న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హోండా కార్స్ ఇండియా’ (హెచ్‌సీఐఎల్)కు చెందిన పాపులర్ మిడ్‌సైజ్డ్ సెడాన్ కారు ‘హోండా సిటీ’ విక్రయాలు భారత్‌లో 7 లక్షల యూనిట్ల మైలురాయిని అధిగమించాయి. హెచ్‌సీఐఎల్ 1998లో హోండా సిటీని భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.
ఈ మోడల్ అంతర్జాతీయ విక్రయాలను పరిశీలిస్తే.. వీటిల్లో భారత్ వాటా 25 శాతానికి పైగానే ఉంది. ‘హోండా సిటీ అనేది మాకు భారత్‌లో బెస్ట్ సెల్లింగ్ మోడల్. ఇండియాలో 7 లక్షల యూనిట్ల మార్క్‌ను అందుకున్న ఒకేఒక ప్రీమియం సెడాన్ ఇది’ అని హెచ్‌సీఐఎల్ ప్రెసిడెంట్, సీఈవో యుచిరో యూనో తెలిపారు. కాగా హోండా సిటీలో నాలుగు జనరేషన్లు ఉన్నాయి.
తొలి జనరేషన్ హోండా సిటీ విక్రయాలు (1998–2003) 59,378 యూనిట్లుగా, రెండో జనరేషన్ హోండా సిటీ విక్రయాలు (2003–2008) 1,77,742 యూనిట్లుగా ఉన్నాయి. ఇక ఈ మోడల్ విక్రయాలు 2008–2013 మధ్యకాలంలో 1,92,939 యూనిట్లుగా, 2014 నుంచి ఇప్పటిదాకా 2,69,941 యూనిట్లుగా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment