హోండా కార్లపై అదిరిపోయే ఫెస్టివల్ ఆఫర్‌.. భారీ డిస్కౌంట్‌ | Honda Cars India Announces Festive Season Offers | Sakshi
Sakshi News home page

కొత్తగా కారు కొనేవారికి హోండా అదిరిపోయే ఫెస్టివల్ ఆఫర్‌.. ఏకంగా...

Published Wed, Oct 6 2021 5:38 PM | Last Updated on Wed, Oct 6 2021 6:53 PM

Honda Cars India Announces Festive Season Offers  - Sakshi

మీరు కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక భారీ శుభవార్త. పండుగ సీజన్‌ నేపథ్యంలో హోండా కార్స్ ఇండియా పలు మోడల్ కార్లపై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. ప్రస్తుత ఐదవ తరం హోండా సిటీ కారుపై  ₹53,500 వరకు అత్యధిక డిస్కౌంట్ అందిస్తుంది. అలాగే, తన నాల్గవ తరం హోండా సిటీ కారుపై ₹22,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. పండుగ సీజన్‌ పురస్కరించుకొని ఈ ఆఫర్లు ప్రకటించుకొని ఆఫర్లు ప్రకటించినట్లు సంస్థ ప్రకటించింది. పలు మోడల్ శ్రేణి కార్లపై హోండా మోటార్స్ అందిస్తున్న డిస్కౌంట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఈ సందర్భంగా హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ & డైరెక్టర్ రాజేష్ గోయెల్ మాట్లాడుతూ.. "పండుగలు మా జీవితంలో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. ఈ పండుగ సీజన్ సమయాల్లో ఎక్కువ మందికి చేరుకోవడం కోసం కార్లపై అద్భుతమైన ఆఫర్లు, ప్రమోషన్లను అందించడం మాకు సంతోషంగా ఉంది" అని అన్నారు. పండుగ ఉత్సాహం మొత్తం ఆటో పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇస్తుందని మేము ఆశిస్తున్నాము అని అన్నారు. సెమీకండక్టర్ కొరత కారణంగా సంస్థ ఇప్పటికీ సరఫరా విషయంలో అడ్డంకులను ఎదుర్కొంటోంది. గత ఏడాది క్రితం విక్రయించిన 10,199 యూనిట్లతో పోలిస్తే సెప్టెంబర్ 2021లో 6,765 యూనిట్లను మాత్రమే విక్రయించింది.(చదవండి: టెస్లా కంటే తోపు...! ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 1120కిమీ ప్రయాణం..!)

Models   Offers
5వ తరం హోండా సిటీ   ₹53,500 వరకు
4వ తరం హోండా సిటీ   ₹22,000  వరకు
కొత్త హోండా అమేజ్   ₹18,000  వరకు
కొత్త హోండా డబ్ల్యుఆర్-వి   ₹40,100  వరకు
కొత్త హోండా జాజ్   ₹45,900 వరకు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement