హోండా కొత్త బైక్‌, బుకింగ్స్‌ షురూ     | Honda CB 350 RS bookings start | Sakshi
Sakshi News home page

హోండా కొత్త బైక్‌ సీబీ350ఆర్‌ఎస్ బుకింగ్స్‌ షురూ    

Feb 17 2021 10:55 AM | Updated on Feb 17 2021 2:30 PM

Honda CB 350 RS bookings start - Sakshi

జపాన్‌ ఆటో దిగ్గజం హోండా తన ప్రీమియం బైకుల విభాగంలో సీబీ350ఆర్‌ఎస్‌ మోటార్‌ సైకిల్‌ను ఆవిష్కరించింది.

సాక్షి, ముంబై: జపాన్‌ ఆటో దిగ్గజం హోండా తన ప్రీమియం బైకుల విభాగంలో సీబీ350ఆర్‌ఎస్‌ మోటార్‌ సైకిల్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.1.96 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.మంగళశారం లాంచ్‌ చేసిన ఈ బైక్‌  బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. మార్చి మొదటి వారం నుంచి డెలివరీలు మొదలవుతాయి. గతేడాది అక్టోబర్‌లో ‘‘మేడ్‌ ఇన్‌ ఇండియా ఫర్‌ వరల్డ్‌’’ నినాదంతో విడుదలైన హన్నెస్‌ సీబీ 350 నుంచి వస్తున్న రెండో బైక్‌ ఇది.

సుమారు 5500 ఆర్‌పీఎం వద్ద 1.5 కిలోవాట్ల సామర్థ్యాన్ని ఉత్పత్తి చేసే 350 సీసీ ఇంజిన్‌ ఇందులో అమర్చారు. స్లిప్, అసిస్ట్‌ క్లచ్‌ సదుపాయాలను కలిగిన ఐదు స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ ఇందులో ఉంది. సెలక్టబుల్‌ టార్క్‌ కంట్రోల్, యాంటీ–లాక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థలతో పాటు డిజిటల్‌ అనలాగ్‌ మీటర్‌లను కలిగి ఉంది. హోండా కంపెనీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ‘సీబీ’ బ్రాండ్‌ వారసత్వాన్ని ఈ కొత్త సీబీ350ఆర్‌ఎస్‌ నిలుపుతుందనే ఆశాభావాన్ని హోండా మోటార్స్, స్కూటర్‌ ఇండియా ఎండీ అత్సుషీ ఒగాటా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement