Battery technology
-
టాటా గ్రూప్ బ్యాటరీ బ్లూప్రింట్
న్యూఢిల్లీ: బ్యాటరీ తయారీ కంపెనీ ఏర్పాటుపై బ్లూప్రింట్‌ను సిద్ధం చేస్తున్నట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా గ్రూప్ తాజాగా వెల్లడించింది. దేశ, విదేశాలలో భవిష్యత్ సాంకేతికతలకు అనుగుణంగా మారే(ఫ్యూచర్ రెడీ) వ్యూహాలకు తెరతీయనున్నట్లు టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు. సీఐఐ బిజినస్ సదస్సు 2022లో ప్రసంగిస్తూ చంద్రశేఖరన్ ఇంకా పలు విషయాలు పేర్కొన్నారు. టాటా గ్రూప్ భారీ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో ఉన్నట్లు తెలియజేశారు. గ్రూప్ స్థాయిలో కార్బన్ న్యూట్రల్‌గా ఆవిర్భవించే లక్ష్యాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు వెల్లడించారు. తమకు కీలకమైన బిజినెస్‌లను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేసే బాటలో డిజిటల్, డేటా, ఏఐ తదితర సాంకేతికతలను సమీకృతం చేయనున్నట్లు వివరించారు. చదవండి: సెంచరీ దాటింది, సరికొత్త మైలురాయి చేరుకున్న ఈవిట్రిక్! -
ముఖేష్ అంబానీ దూకుడు..! మరో వీదేశీ కంపెనీ రిలయన్స్ చేతిలోకి..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.కోబాల్ట్-రహిత లిథియం బ్యాటరీ టెక్నాలజీ కంపెనీ లిథియం వర్క్స్ బీవీ ఆస్తులను పూర్తిగా హస్తగతం చేసుకొనుంది. ఈ డీల్ విలువ సుమారు 61 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 465 కోట్లు). రిలయన్స్ న్యూ ఎనర్జీ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా చైనాలోని తయారీ కేంద్రం, కంపెనీకి సంబంధించిన పేటెంట్ పోర్ట్‌ఫోలియో, కీలక వ్యాపార ఒప్పందాలు రిలయన్స్ చేతిలోకి రానున్నాయి. కొద్ది రోజుల క్రితమే సోడియం-అయాన్ సెల్ కెమిస్ట్రీలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న ఫారాడియన్ లిమిటెడ్‌ను రిలయన్స్ కొనుగోలుచేసింది.లిథియం వర్క్స్ కలయికతో గ్రీన్ ఎనర్జీ రంగంలో రిలయన్స్ ప్రణాళికలు మరింత బలపేతం కానున్నట్లు కంపెనీ అభిప్రాయపడింది. సెల్ కెమిస్ట్రీ, కస్టమ్ మాడ్యూల్స్, ప్యాకింగ్,పెద్ద ఎత్తున బ్యాటరీ తయారీ సౌకర్యాన్ని నిర్మించడంలో ఈ డీల్ ఉపయోగపడుతోందని రిలయన్స్ ఆశాభావం వ్యక్తపరిచింది. లిథియం వర్క్స్ బీవీ సంస్థను 2017లో స్థాపించారు. ఈ కంపెనీ బ్యాటరీల తయారీలో ప్రసిద్ధి చెందింది. అమెరికా, యూరప్,చైనాలో కార్యకలాపాలు అందిస్తోంది. ఈ కంపెనీ తయారుచేసే బ్యాటరీలు పారిశ్రామికంగా, వైద్య, సముద్ర, వాణిజ్య రవాణా ఇతర అత్యంత డిమాండ్ కల్గిన రంగాల్లో వాడుతున్నారు. కంపెనీకి చెందని నానోఫాస్ఫేట్ బ్యాటరీలు అత్యంత శక్తివంతమైనవే కాకుండా, గరిష్ట జీవిత కాలాన్ని అందిస్తాయి. చదవండి: హెచ్డీఎఫ్సీ బ్యాంకు కీలక నిర్ణయం..! ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు భిన్నంగా..! -
2022లో హోండా బ్యాటరీ షేరింగ్ సేవలు
భారతదేశంలో వచ్చే ఏడాది 2022 మొదటి అర్ధభాగంలో ఎలక్ట్రిక్ ఆటో కోసం బ్యాటరీ షేరింగ్ సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు హోండా మోటార్ తెలిపింది. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన హోండా మొబైల్ పవర్‌ప్యాక్ ఎక్స్ఛేంజర్(ఎంపీపీఈ) వ్యవస్థను వినియోగించనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం భారత్‌లో ప్రత్యేకంగా స్థానిక అనుబంధ సంస్థను కూడా ఏర్పాటు చేస్తామని హోండా తెలిపింది. హోండా మొబైల్ పవర్ ప్యాక్ ఎక్స్ఛేంజర్-ఈ నగరాల్లో బ్యాటరీ మార్పిడి స్టేషన్లను ఇన్ స్టాల్ చేసి బ్యాటరీ షేరింగ్ సర్వీస్ అందిస్తుంది. బ్యాటరీ షేరింగ్ సేవల కోసం హోండా ఎలక్ట్రిక్ ఆటో తయారీ కంపెనీలతో కలిసి పనిచేయనుంది. మొదట ఎంపిక చేసిన నగరాల్లో ఈ సేవలను ప్రారంభిస్తుంది. ఆ తర్వాత దశలవారీగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఒక్కో ఎంపీపీఈ 1.3 కేడబ్ల్యూహెచ్ వరకు విద్యుత్తును నిల్వ చేసుకోగలదు. ఈ బ్యాటరీలు లిథియం-అయాన్ తో తయారు చేయనున్నారు. సుమారు 50.26 వోల్టేజి గల 10.3 కిలోల బ్యాటరీని సుమారు ఐదు గంటల్లో చార్జ్ చేయవచ్చు. భారతదేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి సంస్థ ప్రయత్నిస్తుందని తెలిపింది. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల్లో సుమారు 20 శాతం వాటా దేశం కలిగి ఉన్నట్లు సంస్థ తెలిపింది. భారతదేశంలో 80 లక్షలకు పైగా ఆటో రిక్షాలు ఉన్నాయి. (చదవండి: ఆహా ఏమి అదృష్టం! ఏడాదిలో కోటీశ్వరులైపోయారు!) హోండా అధ్యయనం ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తులు మూడు సమస్యలను ఎదుర్కొంటున్నాయి: స్వల్ప శ్రేణి, ఎక్కువ ఛార్జింగ్ సమయం, బ్యాటరీల అధిక ఖర్చు. ఈ కొత్త ఎంపీపీఈ వ్యవస్థ ద్వారా ఈ మూడు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భావిస్తుంది. ఈ కేంద్రాల వద్ద భారీ ఎత్తున ఛార్జ్ చేసి పెట్టిన బ్యాటరీలను రిక్షాలు తీసుకొని వెళ్లొచ్చు. తమ వద్ద ఉన్న బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయిన వెంటనే దాన్ని ఎంపీపీ ఈ కేంద్రంలో ఇచ్చి అందుకు సమానమైన ఛార్జింగ్ చేసిన బ్యాటరీని పొందొచ్చు అని సంస్థ తెలిపింది. 2020 ఫిబ్రవరిలోనే ప్రయోగాత్మకంగా ఈ సేవల్ని ప్రారంభించినట్లు హోండా తెలిపింది. ఎంపీపీఈ వ్యవస్థ ద్వారా 30 ఆటోలు ఇప్పటికే 2,00,000 కిలోమీటర్లకు పైగా తిరిగినట్లు హోండా తెలిపింది. (చదవండి: రైతులకు శుభవార్త.. గ్యారంటీ లేకుండా రూ.3 లక్షల రుణం!) -
త్వరలో అడ్వాన్స్డ్ బ్యాటరీ టెక్నాలజీ విధానం
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాలు, ఇతరత్రా అవసరాలకు ఉపయోగపడే అత్యాధునిక బ్యాటరీ సాంకేతికతలో స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం త్వరలో ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టనుందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహన రంగం వృద్ధికి దోహదపడే చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే సెల్స్‌ను దేశీయంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర విధానం అవసరమని మంత్రి చెప్పారు. ఆటోమొబైల్ తయారీతో పాటు విద్యుత్ వాహనాల విషయంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారత్ ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాల పరిశోధన, అభివృద్ధి అంశంపై జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గడ్కరీ ఈ విషయాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు కే విజయ రాఘవన్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఇంధనానికి సంబంధించిన పరిశోధనలు ఎవరికి వారు విడివిడిగా చేస్తున్నారు. వీటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి అంతా కలిసికట్టుగా పనిచేస్తే అత్యుత్తమ టెక్నాలజీలను అభివృద్ధి చేయొచ్చు. దీనిపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నాం. ఆయా టెక్నాలజీల లాభదాయకతపై కూడా దృష్టి పెడతాం. ఇందుకోసం ప్రత్యేక విధానం అవసరం‘ అని మంత్రి చెప్పారు. -
యాపిల్ నుంచి సెల్ఫ్‌డ్రైవింగ్ కారు!
న్యూఢిల్లీ, సాక్షి: ఎలక్ట్రిక్ వాహన తయారీ కోసం ఆరేళ్ల క్రితం యాపిల్ ఇంక్ ప్రారంభించిన ప్రాజెక్ట్ టైటన్.. ఇకపై మరింత స్పీడందుకోనున్నట్లు తెలుస్తోంది. వెరసి ఐఫోన్ల దిగ్గజం ఆటోమోటివ్ మార్కెట్లోనూ ప్రవేశించేందుకు దారి ఏర్పాటు చేసుకుంటోంది. ఇందుకు వీలుగా ఇటీవల బ్యాటరీ తయారీలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. నిజానికి పూర్తిస్థాయి అటానమస్ కారును రూపొందించేందుకు ప్రారంభించిన ప్రాజెక్ట్ టైటన్‌ను ప్రస్తుతం సెల్ఫ్ డ్రైవింగ్ కారు తయారీకి మార్పు చేసినట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. దీంతో 2024కల్లా ఆధునిక ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో ప్రవేశపెట్టే ప్రణాళికల్లో యాపిల్ ఉన్నట్లు తెలియజేశాయి. ఇందుకు ప్రధానంగా అటానమస్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీతో సొంత కార్లను తయారు చేస్తుందా లేక ఇతర వాహనాలకు సాఫ్ట్‌వేర్‌ను అందిస్తున్నదా అన్న విషయంలో స్పష్టత లేదని విశ్లేషకులు తెలియజేశారు. (హెల్మెట్ వాయిస్ కమాండ్స్‌తో ఇక బైకులు!) సొంత బ్యాటరీలతో ఎలక్ట్రిక్ వాహన తయారీలో బ్యాటరీలకు ప్రాధాన్యత ఎక్కువన్న సంగతి తెలిసిందే. కారు ఖరీదులో బ్యాటరీలు అగ్రభాగం వహిస్తుంటాయని ఆటో రంగ నిపుణులు చెబుతున్నారు. కాగా.. అత్యంత సమర్దవంతంగా పనిచేయగల బ్యాటరీ టెక్నాలజీకి యాపిల్ తాజాగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్లు, ఐప్యాడ్స్, మ్యాక్ కంప్యూటర్ల తయారీ దిగ్గజం యాపిల్ ఇంక్ 2014లోనే టైటన్ పేరుతో ఎలక్ట్రిక్ కార్ల తయారీకి ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు కోసం తీసుకున్న 1,000 మందిలో 200 మందిని 2016లో తొలగించింది. దీంతోపాటు ప్యాసింజర్ కారును రూపొందించాలన్న లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా బ్యాటరీ తయారలో ప్రత్యేక తరహా మోనోసెల్ డిజైన్‌ను అభివృద్ధి చేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. బ్యాటరీలో భారీగా ఇండివిడ్యుయల్ సెల్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా లోపల మరింత ఖాళీకి వీలు ఏర్పడుతుందని వివరించాయి. దీంతో యాక్టివ్ మెటీరియల్‌కు చోటులభించడం ద్వారా అధిక కాలం శక్తినిచ్చే వీలున్నట్లు తెలియజేశాయి. ఈ టెక్నాలజీతో బ్యాటరీల వ్యయాలు సైతం తగ్గే వీలున్నట్లు భావిస్తున్నాయి. (ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 బుకింగ్ షురూ) సెన్సర్ల సాయం యాపిల్ రూపొందిస్తున్న ఎలక్ట్రిక్ కారులో లిడార్ టెక్నాలజీని వినియోగించనుంది. లిడార్ సెన్సర్లను వినియోగించడం ద్వారా కారు డ్రైవింగ్‌కు 3డీ వ్యూను కల్పించాలని యాపిల్ ఆశిస్తోంది. తద్వారా రోడ్లు, ప్రజలు, దూరం, వాహనాలపై అంచనాలకు వీలుంటుందని ఆటో వర్గాలు వెల్లడించాయి. 2017లో యాపిల్ సీఈవో టిమ్ కుక్ అటానమస్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్రాజెక్టులన్నిటికీ శిఖరాగ్రంగా నిలవనున్నట్లు వ్యాఖ్యానించారు కూడా. -
అవాన్ మోటార్స్ నుంచి ఎలక్ర్టిక్ వాహనాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఎలక్ర్టిక్ వాహనాల తయారీలో ముందున్న అవాన్ మోటార్స్ ఈ రంగంలో మరిన్ని నూతన వాహనాలు ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో జెరో ప్లస్‌ను ప్రారంభించిన కంపెనీ ఈ వాహనానికి వచ్చిన స్పందనతో మరిన్ని ఈ తరహా ఎలక్ర్టిక్ స్కూటర్లు, వాహనాలను ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. జెరో ప్లస్ స్కూటర్లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించిందని, ఒక బ్యాటరీతో 60 కిమీ భారీ మైలేజ్‌ను ఇవ్వడంతో పాటు రూ 47,000కే అందుబాటులో ఉండటం దీని ప్రత్యేకతలని అవాన్ మోటార్స్ తెలిపింది. ఈ వాహనం విజయవంతం కావడంతో మరిన్ని ఎలక్ర్టిక్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నామని కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ పంకజ్ తివారీ వెల్లడించారు. -
చౌకగా ఉపగ్రహ ప్రయోగాలు
- సరికొత్తగా ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నాం: ఇస్రో చైర్మన్ కిరణ్ - జీశాట్–9లో ఒకట్రెండు రోజుల్లో ఈ పరీక్ష - తక్కువ ఖర్చుతో బ్యాటరీ టెక్నాలజీ అభివృద్ధి సాక్షి, హైదరాబాద్: మరింత చౌకగా ఉపగ్రహ ప్రయోగాలు నిర్వహించే దిశగా భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలకమైన ముందడుగు వేసిందని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ చెప్పారు. సార్క్ దేశాల కోసం ఇటీవల ప్రయోగించిన జీశాట్–9 ఉపగ్రహంలో ప్రయోగాత్మకంగా ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థలను ఏర్పాటు చేశామని, వాటిని ఒకట్రెండు రోజుల్లో పరీక్షించనున్నట్లు వెల్లడించారు. పోఖ్రాన్ అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన మే 11వ తేదీని జాతీయ టెక్నాలజీ దినంగా ఆచరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త, పద్మభూషణ్ ఏవీ రామారావు పేరిట ఉపన్యాసాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కిరణ్‌కుమార్ పాల్గొని మాట్లాడారు. ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థల వల్ల ఉపగ్రహాల్లో నింపే రసాయన ఇంధనం మూడొంతుల వరకూ తగ్గుతుందని.. ఫలితంగా ఇంధన ఖర్చు తగ్గడంతో పాటు అధిక బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించడం సులువవుతుందని చెప్పారు. విద్యుత్ వాహనాలకు కొత్త టెక్నాలజీ 2030 నాటికి దేశంలో అత్యధిక సంఖ్యలో విద్యుత్ వాహనాలను వినియోగించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు ఇస్రో సరికొత్త లిథియం–అయాన్ బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేసిందని కిరణ్‌కుమార్ తెలిపారు. విదేశాలతో పోలిస్తే ఐదోవంతు ఖర్చుతోనే ఈ బ్యాటరీలను రూపొందించామని, భారీ ఎత్తున తయారు చేస్తే వాహనాల వినియోగానికి కూడా చవకగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. తాము అభివృద్ధి చేసిన టెక్నాలజీని పారిశ్రామిక వర్గాలకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సామాజిక అవసరాల కోసం అంతరిక్ష ప్రయోగాలు చేయడంలో మన దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. చేపలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను మత్స్యకారులకు సూచించడం ద్వారా దేశంలో ఏటా దాదాపు రూ.15 వేల కోట్ల మేర ఇంధనం ఆదా అవుతోందని తెలిపారు. కార్యక్రమంలో ఐఐసీటీ డైరెక్టర్ శ్రీవారి చంద్రశేఖర్, ఆవ్రా ల్యాబ్స్ అధినేత, ఐఐసీటీ మాజీ డైరెక్టర్ ఏవీ రామారావు తదితరులు పాల్గొన్నారు. జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగానికి వేగంగా ఏర్పాట్లు నాలుగు టన్నుల బరువున్న ఉపగ్రహాలను కూడా మోసుకెళ్లగల జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయని కిరణ్‌కుమార్ తెలిపారు. జూన్ తొలివారంలో దీనిని ప్రయోగించనున్నామని, వ్యవస్థలన్నింటినీ ఏకీకరించే పని జరుగుతోందని చెప్పారు. ఇస్రో వేర్వేరు ఉపగ్రహాల ద్వారా సేకరించిన సమాచారాన్ని, ఛాయాచిత్రాలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు త్వరలోనే ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల ప్రాంతంలో ఏర్పాటయ్యే ఈ కేంద్రం స్టార్టప్‌లనూ ప్రోత్సహిస్తుందని.. వ్యవసాయంతోపాటు నగరాలకు సంబంధించిన సమస్యలకు జియోస్పేషియల్, రిమోట్ సెన్సింగ్ సమాచారం ఆధారంగా పరిష్కారాలను కనుక్కునే ప్రయత్నాలకు ఊతమిస్తుందని చెప్పారు. -
విసుగులోంచి ఉరిమిందొక మెరుపు!
ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొన్ని ‘యురేకా...’ క్షణాలు ఉంటాయి. ఆర్కెమెడిస్లా ‘కేక’ పెట్టించే ఐడియాలు వస్తుంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు అవి పరిష్కారం అవుతుంటాయి. ఆ ఐడియాలు జీవితాలనే మార్చేస్తూ ఉంటాయి. మెరెడిత్ పెర్రీకి కూడా ఒకసారి అలాంటి ఐడియానే వచ్చింది. ఒక సమస్యకు పరిష్కారం గురించి ఆలోచిస్తున్న సమయంలో ఆమెకీ అద్భుతమైన ఐడియా తట్టింది. అది అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం. మెరిడిత్ అక్కడ ఆస్ట్రోబయాలజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. వర్సిటీలో ‘ఇన్నోవేటివ్ ఐడియాస్ కాంపిటీషన్’ జరుగుతోంది. ప్రత్యేకంగా ఫైనలియర్ విద్యార్థులు ఏదైనా నవ్యతతో కూడిన ఐడియాను వివరించి చెబితే... వాళ్ల చదువుకు సార్థకత చేకూరిన ట్టే. మెరిడిత్ కూడా ఆ కాంపిటీషన్లో పాల్గొనాల్సి ఉంది. ఏదైనా మంచి ఐడియా వస్తే బావుణ్ణు అనుకొంటూ గూగుల్‌లో గాలించింది. చాలాసేపు ప్రయత్నించినా ఏమీ దొరక్కపోవడంతో ల్యాప్‌టాప్ మూసి బ్యాగ్‌లో సర్దుతుండగా, పొడవైన వైర్‌తో ఉన్న ల్యాప్చార్జర్ బ్యాగ్‌లో సెట్ కాలేదు. అప్పుడు పుట్టిన విసుగులోంచి ఆమె బుర్రలో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. ఒక్కసారి ‘యురేకా..’ అనుకొంది పెర్రీ. బ్యాగ్‌లో సెట్ కాని చార్జర్ తనను ఎంతగా విసిగిస్తోందో ఆమెకు తెలుసు. ఆమెకే కాదు... ల్యాప్‌టాప్‌ను బ్యాగ్‌లో పెట్టుకు తిరిగే ప్రతి ఒక్కరికీ చార్జర్‌ను క్యారీ చేయడం పెద్ద రిస్కే! అయినా మనం వైర్లెస్ కమ్యూనికేషన్ యుగంలో ఉన్నాం. ఇంటర్నెట్టే వైర్‌లెస్‌గా వస్తోంది. అలాంటిది చార్జింగ్ కోసం అంత పెద్ద వైర్ ఎందుకు? అలా చార్జర్‌ను అతి కష్టం మీద క్యారీ చేయడం ఎందుకు? అనే సంఘర్షణ నుంచి ‘వైర్లెస్’ చార్జింగ్ ఐడియా వచ్చింది. దాని గురించి మళ్లీ గూగుల్లోనే గాలిస్తే.. అదొక ఇన్నోవేటివ్ ఐడియా అని అర్థమైంది. ఐడియా ఈజీనే, కసర త్తులో కష్టం! తమ అవసరం, ఊహాశక్తిని బట్టి...‘అలాంటి టెక్నాలజీ అందుబాటులోకి వస్తే బావుండు...’ అని చాలా మంది అనుకొంటుంటారు. అలాంటి వారి దగ్గర ఎన్నో ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటాయి. అయితే అవి సాధ్యం అవుతాయో కాదో... వారికి తెలీదు. మొదట్లో పెర్రీ పరిస్థితి కూడా ఇంతే. చార్జర్లకు పొడవాటి వైర్లు అవసరం లేకుండా... పవర్ జనరేటర్ నుంచి డెరైక్ట్‌గా విద్యుత్ తరంగాల రూపంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల బ్యాటరీని నింపితే బావుంటుందనేది పెర్రీకి వచ్చిన ఆలోచన. అయితే అది ఎంత వరకూ సాధ్యపడుతుందో ఆమెకు మొదట అర్థం కాలేదు. ఇన్నొవేటివ్ ఐడియాగా ఈ కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడు తక్కిన స్టూడెంట్స్ దగ్గర నుంచి మిశ్రమ స్థాయి స్పందన వచ్చింది. కొంతమంది మాత్రం వైర్ సాయం లేకుండా గాలిలో విద్యుత్ తరంగాలను ఎలా పంపిస్తారు మేడమ్... అన్నారు. దీంతో ఈ ఐడియాపై మరింత కసరత్తు చేసింది పెర్రీ. సౌండ్, ఎలక్ట్రిసిటీ, బ్యాటరీ టెక్నాలజీల గురించి అధ్యయనం చేసింది, పిజోఎలక్ట్ట్రిసిటీ గురించి అర్థం చేసుకొంది. కొన్ని మీటర్ల అవధిలో ఉన్న ఎలక్ట్రానిక్ డివైజ్‌ల బ్యాటరీలను చార్జ్ చేయడానికి ఒక ఫార్ములాను రూపొందించింది. దీన్ని ప్రయోగాత్మకంగా అమల్లో పెట్టడానికి పెర్రీ చాలా ప్రయత్నాలను చేసింది. ఈ ఫార్ములాను వివరిస్తే ఇదొక క్రేజీ ప్రాజెక్ట్ అని కొంతమంది కొట్టిపడేశారు. అయితే కొంతమంది దాతల సహకారంతో పెర్రీ ‘యూ బీమ్’ స్టార్టప్‌ను మొదలుపెట్టగలిగింది. ఆల్ట్రాసౌండ్ ట్రాన్స్మిటర్స్ ద్వారా గ్యాడ్జెట్‌లోని బ్యాటరీలను చార్జింగ్ చేయగలిగే పద్ధతి గురించి పరిశోధన చేస్తోంది. పెర్రీ ప్రాజెక్ట్ ఫలప్రదం అయ్యే అవకాశాలున్నాయని అనేకమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ 22 యేళ్ల ఇంజినీర్ సంచలనంగా మారింది. వివిధ పరిశోధన సంస్థలు ఈమెపై దృష్టిసారించాయి. ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక కూడా పెర్రీ ఇన్నోవేటివ్ ఐడియాను గుర్తించి ‘30 అండర్ 30’ జాబితాలోకి ఎంపిక చేసింది. 30 సంవత్సరాల్లోపు అద్బుతాలు సాధించిన ప్రస్తుతతరం యువతీయువకుల జాబితానే ‘30 అండర్ 30’. ప్రస్తుతం ఈ జాబితాలో ఉన్న పెర్రీ తన స్టార్టప్‌ను సక్సెస్ చేసుకొని ‘ఫోర్బ్స్ ప్రభావాత్మక వ్యక్తుల జాబితా’లో స్థానం సాధించగలను అంటూ దృఢంగా చెబుతోంది! ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక కూడా పెర్రీ ఇన్నోవేటివ్ ఐడియాను గుర్తించి ‘30 అండర్ 30’ జాబితాలోకి ఎంపిక చేసింది. 30 సంవత్సరాల్లోపు అద్భుతాలు సాధించిన ప్రస్తుత తరం యువతీయువకుల జాబితానే ‘30 అండర్ 30’. ప్రస్తుతం ఈ జాబితాలో ఉన్న పెర్రీ తన స్టార్టప్‌ను సక్సెస్ చేసుకొని ‘ఫోర్బ్స్ ప్రభావాత్మక వ్యక్తుల జాబితా’ లో స్థానం సాధించగలను అని దృఢంగా చెబుతోంది!