
న్యూఢిల్లీ: ప్రభుత్వం తాజాగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు తాత్కాలిక చైర్‌పర్సన్‌గా సంగీతా వర్మను నియమించింది. ప్రస్తుత ఫుల్‌టైమ్ చైర్‌పర్శన్ అశోక్ కుమార్ గుప్తా మంగళవారం వైదొలగడంతో ప్రభుత్వం సంగీతా వర్మకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించింది.
సీసీఐలో సభ్యురాలైన వర్మ బుధవారం(26) నుంచి మూడు నెలలపాటు చైర్‌పర్సన్‌గా కొనసాగుతారు. పూర్తిస్థాయి చైర్‌పర్సన్‌ను ఎంపిక చేసేటంతవరకూ లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకూ వర్మ బాధ్యతలు నిర్వహిస్తారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. మంగళవారం రాజీనామా చేసిన గుప్తా 2018 నవంబర్‌లో సీసీఐకు చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు.