చైనాలోని డావో ఈవీ టెక్ కంపెనీ భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ కంపెనీ ఇక్కడ నుంచి యుఎస్, యూరప్ దేశాలకు ఎగుమతి చేయాలని యోచిస్తున్నట్లు తెలిపింది. భారతదేశంలో తన ఎలక్ట్రిక్ వాహనాలను(ఈవీ) లాంచ్ దిశగా అడుగులు వేస్తుంది. 2022 జనవరి మధ్యలో 'హై స్పీడ్' ఎలక్ట్రిక్ స్కూటర్ డావో 703ను ప్రారంభించాలని చూస్తుంది. ఈ స్కూటర్ కోసం బుకింగ్స్ అక్టోబర్ 14న ఓపెన్ చేశారు. కానీ, వీటి డెలివరీలు మాత్రం 2022లో చేయనున్నారు. దావో 703 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఫేమ్-II సబ్సిడీ తర్వాత రూ.86,000 ఖర్చవుతుందని కంపెనీ తెలిపింది.(చదవండి: ఏసర్ యూజర్లకు భారీ షాక్..!)
దేశీయ ఈవీ మార్కెట్లోకి ఈ స్కూటర్ విడుదల చేసిన తర్వాత అమెరికా, ఐరోపాకు ఎగుమతి చేయాలని డావో ఈవీ టెక్ చూస్తుంది. "ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు ఉత్పత్తి కేంద్రంలో తయారీ ప్రారంభించిన తర్వాత మేము చైనా నుంచి ఇక్కడికి మా ఎగుమతులను మార్చబోతున్నాము. మాకు ఇప్పటికే మార్కెట్ బేస్ ఉంది"మానీష్ సింగ్, విపీ చెప్పారు. 2019 సంవత్సరంలో కంపెనీ చైనా నుంచి అమెరికా, యూరప్ లకు 4 మిలియన్ యూనిట్లను ఎగుమతి చేసినట్లు ఆయన తెలిపారు. దేశీయ మార్కెట్ కోసం, దక్షిణ భారతదేశంలో 20 మంది డీలర్లతో ప్రారంభం కానుంది. సుమారు ఏడాదిన్నర తర్వాత 300 మంది డీలర్లతో దేశవ్యాప్తంగా ఉనికిని చాటాలని చూస్తుంది. దావో ఈవీ టెక్ మొదటి దశలో మరో 3 మోడల్స్ లాంచ్ చేయాలని యోచిస్తోంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 70కిమీ. దీనిని ఒకసారి చార్జ్ చేస్తే 100 కిమీ వెళ్తుంది.
Comments
Please login to add a commentAdd a comment