BMW G 310 RR Launch In India: Check Price Specifications Inside - Sakshi
Sakshi News home page

BMW G 310 RR Sports Bike: ఇంతకంటే తక్కువ ధరలో మరే బైక్‌ లేదట!

Published Fri, Jul 15 2022 3:31 PM | Last Updated on Fri, Jul 15 2022 4:49 PM

BMW G310 RR Launched In India Prices specifications and more - Sakshi

సాక్షి, ముంబై: బీఎండబ్ల్యూ ఎఫర్డ్‌బుల్‌ ప్రైస్‌లో సరికొత్త  బైక్‌ను భారత మార్కెట్‌లో  శుక్రవారం లాంచ్‌ చేసింది.  బీఎండబ్ల్యూ తన తొలి జీ 310 ఆర్‌ఆర్‌ పేరుతో ఈ సూపర్‌  బైక్స్‌ మోడళ్లను  విడుదల చేసింది. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 2.85 లక్షలు (ఎక్స్-షోరూమ్) స్టైల్ స్పోర్ట్  వేరియంట్ ధర రూ. 2.99 లక్షలుగా నిర్ణయించింది. బీఎండబ్ల్యూ మోటోరాడ్ మోడల్స్‌కనునుగుణంగా కొన్ని కాస్మొటిక్‌ అప్‌డేట్స్‌తో ఆకర్షణీమైన రంగుల్లో తీసుకొచ్చింది. 

బీఎండబ్ల్యూ  జీ310 ఆర్‌, జీఎస్‌ అడ్వెంచర్ టూరర్ తర్వాత 310 సిరీస్‌లో బవేరియన్ బ్రాండ్‌కు సంబంధించి మూడో మోడల్ ఇది. ఇప్పటికే బుకింగ్‌లను ప్రారంభించిన కంపెనీ నెలకు రూ. 3,999ల ఈజీ ఈఎంఐ ఆప్షన్‌ను కూడా తన అధికారిక ట్విటర్ హ్యాండిల్  ద్వారా  ప్రకటించింది. 

ఈ ఫీచర్ల విషయానికి వస్తే ముందు భాగంలో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను వెనుక టెయిల్-ల్యాంప్‌లలోని బుల్ హార్న్ స్టైల్ LED ఎలిమెంట్స్‌తో పాటు, రీడిజైన్‌ ఆపరేటింగ్ సిస్టమ్  బ్లూటూత్ కనెక్టివిటీ,  5-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌, BI-LED ట్విన్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్‌,  ప్రధానంగా ఉన్నాయి.

ఈ బైక్‌లో 313  సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అమర్చింది. ఇది 9,700 rpm వద్ద 34 bhpని,  7,700 rpm వద్ద 27 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్‌ చేస్తుంది.  6 స్పీడ్ గేర్‌బాక్స్‌ అందించింది.  ఇందులో రైడ్ ,  డ్యూయల్ ఛానల్ ABS లాంటి  ఫీచర్లున్నాయి.  మార్కెట్లో  టీవీఎస్‌ అపాచీ ఆర్‌ఆర్‌210, కేటీఎం ఆర్‌సీ 390 లాంటి  బైక్స్‌కి పోటీగా నిలవనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement