Hyundai Grand I10
-
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10.. స్పోర్ట్స్ ఎడిషన్
న్యూఢిల్లీ: హ్యుందాయ్ కంపెనీ గ్రాండ్ ఐ10 మోడల్లో స్పోర్ట్స్ ఎడిషన్, గ్రాండ్ స్పోర్ట్స్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. గ్రాండ్ ఐ10ను మార్కెట్లోకి తెచ్చి ఏడాదైన సందర్భంగా ఈ స్పెషల్ ఎడిషన్‌ను అందిస్తున్నామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) రాకేష్ శ్రీవాత్సవ తెలిపారు. ఈ గ్రాండ్ స్పోర్ట్జ్ కారును రెండు వేరియంట్లు-యూ2 1.1 లీటర్ సీఆర్డీఐ డీజిల్ ఇంజిన్(ధర రూ.5.98 లక్షలు), 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్లలో(ధర రూ.5.11 లక్షలు, రెండూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ ధరలు) అందిస్తున్నామన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో గ్రాండ్ ఐ10ను మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటి వరకూ 1.1 లక్షల వినియోగదారులకు విక్రయించామని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక ఎడిషన్‌లో డైమండ్ కట్ అలాయ్ వీల్స్, బ్లూ టూత్ కనెక్టివిటి, స్టీరింగ్‌పై ఆడియో, బ్లూటూత్ కంట్రోల్స్, రియర్ స్పా యిలర్, బి-పిల్లర్ బ్లాకవుట్ వంటి ప్రత్యేకతలున్నాయన్నారు. డీజిల్ కారు 24 కి.మీ. మైలేజీని, పెట్రోల్ కారు 18.9 కి.మీ. మైలేజీని ఇస్తుందని తెలిపారు. -
మంచి మార్కెట్ సాధించిన హ్యుండాయి
హైదరాబాద్: దక్షిణ కొరియాకు చెందిన హ్యుండాయి కంపెనీ మన దేశంలో మంచి మార్కెట్‌ను సాధించింది. మారుతి తర్వాత రెండో స్థానంలో కొనసాగుతూ కొన్ని సక్సెస్ఫుల్ మోడల్స్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ కంపెనీ తాజాగా తెచ్చిన గ్రాండ్ ఐ10 మోడల్‌ను కస్టమర్లు చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రాండ్ సిరీస్‌లో సెడాన్ మోడల్‌ను తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ఏడాది గ్రాండ్ సెడాన్‌ను లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు. సెడాన్ మోడల్లో ఐ10 పేరును ఉపయోగించే అవకాశం లేదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు హ్యుండాయి మరో రెండు కొత్త కార్లను ఈ ఏడాది లాంచ్ చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. జపాన్‌కు చెందిన హోండా కంపెనీ కొత్త సంవత్సరంపైన కోటి ఆశలు పెట్టుకుంది. కిందటి ఏడాది అమేజ్ మోడల్ అమ్మకాలు జోరు మీద ఉండటంతో ఈ కంపెనీలో ఉత్సాహం పరవళ్లు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో మన దేశంలో మూడు కొత్త మోడళ్లను లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో న్యూ జాజ్ -ఫిట్ మోడల్ ఒకటి. గతంలో హోండా జాజ్ ఘోరంగా విఫలమైంది. దీనిలోని లోపాలను సరిచేసి కొత్త జాజ్‌ను హోండా రంగంలోకి దించుతోంది. జాజ్-ఫిట్ అని పేరుపెట్టింది. హోండా కంపెనీకి సిటీ మోడల్ బాగా సక్సెస్ అయిన కార్లలో ఒకటి. దీనికి ఆధునిక సొబగులు అద్ది 2014లో తాజాగా విడుదల చేసే ప్రయత్నాల్లో హోండా కంపెనీ నిమగ్నమైంది. జనవరిలోనే సిటీ మోడల్‌ను మార్కోట్లోకి తెస్తామని కంపెనీ చెబుతోంది. దీని కోసం బుకింగ్స్‌ను కూడా ప్రారంభించినట్లు కంపెనీ వివరిస్తోంది. న్యూ సిటీ కారు ధర 8 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతోంది. ఇది ఇప్పటి వరకు మన దేశంలో ఏ కారు ఇవ్వనంత ఎక్కువగా, లీటర్ డీజిల్‌కు 26 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని హోండా చెబుతోంది. ఇంచుమించు సిటీ మోడల్లోనే ఉన్న అమేజ్ కారు కూడా మైలేజీ పరంగా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో కొత్త సిటీ కారుపై కస్టమర్లలో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మెర్సిడెజ్ బెంజ్ తన ప్రధాన మోడల్ అయిన ఎస్ క్లాసులో 2014 మోడల్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. 3 నెలల కిందటే అంతర్జాతీయ మార్కెట్లోకి వచ్చిన ఎస్ క్లాస్ ధర ఢిల్లీ షోరూములో కోటి 57 లక్షల రూపాయలుగా ఉంది. ఈ కారు పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది కావడం వల్ల ధర ఎక్కువగా ఉంది. భవిష్యత్తులో ఎస్ క్లాసు విడిభాగాలను లోకల్‌గా సమకూర్చుకుంటామని బెంజ్ వెల్లడించింది. దీనివల్ల కారు ధర తగ్గే అవకాశం ఉంది. -
3 నెలల్లో 30 వేల హ్యుందాయ్ గ్రాండ్ విక్రయాలు
న్యూఢిల్లీ: హ్యుందాయ్ గ్రాండ్ కార్ల అమ్మకాలు జోరుగా ఉన్నాయని కంపెనీ గురువారం తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ కారును మార్కెట్లోకి తెచ్చామని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. విడుదల చేసిన మూడు నెలల్లోనే 33 వేల కార్లను విక్రయించామని తెలిపారు. కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. అంతేకాకుండా మెట్రో, టైర్ టూ నగరాల్లో యువ కొనుగోలుదారుల నుంచి అధిక ఎంక్వైరీలు వచ్చాయని వివరించారు. అధికంగా విక్రయమైన 5 కార్ బ్రాండ్లలో ఇదొకటిగా నిలిచిందని పేర్కొన్నారు. యూ2 సీఆర్డీఐ డీజిల్ ఇంజిన్‌తో లభిస్తున్న గ్రాండ్ కారు 24 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.