రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.కోబాల్ట్-రహిత లిథియం బ్యాటరీ టెక్నాలజీ కంపెనీ లిథియం వర్క్స్ బీవీ ఆస్తులను పూర్తిగా హస్తగతం చేసుకొనుంది. ఈ డీల్ విలువ సుమారు 61 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 465 కోట్లు).
రిలయన్స్ న్యూ ఎనర్జీ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా చైనాలోని తయారీ కేంద్రం, కంపెనీకి సంబంధించిన పేటెంట్ పోర్ట్‌ఫోలియో, కీలక వ్యాపార ఒప్పందాలు రిలయన్స్ చేతిలోకి రానున్నాయి. కొద్ది రోజుల క్రితమే సోడియం-అయాన్ సెల్ కెమిస్ట్రీలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న ఫారాడియన్ లిమిటెడ్‌ను రిలయన్స్ కొనుగోలుచేసింది.లిథియం వర్క్స్ కలయికతో గ్రీన్ ఎనర్జీ రంగంలో రిలయన్స్ ప్రణాళికలు మరింత బలపేతం కానున్నట్లు కంపెనీ అభిప్రాయపడింది. సెల్ కెమిస్ట్రీ, కస్టమ్ మాడ్యూల్స్, ప్యాకింగ్,పెద్ద ఎత్తున బ్యాటరీ తయారీ సౌకర్యాన్ని నిర్మించడంలో ఈ డీల్ ఉపయోగపడుతోందని రిలయన్స్ ఆశాభావం వ్యక్తపరిచింది.
లిథియం వర్క్స్ బీవీ సంస్థను 2017లో స్థాపించారు. ఈ కంపెనీ బ్యాటరీల తయారీలో ప్రసిద్ధి చెందింది. అమెరికా, యూరప్,చైనాలో కార్యకలాపాలు అందిస్తోంది. ఈ కంపెనీ తయారుచేసే బ్యాటరీలు పారిశ్రామికంగా, వైద్య, సముద్ర, వాణిజ్య రవాణా ఇతర అత్యంత డిమాండ్ కల్గిన రంగాల్లో వాడుతున్నారు. కంపెనీకి చెందని నానోఫాస్ఫేట్ బ్యాటరీలు అత్యంత శక్తివంతమైనవే కాకుండా, గరిష్ట జీవిత కాలాన్ని అందిస్తాయి.
చదవండి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కీలక నిర్ణయం..! ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు భిన్నంగా..!
Comments
Please login to add a commentAdd a comment