భారతదేశంలో వచ్చే ఏడాది 2022 మొదటి అర్ధభాగంలో ఎలక్ట్రిక్ ఆటో కోసం బ్యాటరీ షేరింగ్ సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు హోండా మోటార్ తెలిపింది. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన హోండా మొబైల్ పవర్‌ప్యాక్ ఎక్స్‌ఛేంజర్(ఎంపీపీఈ) వ్యవస్థను వినియోగించనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం భారత్‌లో ప్రత్యేకంగా స్థానిక అనుబంధ సంస్థను కూడా ఏర్పాటు చేస్తామని హోండా తెలిపింది. హోండా మొబైల్ పవర్ ప్యాక్ ఎక్స్ఛేంజర్-ఈ నగరాల్లో బ్యాటరీ మార్పిడి స్టేషన్లను ఇన్ స్టాల్ చేసి బ్యాటరీ షేరింగ్ సర్వీస్ అందిస్తుంది.
బ్యాటరీ షేరింగ్ సేవల కోసం హోండా ఎలక్ట్రిక్ ఆటో తయారీ కంపెనీలతో కలిసి పనిచేయనుంది. మొదట ఎంపిక చేసిన నగరాల్లో ఈ సేవలను ప్రారంభిస్తుంది. ఆ తర్వాత దశలవారీగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఒక్కో ఎంపీపీఈ 1.3 కేడబ్ల్యూహెచ్ వరకు విద్యుత్తును నిల్వ చేసుకోగలదు. ఈ బ్యాటరీలు లిథియం-అయాన్ తో తయారు చేయనున్నారు. సుమారు 50.26 వోల్టేజి గల 10.3 కిలోల బ్యాటరీని సుమారు ఐదు గంటల్లో చార్జ్ చేయవచ్చు. భారతదేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి సంస్థ ప్రయత్నిస్తుందని తెలిపింది. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల్లో సుమారు 20 శాతం వాటా దేశం కలిగి ఉన్నట్లు సంస్థ తెలిపింది. భారతదేశంలో 80 లక్షలకు పైగా ఆటో రిక్షాలు ఉన్నాయి.
(చదవండి: ఆహా ఏమి అదృష్టం! ఏడాదిలో కోటీశ్వరులైపోయారు!)
హోండా అధ్యయనం ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తులు మూడు సమస్యలను ఎదుర్కొంటున్నాయి: స్వల్ప శ్రేణి, ఎక్కువ ఛార్జింగ్ సమయం, బ్యాటరీల అధిక ఖర్చు. ఈ కొత్త ఎంపీపీఈ వ్యవస్థ ద్వారా ఈ మూడు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భావిస్తుంది. ఈ కేంద్రాల వద్ద భారీ ఎత్తున ఛార్జ్ చేసి పెట్టిన బ్యాటరీలను రిక్షాలు తీసుకొని వెళ్లొచ్చు. తమ వద్ద ఉన్న బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయిన వెంటనే దాన్ని ఎంపీపీ ఈ కేంద్రంలో ఇచ్చి అందుకు సమానమైన ఛార్జింగ్ చేసిన బ్యాటరీని పొందొచ్చు అని సంస్థ తెలిపింది. 2020 ఫిబ్రవరిలోనే ప్రయోగాత్మకంగా ఈ సేవల్ని ప్రారంభించినట్లు హోండా తెలిపింది. ఎంపీపీఈ వ్యవస్థ ద్వారా 30 ఆటోలు ఇప్పటికే 2,00,000 కిలోమీటర్లకు పైగా తిరిగినట్లు హోండా తెలిపింది.
(చదవండి: రైతులకు శుభవార్త.. గ్యారంటీ లేకుండా రూ.3 లక్షల రుణం!)
Comments
Please login to add a commentAdd a comment