ఇన్‌ఫినిక్స్‌ హాట్‌  సిరీస్‌: మరో బడ్జెట్‌ ఫోన్‌ | Infinix Hot 20 Play unveiled Here is details | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫినిక్స్‌ హాట్‌  సిరీస్‌: మరో బడ్జెట్‌ ఫోన్‌

Published Sun, Oct 23 2022 2:59 PM | Last Updated on Sun, Oct 23 2022 4:47 PM

Infinix Hot 20 Play unveiled Here is details  - Sakshi

సాక్షి,ముంబై: ఇన్‌ఫినిక్స్‌ మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది.  ఇన్‌ఫినిక్స్‌ హాట్‌  సిరీస్‌లో భారీ బ్యాటరీతోపాటు, మీడియా టెక్‌   ప్రాసెసర్‌,  పంచ్ హోల్ సెటప్‌తో  ‘ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 10 ప్లే’ స్మార్ట్‌ఫోన్‌ను రివీల్‌  చేసింది. రేసింగ్ బ్లాక్, లూనా బ్లూ, అరోరా గ్రీన్,  ఫాంటసీ పర్పుల్  నాలుగు రంగుల్లో  ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 10 ప్లే లభ్యం కానుంది. ఈ ఫోన్‌ ధర,భ్యత వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.


ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 10 ప్లే  స్పెసిఫికేషన్స్‌
6.82అంగుళాల IPS LCD డిస్‌ప్లే
1640 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్  90Hz రిఫ్రెష్ రేట్‌
 మీడియా టెక్‌ హీలియో జీ 37ప్రాసెసర్‌
 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ (విస్తరించుకునే అవకాశం) 
 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 
13 ఎంపీ రియర్‌ కెమెరా
6, 000mAh బ్యాటరీ 18W ఛార్జింగ్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement