000, అలాగే ₹8000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. హోండా సిటీ 4వ జనరేషన్ కారు మీద కూడా ₹20000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. వీటిలో హోండా కస్టమర్ లాయల్టీ బోనస్ కింద ₹5000, హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ కింద ₹7000, కార్పొరేట్ డిస్కౌంట్ కింద ₹8000 ఉన్నాయి. హోండా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ జాజ్ మీద ₹33,158 రెండవ అత్యధిక డిస్కౌంట్ అందిస్తుంది. ఇందులో రూ.10,000 వరకు నగదు డిస్కౌంట్ లేదా ₹12,158 వరకు ఎఫ్ఓసీ యాక్ససరీస్, రూ.5,000 విలువైన కారు ఎక్స్ఛేంజ్'పై డిస్కౌంట్, ₹5,000 హోండా కస్టమర్ లాయల్టీ బోనస్, హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.7,000, కార్పొరేట్ డిస్కౌంట్ ₹4,000 వరకు ఉన్నాయి. హోండా సబ్ కాంపాక్ట్ ఎస్యువి డబ్ల్యుఆర్-వీ హోండా మోడల్స్ మీద దాదాపు ₹26,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ అన్ని హోండా డబ్ల్యుఆర్-వీ పెట్రోల్ వేరియంట్, గ్రేడ్'లపై చెల్లుబాటు అవుతుంది. దీనిలో ₹10,000 విలువైన కారు ఎక్స్ఛేంజ్, హోండా కస్టమర్ లాయల్టీ బోనస్ కింద ₹5,000, హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ కింద ₹7,000, కార్పొరేట్ డిస్కౌంట్ ₹4,000 వరకు ఉన్నాయి. హోండా అమేజ్ సబ్ కాంపాక్ట్ సెడాన్ అన్ని వేరియెంట్ల మీద ₹15,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్'లో హోండా కస్టమర్ లాయల్టీ బోనస్ కింద ₹5,000, హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ ₹6,000, కార్పొరేట్ డిస్కౌంట్ కింద ₹4,000 ఇస్తున్నట్లు తెలిపింది. ఈ జపనీస్ కార్ల తయారీసంస్థ జనవరిలో తన అమ్మకాల్లో మూడు శాతం తగ్గినట్లు పేర్కొంది. గత జనవరి నెలలో 12,149 యూనిట్లు విక్రయించినట్లు సంస్థ తెలిపింది. ఏడాది క్రితం ఇదే నెలలో కంపెనీ మొత్తం 12,552 యూనిట్లను విక్రయించింది. 2021 జనవరిలో 11,319 యూనిట్ల దేశీయ అమ్మకాలతో పోలిస్తే జనవరిలో 10,427 యూనిట్లు అమ్మినట్లు పేర్కొంది. (చదవండి: Joy E-Bike: 500 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.115 ఖర్చు..!) -
ఇయర్ ఎండ్ సేల్: పలు కార్ల కొనుగోలుపై రూ. లక్ష వరకు తగ్గింపు..!
Year End Offers On Cars 2021: మీరు కారు కొనాలనుకుంటున్నారా..! అయితే వెంటనే కొనేయండి. ఎందుకంటే వచ్చే ఏడాది నుంచి దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు పలు వాహనాల రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఆయా కార్ల ధరలు భారీగానే పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇయర్ ఎండ్ కావడంతో పలు ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. నిస్సాన్, మహీంద్రా, హోండా, హ్యుందాయ్ వంటి వాహన తయారీదారులు ఇయర్ ఎండ్సేల్ను ప్రకటించాయి. ఈ ఆఫర్లు డిసెంబర్ 31, 2021 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు చెల్లుబాటుకానున్నాయి. ఇయర్ ఎండ్ సేల్ భాగంగా పలు కార్లపై ఆయా కంపెనీలు అందిస్తోన్న ఆఫర్లు..! రెనాల్ట్ డస్టర్ రెనాల్ట్ ఇండియా ఈ నెలలో డస్టర్ ఎస్‌యూవీపై గరిష్టంగా రూ. 1.3 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. ఇందులో రూ. 50 000 ఎక్స్చేంజ్ బెనిఫిట్స్, రూ. 50వేల వరకు నగదు తగ్గింపు, రూ. 30 వేల వరకు కార్పొరేట్ తగ్గింపును కొనుగోలుదారులు పొందవచ్చును. కంపెనీ reli.ve స్క్రాప్‌పేజ్ ప్రోగ్రామ్ కింద రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చును. నిస్సాన్ కిక్స్ ఎస్యూవీ నిస్సాన్ కిక్స్ ఎస్యూవీ కొనుగోలుపై ఏకంగా రూ. లక్ష వరకు తగ్గింపును అందిస్తోంది. నిస్సాన్ మిడ్-సైజ్ ఎస్యూవీ 1.3 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో రానుంది. 1.3 లీటర్ టర్భో పెట్రోల్ వెర్షన్‌పై రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 70 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. కాగా 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్ పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ , రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. ఈ రెండు వెర్షన్లపై కొనుగోలుదారులకు రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు, రూ. 5,000 ఆన్లైన్ బుకింగ్ బోనస్‌ను కూడా పొందవచ్చును. మహీంద్రా అల్టురాస్ G4 మహీంద్రా అల్టురాస్ G4 ఎస్యూవీ కొనుగోలుపై మహీంద్రా రూ. 81, 500 వరకు తగ్గింపులను ప్రకటించింది. ఇందులో రూ. 50 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 11,500 వరకు కార్పొరేట్ ఆఫర్, రూ. 20,000 వరకు ఇతర ఆఫర్లను కొనుగోలుదారులకు మహీంద్రా ప్రకటించింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్ కొనుగోలుపై గరిష్టంగా రూ. 50వేల వరకు తగ్గింపును పొందవచ్చును. ఈ ఆఫర్స్ టర్బో వేరియంట్‌పై మాత్రమే వర్తిస్తాయి. ఇతర పెట్రోల్, డీజిల్ వేరియంట్లు రూ.25,000 వరకు తగ్గింపులను పొందవచ్చును. స్పోర్ట్జ్ పెట్రోల్ DT వేరియంట్‌పై ఏలాంటి ప్రత్యేక ఆఫర్లు లేవు. సీఎన్జీ మోడల్స్‌పై రూ.17,300 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. హోండా సిటీ హోండా సిటీ కారుపై హోండా ఇండియా పలు ఆఫర్లను ప్రకటించింది. ఐదోవ తరం హోండా సిటీ సెడాన్‌పై గరిష్టంగా రూ. 45,108 వరకు తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్స్ అన్ని వేరియంట్లకు వర్తిస్తాయి. ఇందులో రూ. 7,500 వరకు నగదు తగ్గింపు లేదా రూ. 8,108 వరకు ఎఫ్ఓసీ ఉపకరణాలు ఉన్నాయి. వీటితో పాటుగా రూ. 15,000 ఎక్సేచేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు. అదనపు బెనిఫిట్స్‌లో భాగంగా రూ. 5,000 లాయల్టీ బోనస్, రూ. 9,000 హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.8,000 కార్పొరేట్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. చదవండి: 20 కోట్ల సార్లు కాల్స్..! 6 లక్షల 64 వేల మందికి నరకం చూపించిన ఒకే ఒక్క నెంబర్..! -
హోండా కార్లపై అదిరిపోయే ఫెస్టివల్ ఆఫర్.. భారీ డిస్కౌంట్
మీరు కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక భారీ శుభవార్త. పండుగ సీజన్ నేపథ్యంలో హోండా కార్స్ ఇండియా పలు మోడల్ కార్లపై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. ప్రస్తుత ఐదవ తరం హోండా సిటీ కారుపై ₹53,500 వరకు అత్యధిక డిస్కౌంట్ అందిస్తుంది. అలాగే, తన నాల్గవ తరం హోండా సిటీ కారుపై ₹22,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. పండుగ సీజన్ పురస్కరించుకొని ఈ ఆఫర్లు ప్రకటించుకొని ఆఫర్లు ప్రకటించినట్లు సంస్థ ప్రకటించింది. పలు మోడల్ శ్రేణి కార్లపై హోండా మోటార్స్ అందిస్తున్న డిస్కౌంట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ సందర్భంగా హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ & డైరెక్టర్ రాజేష్ గోయెల్ మాట్లాడుతూ.. "పండుగలు మా జీవితంలో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. ఈ పండుగ సీజన్ సమయాల్లో ఎక్కువ మందికి చేరుకోవడం కోసం కార్లపై అద్భుతమైన ఆఫర్లు, ప్రమోషన్లను అందించడం మాకు సంతోషంగా ఉంది" అని అన్నారు. పండుగ ఉత్సాహం మొత్తం ఆటో పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇస్తుందని మేము ఆశిస్తున్నాము అని అన్నారు. సెమీకండక్టర్ కొరత కారణంగా సంస్థ ఇప్పటికీ సరఫరా విషయంలో అడ్డంకులను ఎదుర్కొంటోంది. గత ఏడాది క్రితం విక్రయించిన 10,199 యూనిట్లతో పోలిస్తే సెప్టెంబర్ 2021లో 6,765 యూనిట్లను మాత్రమే విక్రయించింది.(చదవండి: టెస్లా కంటే తోపు...! ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1120కిమీ ప్రయాణం..!) Models Offers 5వ తరం హోండా సిటీ ₹53,500 వరకు 4వ తరం హోండా సిటీ ₹22,000 వరకు కొత్త హోండా అమేజ్ ₹18,000 వరకు కొత్త హోండా డబ్ల్యుఆర్-వి ₹40,100 వరకు కొత్త హోండా జాజ్ ₹45,900 వరకు -
హోండా సిటీ : కొత్త వేరియంట్స్
సాక్షి, ముంబై: హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సిఐఎల్) తన పాపులర్ సెడాన్ హోండా సిటీ 2020ని మంగళవారం లాంచ్ చేసింది. హోండీ సిటీ కి చెందిన నాల్గవ తరం రెండు పెట్రోల్ వేరియంట్లను తాజాగా ఆవిష్కరించింది. 9.29 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) నుంచి ప్రారంభధరగా నిర్ణయించింది. ఇటీవలే హోండా సిటీ సెడాన్ సరికొత్త 5 వ తరం వెర్షన్‌ను విడుదల చేసిన సంస్థ, 4 వ తరం కారును ఎస్ వీ, వి గ్రేడ్ అనే రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. బీఎస్ -6 ప్రమాణాలకనుగుణంగా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో (మాన్యువల్ ట్రాన్స్ మిషన్) ఈ కారును అందుబాటులోకి తెచ్చింది. బీఎస్ -6 ప్రమాణాలతో , సమకాలీన స్టైలింగ్‌తో తమ పాపులర్ మోడల్ 4వ తరం హోండా సిటీ అమ్మకం కొనసాగించాలని ఆశిస్తున్నామని హెచ్‌సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , మార్కెటింగ్ అండ్ సేల్స్ డైరెక్టర్ రాజేష్ గోయెల్ తెలిపారు. (చదవండి : ఒకినావా ఆర్30 ఈ స్కూటర్) -
22,834 హోండా కార్లు వెనక్కు
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 22,834 కార్లను హోండా రీకాల్ చేసింది. ముందు సీట్లో కూర్చొనే ప్యాసింజర్‌కు అవసరమైన ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌లో లోపాలు ఉన్నట్లు గుర్తించి వాటిని సవరించేందుకు వెనక్కు పిలిచింది. తకాటా కార్పొరేషన్ ఈ బ్యాగ్‌లను అమర్చనుంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 2013లో తయారు చేసిన హోండా సిటీ, జాజ్, అక్కార్డ్వంటి హోండా కార్లన్నింటిని రీకాల్ చేసింది. కొత్తగా అమర్చనున్న తకాటా ఎయిర్ బ్యాగ్‌లను ఉచితంగా అందించనున్నామని, తమ వినియోగదారుల నుంచి ఇందుకోసం ఎలాంటి వసూళ్లు చేయడం లేదని హోండా తెలిపింది. -
హోండా సిటీ విక్రయాలు@ 7 లక్షలు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హోండా కార్స్ ఇండియా’ (హెచ్‌సీఐఎల్)కు చెందిన పాపులర్ మిడ్సైజ్డ్ సెడాన్ కారు ‘హోండా సిటీ’ విక్రయాలు భారత్‌లో 7 లక్షల యూనిట్ల మైలురాయిని అధిగమించాయి. హెచ్‌సీఐఎల్ 1998లో హోండా సిటీని భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ మోడల్ అంతర్జాతీయ విక్రయాలను పరిశీలిస్తే.. వీటిల్లో భారత్ వాటా 25 శాతానికి పైగానే ఉంది. ‘హోండా సిటీ అనేది మాకు భారత్‌లో బెస్ట్ సెల్లింగ్ మోడల్. ఇండియాలో 7 లక్షల యూనిట్ల మార్క్‌ను అందుకున్న ఒకేఒక ప్రీమియం సెడాన్ ఇది’ అని హెచ్‌సీఐఎల్ ప్రెసిడెంట్, సీఈవో యుచిరో యూనో తెలిపారు. కాగా హోండా సిటీలో నాలుగు జనరేషన్లు ఉన్నాయి. తొలి జనరేషన్ హోండా సిటీ విక్రయాలు (1998–2003) 59,378 యూనిట్లుగా, రెండో జనరేషన్ హోండా సిటీ విక్రయాలు (2003–2008) 1,77,742 యూనిట్లుగా ఉన్నాయి. ఇక ఈ మోడల్ విక్రయాలు 2008–2013 మధ్యకాలంలో 1,92,939 యూనిట్లుగా, 2014 నుంచి ఇప్పటిదాకా 2,69,941 యూనిట్లుగా నమోదయ్యాయి. -
మంచి మార్కెట్ సాధించిన హ్యుండాయి
హైదరాబాద్: దక్షిణ కొరియాకు చెందిన హ్యుండాయి కంపెనీ మన దేశంలో మంచి మార్కెట్‌ను సాధించింది. మారుతి తర్వాత రెండో స్థానంలో కొనసాగుతూ కొన్ని సక్సెస్ఫుల్ మోడల్స్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ కంపెనీ తాజాగా తెచ్చిన గ్రాండ్ ఐ10 మోడల్‌ను కస్టమర్లు చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రాండ్ సిరీస్‌లో సెడాన్ మోడల్‌ను తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ఏడాది గ్రాండ్ సెడాన్‌ను లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు. సెడాన్ మోడల్లో ఐ10 పేరును ఉపయోగించే అవకాశం లేదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు హ్యుండాయి మరో రెండు కొత్త కార్లను ఈ ఏడాది లాంచ్ చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. జపాన్‌కు చెందిన హోండా కంపెనీ కొత్త సంవత్సరంపైన కోటి ఆశలు పెట్టుకుంది. కిందటి ఏడాది అమేజ్ మోడల్ అమ్మకాలు జోరు మీద ఉండటంతో ఈ కంపెనీలో ఉత్సాహం పరవళ్లు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో మన దేశంలో మూడు కొత్త మోడళ్లను లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో న్యూ జాజ్ -ఫిట్ మోడల్ ఒకటి. గతంలో హోండా జాజ్ ఘోరంగా విఫలమైంది. దీనిలోని లోపాలను సరిచేసి కొత్త జాజ్‌ను హోండా రంగంలోకి దించుతోంది. జాజ్-ఫిట్ అని పేరుపెట్టింది. హోండా కంపెనీకి సిటీ మోడల్ బాగా సక్సెస్ అయిన కార్లలో ఒకటి. దీనికి ఆధునిక సొబగులు అద్ది 2014లో తాజాగా విడుదల చేసే ప్రయత్నాల్లో హోండా కంపెనీ నిమగ్నమైంది. జనవరిలోనే సిటీ మోడల్‌ను మార్కోట్లోకి తెస్తామని కంపెనీ చెబుతోంది. దీని కోసం బుకింగ్స్‌ను కూడా ప్రారంభించినట్లు కంపెనీ వివరిస్తోంది. న్యూ సిటీ కారు ధర 8 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతోంది. ఇది ఇప్పటి వరకు మన దేశంలో ఏ కారు ఇవ్వనంత ఎక్కువగా, లీటర్ డీజిల్‌కు 26 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని హోండా చెబుతోంది. ఇంచుమించు సిటీ మోడల్లోనే ఉన్న అమేజ్ కారు కూడా మైలేజీ పరంగా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో కొత్త సిటీ కారుపై కస్టమర్లలో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మెర్సిడెజ్ బెంజ్ తన ప్రధాన మోడల్ అయిన ఎస్ క్లాసులో 2014 మోడల్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. 3 నెలల కిందటే అంతర్జాతీయ మార్కెట్లోకి వచ్చిన ఎస్ క్లాస్ ధర ఢిల్లీ షోరూములో కోటి 57 లక్షల రూపాయలుగా ఉంది. ఈ కారు పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది కావడం వల్ల ధర ఎక్కువగా ఉంది. భవిష్యత్తులో ఎస్ క్లాసు విడిభాగాలను లోకల్‌గా సమకూర్చుకుంటామని బెంజ్ వెల్లడించింది. దీనివల్ల కారు ధర తగ్గే అవకాశం ఉంది.