హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా కొత్త మైలురాయిని అధిగమించింది. దేశీయంగా మొత్తం 20 లక్షల కార్లను ఉత్పత్తి చేసినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. 20లక్షల మార్క్‌గా ప్రీమియం సెడాన్ హోండా సిటీ కారును విడుదల చేసింది.
ఇదీ చదవండి : మారుతి స్విఫ్ట్-2023 కమింగ్ సూన్: ఆకర్షణీయ, అప్‌డేటెడ్ ఫీచర్లతో
భారత్‌లో రాజస్తాన్‌లోని టపూకరా వద్ద సంస్థకు ప్లాంటు ఉంది. 1997 డిసెంబర్‌లో ఉత్పత్తి ప్రారంభం అయింది. దేశంలో ఇప్పటి వరకు హోండా రూ.10,000 కోట్లను వెచ్చించింది. సిటీ, అమేజ్ మోడళ్లను 15కుపైగా మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. ప్లాంటు సామర్థ్యం ఏటా 1,80,000 యూనిట్లుగా ఉంది. కాగా భారతదేశంలోని తన వినియోగదారుల కోసం ప్రీమియం, ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అందించడంపై దృష్టి సారించి కార్యకలాపాలను ప్రారంభించామనీ,"మేక్ ఇన్ ఇండియా" విజన్‌లో భాగంగా 2 మిలియన్ల మైలురాయిని దాటామని కంపెనీ ప్రకటించింది. భారత్‌లో 2 మిలియన్ల కార్ల ఉత్పత్తి అనే చారిత్రాత్మక మైలురాయి దాటడం అంటే గత 25గా 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి హోండా నిబద్ధతకు నిదర్శమ ని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ టకుయా సుమురా తెలిపారు.
ఇదీ చదవండి : పలు మోడళ్ల హోండా కార్లపై భారీ తగ్గింపు
Comments
Please login to add a commentAdd a comment