మన దేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగంలో రోజు రోజుకి పోటీ పెరిగి పోతుంది. కొద్ది రోజులు క్రితమే రెండు కంపెనీలు తమ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కూటర్లకి ప్రజల నుంచి అద్భుతమైన ఆదరణ కూడా లభించింది. దీంతో ఇతర కంపెనీలు కూడా తమ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొనిరావడానికి సిద్దం అవుతున్నాయి. తాజాగా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా మోటార్స్ త్వరలో మన దేశంలోకి తన ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకొనిరావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అతి కూడా అతి తక్కువ ధరకే అని సమాచారం.(చదవండి: అదిరిపోయే టెక్నాలజీని ఆవిష్కరించిన ఫేస్‌బుక్!)
కొద్ది రోజుల క్రితమే హోండా చైనాలో సీఎన్ వై 7499(సుమారు రూ.86,000) ధరకు హోండా యు-గో స్కూటర్ ను లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇది 1.8 కెడబ్ల్యు గరిష్ట అవుట్ పుట్ గల 1.2కెడబ్ల్యు మోటార్ సహాయంతో పనిచేస్తుంది. యు-గో టాప్ స్పీడ్ గంటకు 53 కిలోమీటర్లు. ఈ స్కూటర్ ఒకసారి చార్జ్ చేస్తే 65 కి.మీ. వెళ్లనున్నట్లు కంపెనీ పేర్కొంది. మన దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ అకస్మాత్తుగా పెరగడంతో త్వరలో ఈ స్కూటర్ మన దేశ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే యు-గో ప్రారంభించడం గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. హోండా యు-గోను కనుక రూ.86,000 కంటే తక్కువ ధరకు తీసుకోని వస్తే మార్కెట్లో నిలబడే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment