న్యూఢిల్లీ: బ్యాటరీ తయారీ కంపెనీ ఏర్పాటుపై బ్లూప్రింట్‌ను సిద్ధం చేస్తున్నట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా గ్రూప్ తాజాగా వెల్లడించింది. దేశ, విదేశాలలో భవిష్యత్ సాంకేతికతలకు అనుగుణంగా మారే(ఫ్యూచర్ రెడీ) వ్యూహాలకు తెరతీయనున్నట్లు టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు.
సీఐఐ బిజినస్ సదస్సు 2022లో ప్రసంగిస్తూ చంద్రశేఖరన్ ఇంకా పలు విషయాలు పేర్కొన్నారు. టాటా గ్రూప్ భారీ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో ఉన్నట్లు తెలియజేశారు. గ్రూప్ స్థాయిలో కార్బన్ న్యూట్రల్‌గా ఆవిర్భవించే లక్ష్యాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు వెల్లడించారు. తమకు కీలకమైన బిజినెస్‌లను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేసే బాటలో డిజిటల్, డేటా, ఏఐ తదితర సాంకేతికతలను సమీకృతం చేయనున్నట్లు వివరించారు.
చదవండి: సెంచరీ దాటింది, సరికొత్త మైలురాయి చేరుకున్న ఈవిట్రిక్!
Comments
Please login to add a commentAdd a comment