మంచి మార్కెట్ సాధించిన హ్యుండాయి | hyundai gain good market | Sakshi
Sakshi News home page

మంచి మార్కెట్ సాధించిన హ్యుండాయి

Published Wed, Jan 8 2014 8:49 PM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM

హ్యుండాయి  గ్రాండ్ ఐ10 మోడల్ కారు

హ్యుండాయి గ్రాండ్ ఐ10 మోడల్ కారు

హైదరాబాద్:  దక్షిణ కొరియాకు చెందిన హ్యుండాయి కంపెనీ మన దేశంలో మంచి మార్కెట్‌ను సాధించింది. మారుతి తర్వాత రెండో స్థానంలో కొనసాగుతూ కొన్ని సక్సెస్‌ఫుల్‌ మోడల్స్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ కంపెనీ తాజాగా తెచ్చిన గ్రాండ్ ఐ10 మోడల్‌ను కస్టమర్లు చక్కగా రిసీవ్‌ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రాండ్‌ సిరీస్‌లో సెడాన్‌ మోడల్‌ను తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ఏడాది గ్రాండ్‌ సెడాన్‌ను లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు. సెడాన్‌ మోడల్‌లో ఐ10 పేరును ఉపయోగించే అవకాశం లేదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు హ్యుండాయి మరో రెండు కొత్త కార్లను ఈ ఏడాది లాంచ్ చేయవచ్చని వార్తలు వస్తున్నాయి.

జపాన్‌కు చెందిన  హోండా కంపెనీ కొత్త సంవత్సరంపైన కోటి ఆశలు పెట్టుకుంది. కిందటి ఏడాది అమేజ్‌ మోడల్‌ అమ్మకాలు జోరు మీద ఉండటంతో ఈ కంపెనీలో ఉత్సాహం పరవళ్లు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో  మన దేశంలో మూడు కొత్త మోడళ్లను లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో న్యూ జాజ్‌ -ఫిట్‌ మోడల్‌ ఒకటి. గతంలో హోండా జాజ్‌ ఘోరంగా విఫలమైంది. దీనిలోని లోపాలను సరిచేసి కొత్త జాజ్‌ను హోండా రంగంలోకి దించుతోంది. జాజ్‌-ఫిట్‌ అని పేరుపెట్టింది.

హోండా కంపెనీకి సిటీ మోడల్‌ బాగా సక్సెస్‌ అయిన కార్లలో ఒకటి. దీనికి ఆధునిక సొబగులు అద్ది 2014లో తాజాగా విడుదల చేసే ప్రయత్నాల్లో హోండా కంపెనీ నిమగ్నమైంది. జనవరిలోనే సిటీ మోడల్‌ను మార్కోట్లోకి తెస్తామని కంపెనీ చెబుతోంది. దీని కోసం బుకింగ్స్‌ను కూడా ప్రారంభించినట్లు కంపెనీ వివరిస్తోంది. న్యూ సిటీ కారు ధర 8 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతోంది. ఇది ఇప్పటి వరకు మన దేశంలో ఏ కారు ఇవ్వనంత ఎక్కువగా, లీటర్‌ డీజిల్‌కు 26 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని హోండా చెబుతోంది. ఇంచుమించు సిటీ మోడల్‌లోనే ఉన్న అమేజ్‌ కారు కూడా మైలేజీ పరంగా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో కొత్త సిటీ కారుపై కస్టమర్లలో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

మెర్సిడెజ్‌  బెంజ్‌ తన ప్రధాన మోడల్‌ అయిన ఎస్ క్లాసులో 2014 మోడల్‌ను ఇండియాలో లాంచ్ చేసింది.  3 నెలల కిందటే అంతర్జాతీయ మార్కెట్లోకి వచ్చిన ఎస్ క్లాస్‌ ధర ఢిల్లీ షోరూములో కోటి 57 లక్షల రూపాయలుగా ఉంది. ఈ కారు పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది కావడం వల్ల ధర ఎక్కువగా ఉంది. భవిష్యత్తులో  ఎస్ క్లాసు విడిభాగాలను లోకల్‌గా సమకూర్చుకుంటామని బెంజ్‌ వెల్లడించింది. దీనివల్ల కారు ధర తగ్గే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement