కొత్త కారు కొనేవారికి హోండా శుభవార్త అందించింది. హోండా కంపెనీ మార్చి నెలలో కూడా తమ కార్లపై డిస్కౌంట్ అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్లు నెల చివరి వరకు అందుబాటులో ఉండనున్నాయి. హోండా అమేజ్, హోండా సిటీ 5వ జనరేషన్, హోండా సిటీ 4వ జనరేషన్, హోండా డబ్ల్యుఆర్-వీ, హోండా జాజ్ కార్లపై డిస్కౌంట్ అందిస్తుంది. కారు మోడల్ & వేరియంట్ బట్టి డిస్కౌంట్ ₹35,596 వరకు లభిస్తుంది.
- 5వ జనరేషన్ కాంపాక్ట్ సెడాన్ హోండా సిటీ మీద ₹35,596 అత్యధిక డిస్కౌంట్ అందిస్తుంది. ఇంతక ముందు హోండా ఇదే మోడల్ కారుపై దాదాపు ₹36,000 డిస్కౌంట్ ఇచ్చింది. హోండా సిటీ 5వ జనరేషన్ కారుపై డిస్కౌంట్ లో భాగంగా ₹10,000 వరకు నగదు డిస్కౌంట్, కారు ఎక్స్ఛేంజ్ కింద ₹5000, హోండా కస్టమర్ లాయల్టీ బోనస్ ₹5000, హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ ₹7000, అలాగే ₹8000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి.
- హోండా సిటీ 4వ జనరేషన్ కారు మీద కూడా ₹20000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. వీటిలో హోండా కస్టమర్ లాయల్టీ బోనస్ కింద ₹5000, హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ కింద ₹7000, కార్పొరేట్ డిస్కౌంట్ కింద ₹8000 ఉన్నాయి.
- హోండా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ జాజ్ మీద ₹33,158 రెండవ అత్యధిక డిస్కౌంట్ అందిస్తుంది. ఇందులో రూ.10,000 వరకు నగదు డిస్కౌంట్ లేదా ₹12,158 వరకు ఎఫ్ఓసీ యాక్ససరీస్, రూ.5,000 విలువైన కారు ఎక్స్ఛేంజ్'పై డిస్కౌంట్, ₹5,000 హోండా కస్టమర్ లాయల్టీ బోనస్, హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.7,000, కార్పొరేట్ డిస్కౌంట్ ₹4,000 వరకు ఉన్నాయి.
- హోండా సబ్ కాంపాక్ట్ ఎస్యువి డబ్ల్యుఆర్-వీ హోండా మోడల్స్ మీద దాదాపు ₹26,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ అన్ని హోండా డబ్ల్యుఆర్-వీ పెట్రోల్ వేరియంట్, గ్రేడ్'లపై చెల్లుబాటు అవుతుంది. దీనిలో ₹10,000 విలువైన కారు ఎక్స్ఛేంజ్, హోండా కస్టమర్ లాయల్టీ బోనస్ కింద ₹5,000, హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ కింద ₹7,000, కార్పొరేట్ డిస్కౌంట్ ₹4,000 వరకు ఉన్నాయి.
- హోండా అమేజ్ సబ్ కాంపాక్ట్ సెడాన్ అన్ని వేరియెంట్ల మీద ₹15,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్'లో హోండా కస్టమర్ లాయల్టీ బోనస్ కింద ₹5,000, హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ ₹6,000, కార్పొరేట్ డిస్కౌంట్ కింద ₹4,000 ఇస్తున్నట్లు తెలిపింది.
ఈ జపనీస్ కార్ల తయారీసంస్థ జనవరిలో తన అమ్మకాల్లో మూడు శాతం తగ్గినట్లు పేర్కొంది. గత జనవరి నెలలో 12,149 యూనిట్లు విక్రయించినట్లు సంస్థ తెలిపింది. ఏడాది క్రితం ఇదే నెలలో కంపెనీ మొత్తం 12,552 యూనిట్లను విక్రయించింది. 2021 జనవరిలో 11,319 యూనిట్ల దేశీయ అమ్మకాలతో పోలిస్తే జనవరిలో 10,427 యూనిట్లు అమ్మినట్లు పేర్కొంది.
(చదవండి: Joy E-Bike: 500 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.115 ఖర్చు..!)
Comments
Please login to add a commentAdd a comment