Honda Motor
-
2022లో హోండా బ్యాటరీ షేరింగ్ సేవలు
భారతదేశంలో వచ్చే ఏడాది 2022 మొదటి అర్ధభాగంలో ఎలక్ట్రిక్ ఆటో కోసం బ్యాటరీ షేరింగ్ సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు హోండా మోటార్ తెలిపింది. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన హోండా మొబైల్ పవర్‌ప్యాక్ ఎక్స్ఛేంజర్(ఎంపీపీఈ) వ్యవస్థను వినియోగించనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం భారత్‌లో ప్రత్యేకంగా స్థానిక అనుబంధ సంస్థను కూడా ఏర్పాటు చేస్తామని హోండా తెలిపింది. హోండా మొబైల్ పవర్ ప్యాక్ ఎక్స్ఛేంజర్-ఈ నగరాల్లో బ్యాటరీ మార్పిడి స్టేషన్లను ఇన్ స్టాల్ చేసి బ్యాటరీ షేరింగ్ సర్వీస్ అందిస్తుంది. బ్యాటరీ షేరింగ్ సేవల కోసం హోండా ఎలక్ట్రిక్ ఆటో తయారీ కంపెనీలతో కలిసి పనిచేయనుంది. మొదట ఎంపిక చేసిన నగరాల్లో ఈ సేవలను ప్రారంభిస్తుంది. ఆ తర్వాత దశలవారీగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఒక్కో ఎంపీపీఈ 1.3 కేడబ్ల్యూహెచ్ వరకు విద్యుత్తును నిల్వ చేసుకోగలదు. ఈ బ్యాటరీలు లిథియం-అయాన్ తో తయారు చేయనున్నారు. సుమారు 50.26 వోల్టేజి గల 10.3 కిలోల బ్యాటరీని సుమారు ఐదు గంటల్లో చార్జ్ చేయవచ్చు. భారతదేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి సంస్థ ప్రయత్నిస్తుందని తెలిపింది. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల్లో సుమారు 20 శాతం వాటా దేశం కలిగి ఉన్నట్లు సంస్థ తెలిపింది. భారతదేశంలో 80 లక్షలకు పైగా ఆటో రిక్షాలు ఉన్నాయి. (చదవండి: ఆహా ఏమి అదృష్టం! ఏడాదిలో కోటీశ్వరులైపోయారు!) హోండా అధ్యయనం ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తులు మూడు సమస్యలను ఎదుర్కొంటున్నాయి: స్వల్ప శ్రేణి, ఎక్కువ ఛార్జింగ్ సమయం, బ్యాటరీల అధిక ఖర్చు. ఈ కొత్త ఎంపీపీఈ వ్యవస్థ ద్వారా ఈ మూడు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భావిస్తుంది. ఈ కేంద్రాల వద్ద భారీ ఎత్తున ఛార్జ్ చేసి పెట్టిన బ్యాటరీలను రిక్షాలు తీసుకొని వెళ్లొచ్చు. తమ వద్ద ఉన్న బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయిన వెంటనే దాన్ని ఎంపీపీ ఈ కేంద్రంలో ఇచ్చి అందుకు సమానమైన ఛార్జింగ్ చేసిన బ్యాటరీని పొందొచ్చు అని సంస్థ తెలిపింది. 2020 ఫిబ్రవరిలోనే ప్రయోగాత్మకంగా ఈ సేవల్ని ప్రారంభించినట్లు హోండా తెలిపింది. ఎంపీపీఈ వ్యవస్థ ద్వారా 30 ఆటోలు ఇప్పటికే 2,00,000 కిలోమీటర్లకు పైగా తిరిగినట్లు హోండా తెలిపింది. (చదవండి: రైతులకు శుభవార్త.. గ్యారంటీ లేకుండా రూ.3 లక్షల రుణం!) -
హోండా కార్లపై అదిరిపోయే ఫెస్టివల్ ఆఫర్.. భారీ డిస్కౌంట్
మీరు కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక భారీ శుభవార్త. పండుగ సీజన్ నేపథ్యంలో హోండా కార్స్ ఇండియా పలు మోడల్ కార్లపై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. ప్రస్తుత ఐదవ తరం హోండా సిటీ కారుపై ₹53,500 వరకు అత్యధిక డిస్కౌంట్ అందిస్తుంది. అలాగే, తన నాల్గవ తరం హోండా సిటీ కారుపై ₹22,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. పండుగ సీజన్ పురస్కరించుకొని ఈ ఆఫర్లు ప్రకటించుకొని ఆఫర్లు ప్రకటించినట్లు సంస్థ ప్రకటించింది. పలు మోడల్ శ్రేణి కార్లపై హోండా మోటార్స్ అందిస్తున్న డిస్కౌంట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ సందర్భంగా హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ & డైరెక్టర్ రాజేష్ గోయెల్ మాట్లాడుతూ.. "పండుగలు మా జీవితంలో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. ఈ పండుగ సీజన్ సమయాల్లో ఎక్కువ మందికి చేరుకోవడం కోసం కార్లపై అద్భుతమైన ఆఫర్లు, ప్రమోషన్లను అందించడం మాకు సంతోషంగా ఉంది" అని అన్నారు. పండుగ ఉత్సాహం మొత్తం ఆటో పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇస్తుందని మేము ఆశిస్తున్నాము అని అన్నారు. సెమీకండక్టర్ కొరత కారణంగా సంస్థ ఇప్పటికీ సరఫరా విషయంలో అడ్డంకులను ఎదుర్కొంటోంది. గత ఏడాది క్రితం విక్రయించిన 10,199 యూనిట్లతో పోలిస్తే సెప్టెంబర్ 2021లో 6,765 యూనిట్లను మాత్రమే విక్రయించింది.(చదవండి: టెస్లా కంటే తోపు...! ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1120కిమీ ప్రయాణం..!) Models Offers 5వ తరం హోండా సిటీ ₹53,500 వరకు 4వ తరం హోండా సిటీ ₹22,000 వరకు కొత్త హోండా అమేజ్ ₹18,000 వరకు కొత్త హోండా డబ్ల్యుఆర్-వి ₹40,100 వరకు కొత్త హోండా జాజ్ ₹45,900 వరకు -
హోండా యు-గో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంతో తెలుసా?
మన దేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగంలో రోజు రోజుకి పోటీ పెరిగి పోతుంది. కొద్ది రోజులు క్రితమే రెండు కంపెనీలు తమ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కూటర్లకి ప్రజల నుంచి అద్భుతమైన ఆదరణ కూడా లభించింది. దీంతో ఇతర కంపెనీలు కూడా తమ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొనిరావడానికి సిద్దం అవుతున్నాయి. తాజాగా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా మోటార్స్ త్వరలో మన దేశంలోకి తన ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకొనిరావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అతి కూడా అతి తక్కువ ధరకే అని సమాచారం.(చదవండి: అదిరిపోయే టెక్నాలజీని ఆవిష్కరించిన ఫేస్బుక్!) కొద్ది రోజుల క్రితమే హోండా చైనాలో సీఎన్ వై 7499(సుమారు రూ.86,000) ధరకు హోండా యు-గో స్కూటర్ ను లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇది 1.8 కెడబ్ల్యు గరిష్ట అవుట్ పుట్ గల 1.2కెడబ్ల్యు మోటార్ సహాయంతో పనిచేస్తుంది. యు-గో టాప్ స్పీడ్ గంటకు 53 కిలోమీటర్లు. ఈ స్కూటర్ ఒకసారి చార్జ్ చేస్తే 65 కి.మీ. వెళ్లనున్నట్లు కంపెనీ పేర్కొంది. మన దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ అకస్మాత్తుగా పెరగడంతో త్వరలో ఈ స్కూటర్ మన దేశ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే యు-గో ప్రారంభించడం గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. హోండా యు-గోను కనుక రూ.86,000 కంటే తక్కువ ధరకు తీసుకోని వస్తే మార్కెట్లో నిలబడే అవకాశం ఉంటుంది. -
మళ్లీ కార్ల ధరలు పెంచిన టాటా మోటార్స్!
దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వాహనాల ధరలను వేరియంట్, మోడల్ బట్టి సగటున 0.8 శాతం ఆగస్టు 3 నుంచి పెంచనున్నట్లు ప్రకటించింది. అంతేగాక, ఆటోమేకర్ 31 ఆగస్టు, 2021 వరకు అన్ని రిటైల్ ధరలపై రక్షణను కూడా అందిస్తోంది. "టాటా మోటార్స్ ఇటీవల తన వినియోగదారులు, డీలర్లు, సరఫరాదారుల ప్రయోజనాలను రక్షించడానికి సమగ్రమైన 'బిజినెస్ అజిలిటీ ప్లాన్'ను ఏర్పాటు చేసినట్లు" అని ఒక ప్రకటనలో తెలిపింది. పీటీఐ నివేదిక ప్రకారం, స్టీల్, ఇతర విలువైన లోహాల ధరలు భారీగా పెరగడంతో కార్ల తయారీ వ్యయాన్ని భర్తీ చేయాడానికి ఆటోమేకర్ లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ప్రయాణీకుల వాహన ధరలను పెంచినట్లు పేర్కొంది. ముంబైకి చెందిన ఆటో మేజర్ టియాగో, నెక్సన్, హారియర్, సఫారీ వంటి ప్రయాణీకుల వాహనాలను దేశీయ మార్కెట్లో విక్రయిస్తుంది. ఈ నెల ప్రారంభంలో, దేశంలోని అతిపెద్ద కార్ల తయారీసంస్థ మారుతి సుజుకి ఇండియా ఇన్ పుట్ ఖర్చుల భారాన్ని తగ్గించడానికి హ్యాచ్ బ్యాక్ స్విఫ్ట్, సీఎన్ జి వేరియెంట్ల ధరలను ₹15,000 వరకు పెంచింది. అదేవిధంగా, హోండా మోటార్స్ ఆగస్టు నుంచి భారతదేశంలో తన మొత్తం మోడల్ శ్రేణి ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే పెరిగిన కమోడిటీ ధరలను భర్తీ చేయాలని కార్ల తయారీ సంస్థలు చూస్తున్నాయి. -
హోండా కస్టమర్లకు అలర్ట్.. వెంటనే బైక్స్ షో రూమ్ కి తీసుకెళ్లండి
మీ దగ్గర కొత్త హోండా మోటార్ సైకిల్ వాహనం ఉందా? అయితే, వెంటనే షో రూమ్ తీసుకెళ్లండి. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) రిఫ్లెక్స్ రిఫ్లెక్టర్లలలో సమస్య కారణంగా మన దేశంలోని కొన్ని మోడళ్లను రీకాల్ చేస్తుంది. వెనక్కి పిలిపించిన వాటిలో హోండా యాక్టివా 5జీ, హోండా యాక్టివా 6జీ, హోండా యాక్టివా 125, సిబి షైన్, హార్నెట్ 2.0, ఎక్స్-బ్లేడ్, హెచ్ నెస్ సీబి 350, సీబి 300ఆర్ ఉన్నాయి. రీకాల్ చేయబడ్డ మొత్తం యూనిట్ సంఖ్య ఇంకా తెలియదు. రిఫ్లెక్స్ రిఫ్లెక్టర్ల సమస్య వల్ల రాత్రి సమయంలో వెనుక నుంచి వచ్చే వాహనాలకు ముందు వెళ్తున్న వాహనం సరిగా కనిపించక ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ. అందుకే ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా నవంబర్ 2019 నుంచి జనవరి 2021 మధ్య తయారు చేయబడ్డ మోడల్స్ కు వారెంటీ స్టేటస్ తో సంబంధం లేకుండా కొత్త రిఫ్లెక్స్ రిఫ్లెక్టర్ ని ఉచితంగా అధీకృత హెచ్ఎంఎస్ఐ డీలర్ లు మార్చానున్నట్లు తెలిపింది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి కంపెనీ జూన్ 1, 2021న రీకాల్ ప్రక్రియను ప్రారంభించింది. వాహనాన్ని తనిఖీ చేయడానికి అవసరమైతే రీప్లేస్ మెంట్ కోసం కాల్, ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ ద్వారా వినియోగదారులను చేరుకొనున్నట్లు హెచ్ఎంఎస్ఐ తెలిపింది. అదేవిధంగా, కస్టమర్ లు కంపెనీ వెబ్ సైట్ లో విఐఎన్ ని కూడా నమోదు చేయవచ్చు. హెచ్ ఎమ్ ఎస్ఐ డీలర్ షిప్ లు/విడిభాగాల డిస్ట్రిబ్యూటర్ ల వద్ద అనుమానిత స్పేర్ పార్టుల స్టాక్ కూడా రీకాల్ చేయనున్నారు. అమెరికాలోలో కూడా ఇలాంటి సమస్య కారణంగా హోండా మోటార్ కంపెనీ రీకాల్ చేసింది. యుఎస్ఎలో 28,528 మోటార్ సైకిళ్లలో లోపభూయిష్టమైన రియర్ రిఫ్లెక్టర్ ఫిట్ మెంట్ లను మార్చేసింది. చదవండి: BMW : మూడు సెకన్లలోనే అంత వేగమా -
హోండా కొత్త బైక్, బుకింగ్స్ షురూ
సాక్షి, ముంబై: జపాన్ ఆటో దిగ్గజం హోండా తన ప్రీమియం బైకుల విభాగంలో సీబీ350ఆర్ఎస్ మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.1.96 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.మంగళశారం లాంచ్ చేసిన ఈ బైక్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మార్చి మొదటి వారం నుంచి డెలివరీలు మొదలవుతాయి. గతేడాది అక్టోబర్‌లో ‘‘మేడ్ ఇన్ ఇండియా ఫర్ వరల్డ్’’ నినాదంతో విడుదలైన హన్నెస్ సీబీ 350 నుంచి వస్తున్న రెండో బైక్ ఇది. సుమారు 5500 ఆర్పీఎం వద్ద 1.5 కిలోవాట్ల సామర్థ్యాన్ని ఉత్పత్తి చేసే 350 సీసీ ఇంజిన్ ఇందులో అమర్చారు. స్లిప్, అసిస్ట్ క్లచ్ సదుపాయాలను కలిగిన ఐదు స్పీడ్ గేర్ బాక్స్ ఇందులో ఉంది. సెలక్టబుల్ టార్క్ కంట్రోల్, యాంటీ–లాక్ బ్రేకింగ్ వ్యవస్థలతో పాటు డిజిటల్ అనలాగ్ మీటర్లను కలిగి ఉంది. హోండా కంపెనీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ‘సీబీ’ బ్రాండ్ వారసత్వాన్ని ఈ కొత్త సీబీ350ఆర్ఎస్ నిలుపుతుందనే ఆశాభావాన్ని హోండా మోటార్స్, స్కూటర్ ఇండియా ఎండీ అత్సుషీ ఒగాటా వ్యక్తం చేశారు. -
హోండా ‘ఆక్టివా’ ఉత్పత్తి పెంపు
న్యూఢిల్లీ: రానున్న పండుగల సీజన్లో మరిన్ని ఆక్టివా స్కూటర్లను విక్రయించడంపై హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) దృష్టి సారించింది. 2001లో ఆక్టివా స్కూటర్‌ను మార్కెట్లోకి తెచ్చామని, మంచి అమ్మకాలు సాధిస్తోందని హెచ్ఎంఎస్ఐ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) యధ్‌విందర్ ఎస్. గులేరియా పేర్కొన్నారు. మార్కెట్లోకి వచ్చి 14 ఏళ్లు అయినప్పటికీ, ఇప్పటికీ ఈ స్కూటర్‌కు వెయిటింగ్ పీరియడ్ కొనసాగుతోందని, ఇది ఈ స్కూటర్‌కు వినియోగదారులు ఇస్తోన్న ప్రాధాన్యతను వెల్లడిస్తోందని వివరించారు. పండుగల సీజన్ కారణంగా పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి బెంగళూరులోని మూడోప్లాంట్లో ఉత్పత్తిని పెంచామని పేర్కొన్నారు. జూలై-సెప్టెంబర్ కాలానికి రోజువారీ ఉత్పత్తి 15-20 శాతం పెంచామని వివరంచారు. ఏప్రిల్-జూలై కాలానికి ఎంక్వైరీలు 30 శాతం పెరగాయని, అమ్మకాలు 33 శాతం వృద్ధి చెందాయని పేర్కొన్నారు. వివిధ మోడళ్లకు సంబంధించి పెండింగ్ ఆర్డర్లు ఇప్పటివరకూ 60,000 ఉన్నాయని, వీటిల్లో 70 శాతం ఆక్టివా స్కూటర్వేనని వివరించారు. కాగా గత నెలలో హీరో మోటోకార్ప్ బైక్, స్ప్లెండర్ బైక్‌ల విక్రయాల(1,65,779)ను ఈ ఆక్టివా స్కూటర్ విక్రయాలు (1,91,883)అధిగమించాయి. ఆక్టివా స్కూటర్ నంబర్‌వన్ టూవీలర్గా నిలిచిందని గులేరియా పేర్కొన్నారు. గత 11 నెలల కాలంలో స్ప్లెండర్ అమ్మకాలను ఆక్టివా అమ్మకాలు మూడు సార్లు అధిగమించాయని వివరించారు. -
టోక్యో ఆటోషో సందడి...
టోక్యో ఆటో షో ప్రివ్యూలో సందడి చేస్తున్న కొత్త కార్లు, బైక్‌లు ఇవి. డిసెంబర్ 1 దాకా జరిగే ఈ షోలో 23 నుంచి సందర్శకులను అనుమతిస్తారు. టయోటా ఐ రోడ్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారు ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్-1 కారు హోండా హోల్డ్ వింగ్ ఎఫ్6సి బైక్‌పై టయోటా మోటార్స్ ప్రెసిడెంట్ అకియో టయోడా, పక్కన హోండా ప్రెసిటెండ్ తకనొబు మీడియా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రివ్యూలో వివిధ వాహనాలు