
సాక్షి, న్యూఢిల్లీ : ఎలక్ర్టిక్ వాహనాల తయారీలో ముందున్న అవాన్ మోటార్స్ ఈ రంగంలో మరిన్ని నూతన వాహనాలు ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో జెరో ప్లస్‌ను ప్రారంభించిన కంపెనీ ఈ వాహనానికి వచ్చిన స్పందనతో మరిన్ని ఈ తరహా ఎలక్ర్టిక్ స్కూటర్లు, వాహనాలను ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది.
జెరో ప్లస్ స్కూటర్లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించిందని, ఒక బ్యాటరీతో 60 కిమీ భారీ మైలేజ్‌ను ఇవ్వడంతో పాటు రూ 47,000కే అందుబాటులో ఉండటం దీని ప్రత్యేకతలని అవాన్ మోటార్స్ తెలిపింది. ఈ వాహనం విజయవంతం కావడంతో మరిన్ని ఎలక్ర్టిక్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నామని కంపెనీ బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ పంకజ్ తివారీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment