![Honda offering discoungs on cars up to Rs 63k check details - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/4/honda%20cars.jpg.webp?itok=t1q_M4CL)
న్యూఢిల్లీ: పలు మోడళ్ల హోండా కార్లపై భారీ తగ్గింపు లభిస్తోంది. హోండా సిటీ, జాజ్, WR-V లాంటి మోడల్స్ రూ. 63,000 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. నవంబరు నెలకు సంబంధించిన ఈ డీల్స్ కస్టమర్‌లు తమకు సమీపంలో ఉన్న డీలర్‌షిప్‌ను సంప్రదించడం ద్వారా మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దేశంలో ఐదు విభిన్న హోండా మోడల్‌లు అందుబాటులో ఉన్నాయి: అమేజ్, సిటీ (5వ తరం), సిటీ (4వ తరం), జాజ్ , WR-బలతో సహా ఐదు విభిన్న మోడళ్లను అందిస్తుంది.
హోండా డబ్యుఆర్-వీ
డబ్యుఆర్-వీ కి అతిపెద్ద తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 30,000 నగదు తగ్గింపు లేదా రూ. 36,144 విలువైన ఉచిత యాక్సెసరీలున్నాయి. అలాగే రూ. 7,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,000 లాయల్టీ బోనస్‌లు తదితరాలు ఉన్నాయి.
హోండా అమేజ్
సబ్-కాంపాక్ట్ సెడాన్ హోండా అమేజ్ కొనుగోలుపై కస్టమర్‌లు రూ. 10,000 నగదు, లేదా రూ. 11,896 విలువైన ఉచిత యాక్సెసరీలను పొంద వచ్చు, అదనంగా రూ. 5,000 లాయల్టీ ఇన్సెంటివ్, రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు లభ్యం.
హోండా జాజ్: త్వరలోనే ఉత్పత్తిని నిలిపివేయాలని భావిస్తున్న హోండా జాజ్‌పై 25 వేల తగ్గింపు లభ్యం.
హోండా సిటీ (5వ జనరేషన్ : హోండా సిటీ మాన్యువల్‌పై రూ. 59,292 మొత్తం తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 30వేల నగదు తగ్గింపు లేదా రూ. 32,292 విలువైన ఉచిత యాక్సెసరీలు, ఇంకా ఎక్స్‌ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్, కార్పొరేట్ తగ్గింపును కూడా అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment